Suryaa.co.in

Andhra Pradesh

కూటమి ప్రభుత్వ హయాంలో బలహీన వర్గాలకు పెద్దపీట

– బీద రవిచంద్ర కు మంత్రి సుభాష్ అభినందనలు

అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఖరారైన బీద రవిచంద్రకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందనలు తెలియజేశారు. ఎస్సీ, బీసీలకు పదవులు కేటాయించడంలో, ప్రాధాన్యత ఇవ్వడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారన్న మంత్రి సుభాష్. టీడీపీ అంటేనే బీసీ పక్షపాతి అని, ప్రాంతాలు, సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు బీసీల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎమ్మెల్సీలుగా ఎంపిక అయిన కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులకు కూడా మంత్రి సుభాష్ అభినందనలు తెలియజేశారు.

LEAVE A RESPONSE