Suryaa.co.in

Andhra Pradesh

మోదీ అంటే జగన్‌కు కేసుల భయం

-షర్మిలను గెలిపిస్తామని మాటివ్వండి
-రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ఎప్పుడూ భాజపాకు వ్యతిరేకమే
-జగన్ మాత్రం భాజపాను పల్లెత్తు మాట కూడా అనట్లేదు
-మోదీ కొందరినే కోటీశ్వరులను చేశారు
-భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి
-సీఎం పదవి చేపట్టగానే జగన్ మారిపోయారు
-కడప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ

కడప: తన తండ్రికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు లాంటివారని రాహుల్ గాంధీ అన్నారు .వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముడు లాగా ఉండేవారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చలేదని స్పష్టం చేశారు. ఎవరో వారి స్వలాభం కోసం చేసిన పని ఇది అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ విలువలు, సిద్ధాంతాలు పార్లమెంటులో వినపడాలంటే, తన సోదరి వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరారు. ఆమెను గెలిపిస్తామని ప్రజలు తనకు మాటివ్వాలన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద రాహుల్ నివాళులర్పించారు.

“రాజశేఖర్ రెడ్డి ఏపీకే కాదు.. దేశం మొత్తానికే దారి చూపించారు. భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి. పాదయాత్రల ద్వారానే ప్రజల సమస్యలు తెలుస్తాయని భారత మొత్తం చేపట్టాలని వైఎస్ఆరే నాకు చెప్పారు. తండ్రిలా ఆయన మార్గదర్శనం చేశారు. ఢిల్లీలో ఏపీ ఆలోచనలను ప్రతిధ్వనించేవారు. వైఎస్ఆర్ సిద్ధాంతమే కాంగ్రెస్ సిద్ధాంతం. రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ఎప్పుడూ భాజపాకు వ్యతిరేకమే.

జగన్ మాత్రం భాజపాను పల్లెత్తు మాట కూడా అనట్లేదు. అందుకు కారణం.. ఆయనపై ఉన్న అవినీతి కేసులే. విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఎన్నో హామీలిచ్చింది. ప్రత్యేకహోదా, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్.. ఇలా ఎన్నో హామీలు నెరవేరలేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇవన్నీ పూర్తయ్యేవి. మేం అధికారంలోకి వస్తే ఇవన్నీ నెరవేరుస్తాం. పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తాం.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తాం. రెండు లక్షల రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. పేదలకు రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తాం. మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తాం. మోదీ కొందరినే కోటీశ్వరులను చేశారు. మేం లక్షలమందిని చేస్తాం. కొందరు మమ్మల్ని పేదలను సోమరిపోతులను చేస్తున్నామంటున్నారు. మోదీ కొదరికి రూ.లక్షల కోట్ల మేలు చేస్తే దాన్ని అభివృద్ధి అంటున్నారు. మేం చేయాలనుకున్నది చేసి చూపిస్తాం. రైతు రుణమాఫీ చేసి తీరుతాం. భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ప్రజలు భాజపాకు ఎలా బుద్ధిచెబుతారో చూడండి” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైకాపా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “గత ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేస్తోందన్నారు. వాళ్లు ఏ బ్రాండ్ మద్యం అమ్మితే అదే కొనాలి.. తాగాలి. అన్నీ మాఫియాలే.. ల్యాండ్, శాండ్, లిక్కర్. సొంత చిన్నాన్నను చంపిన వారిని జగన్ వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. ఐదేళ్లుగా నిందితుడిని కాపాడటమే కాదు.. మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇలాంటి అన్యాయాలు ఎదుర్కొనేందుకే నేను ఎంపీగా పోటీచేస్తున్నా. సీఎం పదవి చేపట్టగానే జగన్ మొత్తం మారిపోయారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరి.. ఆ తర్వాత అవసరం లేదన్నారు.

LEAVE A RESPONSE