జగన్.. పాక్ వైపు ఉంటారా? భారత్ వైపు ఉంటారా తేల్చండి

– గుంటూరులో ఉన్న జిన్నా టవర్ పేరు తొలగించాలి
– లేదా మేమే పడగొడతాం
– బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

నెల్లూరు : దేశాన్ని విభజించిన , జాతి వ్యతిరేకి హిందు ద్వేషి అయిన జిన్నా పేరు తొలగించకపోవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. విభజన తొలి నాళ్ళలో హిందువుల ఊచకోతకు కారకుడయిన జిన్నా పేరును తొలగించి, దేశ భక్తుడు కలామ్ గారి పేరు పెట్టాలి. పెట్టకపోతే ఆ టవర్ ని కూల్చడానికి దేశభక్తి కలిగిన యువత సిద్ధం అని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జగన్ మతతత్వ జిన్నా వైపా – జాతీయ వాదం వైపా? జగన్ పాకిస్థాన్ వైపా – భారత్ వైపా?
విభజన అనంతరం పాకిస్థాన్ లోని 6 సం హిందు బాలిక నుండి, 60 సంవత్సరాల మహిళలను మానభంగాలకు కారకుడి వైపా జగన్ తేల్చుకోనే సమయం ఆసన్నమైంది.నిజమైన దేశభక్తి ఉన్న క్రైస్తవులు కూడా దీనిపై నోరు విప్పాలి. అదేవిధంగా బీజేపీ ప్రజాగ్రహ సభకు ముందు “జగనన్న రాజ్యం ” బిజెపి సభ అనంతరం “రామరాజ్యం” అని సజ్జల అంటున్నారు. ఇది బిజేపి సత్తా అంటే.

సభ విజయవంతం అవడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వైసీపీ మంత్రులు ,MLA లు ఇష్టారీతీగా మాట్లాడితున్నారని అవి చేతకాని మాటలు అని తెలిపారు. జగన్… మీరు పదే పదే నిరుద్యోగుల గురించి మాట్లాడిన మీరు, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను గాలికి వదిలేయడం ఏంటి ? వారికి న్యాయం చేస్తారా లేదా? వారికోసం బీజేపీ భవిష్యత్లో ఉద్యమాలు చేయాలా అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంత్రి నారాయణ స్వామి చేతగాని మాటలు ఆపి ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ప్రసిడెంట్ భరత్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply