Suryaa.co.in

Features

‘నేను’ నశిస్తేనే మోక్షం !

– అహం ఉన్నంతవరకూ మోక్షం సాధ్యం కాదు

మహాజ్ఞాని అయిన జనక మహారాజు మోక్షం సిద్ధించే మార్గం చెప్పినవారికి రాజ్యంలో భాగమిస్తానని ప్రకటించాడు.
విషయం తెలుసుకున్న ఓ మహర్షి గుర్రం ముందుకు జాపిన కాలును వెనుకకు తీసేంత వ్యవధిలో మోక్షమార్గం బోధిస్తానన్నాడు.
అదంత సులువైతే రుషులు ఏళ్ళ తరబడి ఎందుకు తపస్సు చేస్తున్నారని ఆశ్చర్యపోయాడు మహారాజు.
‘ముందు నేనడిగేదానికి జవాబిస్తే తమరి సందేహం తీరుస్తాను రాజా ! నేను ఎప్పుడు మోక్షం పొందుతాను ?- అన్నదే ప్రశ్న’ అన్నాడు మహర్షి.
జనకుడు, సభలో ఉన్న పండితులు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయారు.
మహర్షి నవ్వి ‘రాజా ! ప్రశ్నలోనే జవాబున్నా తమరు గ్రహించలేదు’ అన్నాడు.
జనకుడు మళ్ళీ ఆలోచించినా ఫలితం లేకపోయింది. ‘అహం ఉన్నంతవరకూ మోక్షం సాధ్యంకాదు. ప్రశ్నలో ముందున్న ‘నేను’ అనే రెండక్షరాల అహం నశిస్తే మోక్షం లభిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా అదెంత సులువో ?!’ అన్నాడు.
జనక మహారాజు మహర్షిని అభినందించి రాజ్యంలో భాగం ఇవ్వబోతే.. ‘రాజ్యం క్షత్రియ భోజ్యం. తాపసినైన నాకు దాంతో పనేముంది ?’ అంటూ వెళ్ళిపోయాడు.!!

– ఎంబిఎస్ గిరిధర్

LEAVE A RESPONSE