Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా

సత్తెనపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి పట్టణం 13వ వార్డు దాసరి కోటేశ్వరరావు మాస్టర్ గృహం వద్ద సోమ‌వారం ఉపాధ్యాయులు, ఎంప్లాయిస్ తో సమావేశం జ‌రిగింది. ఎమ్మెల్యే కన్నా ల‌క్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ అందరూ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి బలపరిచిన అలపాటి రాజాకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, వేములకొండ శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE