– ‘బీఆర్ఎస్, కాంగ్రెస్’ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివి
– కాంగ్రెస్ లో 30 మంది అభ్యర్థులకి కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నది వందకి వందశాతం నిజం
– బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్
బండి సంజయ్ కి ఎవరో హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. బిజెపిలో ఎవరి ప్రాధాన్యత వారికే ఉంటుంది. బండి సంజయ్ పాదయాత్రలతో… అధికార బీఆర్ఎస్, దాని బీ టీమ్ అయిన కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టాయి.బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందం జగమెరిగిన రహస్యమే.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులు పంపించారు.2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లారో… ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ లో గెలిచే ఎమ్మెల్యేలు… చివరికి వెళ్ళేది బీఆర్ఎస్ పార్టీలోకే.
‘బీఆర్ఎస్, కాంగ్రెస్’ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివి.చివరికి కాంగ్రెస్ పార్టీలో టిపిసిసి సహా… ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలో డిసైడ్ చేసేది ప్రగతి భవన్ నుంచి కేసీఆరే . తెలంగాణ లో కాంగ్రెస్ కు ఓటేస్తే… బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టే. తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక పార్టీ మోడీ నేతృత్వంలోని బీజేపీనే. బండి సంజయ్ పాదయాత్రతో బిజెపికి పెరిగిన గ్రాఫ్ ను చూసి కేసీఆర్ గుండెల్లో వణుకు మొదలైంది.
అందుకే కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారు.అన్నీ తెలిసినా కూడా… పొన్నం ప్రభాకర్ ఏమీ తెలియనట్టు మాట్లాడడం హాస్యాస్పదం.కాంగ్రెస్ లో 30 మంది అభ్యర్థులకి కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నది వందకి వందశాతం నిజం. మోడీ పాలనలో అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయం. అది ఎవరైనా సరే.