ఆకాశవాణి ఇంటర్వ్యూ లో రచయిత శ్రీపాద శ్రీనివాసు
హైదరాబాద్ లో స్ధిరపడ్డ రాజమండ్రికి చెందిన ఔత్సాహిక రచయిత శ్రీపాద శ్రీనివాసు ను ఇంటర్వ్యూ చేసిన కార్యక్రమం ఈ రోజు (06.10.2023) ఆకాశవాణి-హైదరాబాదు కేంద్రం వారు ప్రసారం చేశారు.
తాను చేసే వృత్తి రాజకీయ పరమైన నేపధ్యం ఉన్న ఉద్యోగం అయినప్పటికి ప్రవృత్తిగా చేపట్టిన కధలు, కధనికల రచనలతో ఇటీవల శ్రోతలను ఆకట్టు కుంటున్నాడు శ్రీపాద శ్రీనివాస్. అతి తక్కువ కాలంలోనే ఇప్పటి వరకు 30-35 కధలు, కధానికలను శ్రీనివాస్ వ్రాసారు. అందులో అనేకం ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ కేంద్రం ద్వారా తన స్వరంతోనే వినిపించారు. ఈ కారణంగా ఆల్ ఇండియా, రేడియో, హైదరాబాదు కేంద్రం (ప్రసార భారతి విభాగం) ద్వారా “ఆర్టిస్ట్ బుకింగ్ సిస్టమ్” కళాకారునిగి గుర్తింపబడ్డాడరు.
గోదావరి ప్రాంత యాసతో, రాజమండ్రి ప్రాంత గొప్పతనాన్ని విశిష్టితలను కీర్తిస్తూ ఆద్యంతం ఈ ఇంటర్వూ కార్రక్రమం రసవత్తరంగా జరిగింది. 15 ని.లపాటు జరిగిన ఈ ఇంటర్వూను ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి శ్రీ వి.గోపిచంద్ గారు చక్కగా నిర్వహించారు.
రాజకీయ పరమైన వ్యాసాలు, ప్రసంగాల కూర్పులో ప్రవేశం ఉన్నప్పటికి “గోదావరి అలలలో అమ్మ పిలువు” అనే కధ తన మొదటి రేడియో కార్యక్రమాం అని శ్రీనివాసు అన్నారు. అటు పిమ్మట 12 రేడియో కార్యక్రమాల రచన, మరియు “గుండె చప్పుళ్ళు”… “చట్ట సభల్లో గోదావరి గళం”… “మనసున ఉన్నది”..అనే మూడు పుస్తక రచనలను చేయడం జరగిందని సదరు ఇంటర్వూలో శ్రీపాద అన్నారు. అదే విధంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారి పేరున నెలకొల్పబడిన స్మారక ఆవార్డు కూడ దక్కిందని అన్నారు. 75 సంవత్సరాల మనదేశ స్వాతంత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ తరుణాన ఈస్ధాయి ఆవార్డు రావడం తన పూర్వ జన్మ సుకృతమని అ ఇంటర్వూలో శ్రీనివాస్ పేర్కొన్నాడు.
ఇంత ఖ్యాతికి కారణం చారిత్రాత్మిక నగరానికి చెందిన రాజమండ్రి ప్రాంతం వాడిని కావడం.. ఇక్కడ మున్సిపల్ టౌన్ హైస్కూల్ చెందిన చిన్ననాటి స్నేహితులతోపాటు తెలంగాణ ప్రాంతంలోని మిత్రుల సహాకారం, తోడ్పాటు కూడ ఒక కారణమని శ్రీనివాస్ అన్నారు.
మీరు రాసే కధలకు, కధానికలకు ప్రేరణ ఏమిటి… అనే రేడియో వారి ప్రశ్నకు శ్రీపాద సమాధానం ఇస్తూ….
“ నా చుట్టూ జరిగే సంఘటనలు… నా స్వీయ అనుభావాలే నా రచనలకు ప్రేరణలు… అయా సంఘటనలకు కాస్త నాటకీయతను జోడించి కధలు, కధానికులుగా వ్రాస్తు ఉంటాను. పలు సందర్భాల్లో అయా కధలు, కధానికల నుండి అనేక మంది నుండి ప్రశ్నంసలు, కొద్దిమంది నుండి చివాట్లు కూడ పడుతూ ఉండేవాడిని. అయినా సరే రచనల విషయంలో నా పంథాను మాత్రం విడవలేదు’…. అంటూ శ్రీపాద సమాధానం ఇచ్చారు.
అంతేకాక “కళలు-కళాకారులు రాణించాలి అంటే రాజ ఆధరణ అని వార్యం” అనే నానుడి అందరికి తెల్సిందేనని…అయితే ఇప్పుడు రాజులు, రాజరిక వ్యవస్ధనలు లేవు…కాని..కవులు, కళాకారులను ప్రొత్సహించే విషయంలో ఆల్ ఇండియా రేడియో వారు ముఖ్యంగా హైదరాబాదు కేంద్రం వారు చక్కగా తమ పాత్రను పోషిస్తున్నారు అని శ్రీపాద అన్నారు.
మీరు రేడియో కార్యక్రమాల పట్ల ఎప్పుడు, ఏ విధంగా ఆకర్షితులు అయ్యారు?
మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న రేడియో కార్యక్రమాల గురించి చెప్పండి అన్న ఒక ప్రశ్నలకు శ్రీపాద శ్రీనివాసు సమధానం ఇస్తూ….
“ చిన్నతనం నుండె మా తల్లి తండ్రులు రేడియో కార్యక్రమాలను వినడం అలవాటు చేశారు.. ఆ విధంగా రేడియోలో ప్రసారం అయ్యే వివిధ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగింది.”
“అప్పట్లో ప్రసారం కాబడిన “ బావగారి కబుర్లు” …”ఉషశ్రీ గారి ప్రవచనాలు .. పాడి పంటలు… కార్మికుల కార్యక్రమం…వేకువ జామునే ప్రసారం కాబడిన “సూర్యష్టకం”… ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వార్తలతో కూడిన “వార్త తరంగిణి” వంటి కార్యక్రమాలు బాగా ఆకట్టుకున్నాయని శ్రీనివాసు అన్నారు.
“ అప్పట్లో దూదదర్శన్ ప్రసారాల పరిధి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యి ఉండేది.. అందుకే అంతర్జాతీయ క్రీడల పోటీల ప్రసారాల్ని రేడియో ద్వారానే వినేవాళ్లం… క్రికెట్ కామెంటరీ మెదలైనవి అప్పట్లో ఆందర్నీ అలరిస్తుఉండేవి…
అంతేకాక అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మరణం వార్త రేడియో ద్వారానే విని చలించిపోయాం… 1977 సం. ప్రాంతంలో స్తైలాబ్ ప్రమాదం భారత్ కు తప్పిందనే వార్త రేడియో ద్వారానే విని మా రేడియో సెట్ లను ముద్దాడాం ఆనందంతో… ఇవన్నీ మరిచిపోలేని అనుభూతులు అని శ్రీపాద శ్రీనివాసు పలు ప్రశ్నలకు తన సమాధానంలో పేర్కొన్నారు.
మీ రచన వ్యాసంగాలు గురించి ఓ నాలుగు ముక్కల్లో చెప్పండి అన్న ప్రశ్నకు శ్రీపాద సమాధానం ఇస్తూ…..
“ నా మొట్టమెదటి రచన గోదావరి అలలలో అమ్మ పిలుపు రేడియోలో ప్రసారం కాబడింది. అటు తరువాత రేడియో లో ఉన్నతాధికారిగా పనిచేసి ఇటీవలనే రిటైర్ కాబడిన గోపిచంద్ గారు రచన రంగంలో నన్ను ఎంతో ప్రోత్సాహించారు… వీరితో పాటు మరికొందరు ఉన్నతాధికారుల తోడ్పాటుతో 10 కార్యక్రమాలు నా స్వీయ వాయిస్ మరియు రచనలు ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారం అయ్యాయి.
“గోదావరి అలలలో అమ్మ పిలుపు”… “నిరీక్షణ”… “ వందే భారత్ ట్ర్తైన్ లో నా తొలి ప్రయాణం”… “అమ్మ ఒడి”.. “అమ్మ బీరువా”… “వాస్తవికతకు దర్పణాలు.. వాట్సప్ గ్రూపులు”…
“ఆత్మ బంధం”… “అంతరాత్మ-పరమాత్మ”.. “పండుటాకు”…” ఆత్మ వేదన” వంటివి ఆల్ ఇండియా, రేడియో, హైదరాబాదు కేంద్రం ద్వారా నా స్వీయ వాయిస్ తో ప్రసారం కాబడ్డాయి.