‘ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ‘శకపురుషుడు ‘ ప్రత్యేక సంచికను తొమ్మిది నెలలు శ్రమించి తీసుకొచ్చామని , ఇది ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండాలని చైర్మన్ టీ. డీ. జనార్థన్ తెలిపారు. అన్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఉత్తర కరోలినా లోని చార్లెట్ నగరంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో జనార్దన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .
జనార్దన్ మాట్లాడుతూ .. ఎన్ .టి .ఆర్ .శాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, వారి స్మృతి ఎప్పటికీ ఈ భూమ్మీద ఉండాలనే ఉద్దేశ్యంతో అన్నగారి శాసన సభ ప్రసంగాలు , చారిత్రిక ప్రసంగాలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబించి విధంగా ‘శకపురుషుడు ‘ ప్రత్యేక సంచికను వెలువరించామని చెప్పారు.
తాను చైర్మన్ గా , కమిటీలో షరీఫ్ , రావుల చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి అశ్విన్ , కంఠంనేని రవిశంకర్, కాట్రగడ్డ ప్రసాద్ , విక్రమ్ పోలా , భగీరథ , అట్లూరి నారాయణ రావు , శ్రీపతి సతీష్ , రఘురాం కాసరనేని , సతీష్ మండవ, దొప్పలపూడి రామమోహన్ రావు, పారా అశోక్ , మధుసూదన రాజు వున్నారు , అందరూ అన్నగారి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అహోరాత్రులు శ్రమించారు . మాకు అండగా చంద్ర బాబు నాయుడు గారు , నందమూరి బాల కృష్ణ గారు , నందమూరి రామ కృష్ణ గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారని జనార్దన్ చెప్పారు .
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్న ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని మహాసంకల్పంతో వున్నాము , ఈ బృహత్ కార్యక్రమం లో అమెరికాలో ఉంటున్న తెలుగు వారు భాగస్వాములు అవుతామని చెప్పడం మాకు కొండంత బలాన్ని ఇచ్చిందని జనార్దన్ చెప్పారు.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా అట్లూరి అశ్విన్ వ్యవహరించారు , అన్నగారి అభిమానులు , తెలుగు దేశం పార్టీ నాయకులు 300 మందికి హాజరయ్యారు .