Home » మూడు రాజధానులని కుచ్చుటోపీ పెట్టాడు

మూడు రాజధానులని కుచ్చుటోపీ పెట్టాడు

-జగన్‌ను గెలిపిస్తే మాఫియా రాజ్యమే
-పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

రాష్ట్రం మొత్తం మాఫియా మయమైంది.. హత్యా రాజకీయాలు తప్ప మరొకటి లేదని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. కడపలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బహిరంగ సభలో ప్రసంగించారు. వివేకా హంతకుడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. వైఎస్‌ పేరును సీబీఐ చార్జిషీట్‌లో పెట్టించి పొన్నవోలుకు పదవి ఇచ్చారు. ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం. ఎవరి వైపు నిలబడతారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఈ పదేళ్లలో విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి వెన్ను పోటు పొడిచిందన్నారు. బీజేపీతో బాబు పొత్తు, జగన్‌ తొత్తులుగా మారి విభజన హామీలను తాకట్టు పెట్టారు. అందరికీ రాజధానులు ఉన్నాయి..మనకు చేతిలో చిప్ప ఉంది. నెత్తిమీద కుచ్చుటోపీ ఉంది. చంద్రబాబు సింగపూర్‌ అన్నాడు.. జగన్‌ మూడు రాజధాను లు అన్నాడు. వాషింగ్టన్‌ తలపించే రాజధాని అన్నాడు. పదేళ్లు చేసింది గుండు సున్నా.. ఒక్క హామీ నెరవేర్చలేదు. సంక్రాంతికి జాబ్‌ క్యాలెండర్‌ వచ్చిందా? మద్యపాన నిషేధం చేశారా? ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్‌లు ఇక్కడే ఉన్నాయి. వాళ్లు ఏది అమ్మితే అదే తాగాలి. బూమ్‌ బూమ్‌, క్యాపిటల్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌ అంట. ఇటువంటి ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.

Leave a Reply