– కిడ్నాప్ కేసు పెట్టిన పోలీసులు
పెళ్లయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న 28 ఏళ్ల మహిళ 15 ఏళ్ల బాలుడిని తీసుకువెళ్లిపోయిన అమానవీయ సంఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. బాలుడి తండ్రి సుందర రాజు ఫిర్యాదు మేరకు గుడివాడ టూ టౌన్ పోలీసులు స్థానికంగా ఉండే స్వప్న అనే మహిళపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో యువత చెడు మార్గంలో పయనిస్తున్న అనేక ఉదంతాలు ఇప్పటికే వెలుగు చూశాయి, ఈ తరహాలోనే పట్టణంలోని గుడ్ మెన్ పేటలో కుటుంబంతో కలిసి నివాసముండే స్వప్న అనే మహిళ , తన ఎదురింటిలోని ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలుడితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంది.ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ నుండి మహిళా, బాలుడు అదృశ్యం కావడంతో అనుమానాలకు తావిస్తుంది. భర్త పిల్లలు ఉన్న మహిళ, మైనర్ బాలుడిని తీసుకువెళ్లడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. బాలుడు తండ్రి సుందర రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. స్వప్న డబ్బులు కోసమే బాలుడిని అపహరించిందా, లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్వప్న మాయమాటలతో బాలుడిని తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని టూ టౌన్ సీఐ దుర్గారావు మీడియాకు తెలిపారు.