Home » పెద్దమనిషి మానసికంగా అధైర్య పడతాడనుకుంటున్నారేమో…అది ఎన్నటికీ జరగదు

పెద్దమనిషి మానసికంగా అధైర్య పడతాడనుకుంటున్నారేమో…అది ఎన్నటికీ జరగదు

– వివేకానుచంపింది తానేనన్న వాస్తవం ప్రజలకు తెలియకూడదనే జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీలో చంద్రబాబుని వ్యక్తిగతంగా దూషించేలాచేశాడు.
– టీడీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడకండి. ఇప్పుడు చేసిన వాటికి ఈ జగన్మోహన్ రెడ్డికి అట్టుకి అట్టున్నర ఇచ్చి తీరుతాం.
– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
మందిబలం, మదబలముంది కదాఅని పందుల్లా వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవర్తిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి శునకానందం పొందాడని, ప్రజాసమస్యల పరిష్కారానికి, ప్రభుత్వాన్నినడపటానికి, చట్టాలు చేయడానికి కేంద్రబిందువుగా ఉండాల్సిన అసెంబ్లీలో నేడు ఏంజరిగిందో 5కోట్లమంది ప్రజలు గమనించాలని టీడీపీపొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రివర్యులు నక్కాఆనంద్ బాబు సూచించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
నేడు అసెంబ్లీలో జరిగిన సంఘటనను 5కోట్లమంది ప్రజలు గమనించాలి. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నిజాలు అసెంబ్లీలో టీడీపీ చర్చకు పెడుతుందని, ఆ నిజాలు బహిర్గతంకాకూడదనే జగన్మోహన్ రెడ్డి, ఆయన తాబేదార్లు పథకంప్రకారమే అసెంబ్లీలో చంద్రబాబునాయుడిపై వ్యక్తిగత దూషణలకు తెగబడ్డారు. ఇటువంటి దారుణం జరగడం ప్రజలంతా బాధపడాల్సిన అంశం. చంద్రబాబునాయుడికి ఇలా జరిగింది.. ఆయన నష్టపోయాడు.. అవమానింపబడ్డాడని ఎవరైనా అనుకుంటే అది పెద్దపొరపాటు. ఎందుకంటే ఉమ్మడిరాష్ట్రంలో గానీ, విభజనానంతర ఏపీనికానీ చంద్రబాబునాయుడుఎలా పరిపాలించారో అందరికీ తెలుసు.
రాజకీయాలను ఆయన ఎప్పుడూగౌరవ ప్రదంగానేచూశారు. అలాంటివ్యక్తిని పిల్లచేష్టలతో అవమానించి, గొప్పవిజయం సాధించినట్లు శునకానందం పొందుతున్నారు. చంద్రబాబునాయుడి వ్యక్తిత్వం, పాలన ఎలాఉంటాయో ప్రజలకు బాగాతెలుసు. మందిబలం, మదబలంతో పందులమందలా అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకొని, ప్రతిపక్షసభ్యులపైపడి రాజ్యాంగవిలువల్ని తుంగలో తొక్కారు. ఈ ముండలకు ఉన్నదేంటి…మాకు లేనిదేంటి? శాసనసభ్యులుగా, మంత్రులుగా మేమూ పనిచేశాము..అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిపాము.
ఏనాడూకూడా అధికారం అడ్డుపెట్టుకొని ఎదుటివారిని అవమానించడం, అవహేళనచేయడానికి, కక్షసాధింపులకు పాల్పడలేదు. అదేచేసుంటే, ఇప్పుడు ఎగిరెగిరిపడుతున్న వైసీపీవాళ్లు ఉండేవాళ్లా? ఎమ్మెల్యేలై నేడు అసెంబ్లీలో విర్రవీగుతున్నవారంతా అక్కడ ఉండేవారా? 151మందిని ప్రజలు గెలిపించింది..ఇలాంటిచీప్ పాలిటిక్స్ చేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు పొరపడి, ఒక్క అవకాశమిద్దామని ఇచ్చారు.. అంతే. దాన్ని సద్వినియోగం చేసుకొని, రాష్ట్రానికి ప్రజలకు మేలుచేయాలి గానీ, ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేయడమే గొప్పతనమన్నట్టుగా వ్యవహరించడం సరికాదు.
35వేల ఓట్లున్న కుప్పం నగరపంచాయతీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మూడునెల్లు తిష్టవేసి, రూ.100కోట్లు ఖర్చుపెట్టి, పక్కరాష్ట్రాలనుంచి ఓటర్లనురప్పించి గెలవడం ఘనకార్యమా? ఓటుకి రూ.10వేలిచ్చి ఓట్లేయించి, భయానకవాతావరణం సృష్టించి, పోలీస్ వ్యవస్థసాయంతో గెలిచారు. అదే పెద్ద గొప్పయినట్టు మిడిసిపడుతున్నారు. అదిబలుపుకాదు.. వాపని గుర్తుంచుకోండి. కుప్పం ఫలితంతోనే అంతా ఒరిగిపోయిందన్నట్లు, చంద్రబాబును చూడాలని ఉందంటూ శునకానందం పొందుతావా? నీ బాబాయ్ ని చంపినదానిగురించి చెప్పు.. 2019 ఫిబ్రవరి నీ బాబాయ్ హత్యజరిగితే ఆరోజున చంద్రబాబుపై నిందలేశావు. ఇప్పుడు అలానే మాట్లాడుతున్నాడు సిగ్గులేకుండా.
అధికారంలోకి వచ్చినా నిందితులనుపట్టుకోలేకపోయావు. నీచెల్లి సునీత ఏమన్నదో మర్చిపోయావా? టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడు సీబీఐ నివేదిక వేయాలన్నావు.. ఎన్నికల ముందు సీబీఐ వివరాలు బయటకు రాకూడదంటూ హైకోర్ట్ నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నావు. నీచెల్లి ఢిల్లీలో వీధులన్నీతిరిగి ఏడ్చి సీబీఐని కలిసేవరకు నువ్వు పట్టించుకోలేదు. ఈనాడు వివేకాహత్య వెనుక వై.ఎస్.అవినాశ్ రెడ్డి, ఆయనతండ్రి భాస్కర్ రెడ్డిల హస్తముందని తెలియబట్టే ఉలిక్కిపడుతున్నావు. వివేకాహత్య వెనకుంది..నీపార్టీ వారుకాదు.. నువ్వే జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షం దానిపై మాట్లాడుతోందనే వ్యక్తిగతంగా పెద్దమనిషిని తిట్టించావు.
పెద్దమనిషిపై బురదజల్లితే, ఆయన మానసికంగా అధైర్యపడతాడని, నిర్వీర్యమవుతాడని అనుకుంటున్నావేమో…అది ఎప్పటికీజరగదు. నీ పార్టీఎమ్మెల్యేలు తిడుతుంటే నువ్వు శునకానందం పొందుతావా? ఎవడు ఎక్కువ తిడితే వాడికి ఎక్కువ మార్కులేస్తావా? అదికాదు గొప్పతనం, మగతనం, అదికాదురాజకీయం. రాజకీయం ఎలా చేయాలో అలానే చేయ్.. ఎలాచేయాలో మాకు నేర్పించావు.. నువ్వుచేసిన దానికి వందరెట్లు చూపించకపోతే చూడు. భవిష్యత్ లో మిమ్మల్ని గుడ్డలు ఊడదీసి కొట్టకపోతే చూడండి.
ఇప్పటివరకు ఇలాచేయకుండా మేము తప్పుచేశాం. ఇకపై అలా ఉండదు. మేము, మా ఆలోచనలు కూడా మారాయి. రాబోయేరోజుల్లో కిందిస్థాయికార్యకర్తలకు భరోసాఇస్తాం. వివేకాహత్యపై గ్రామస్థాయిలో చర్చజరిగేలాచేస్తాం. జగన్మోహన్ రెడ్డే తనబాబాయిని చంపాడని జనానికి తెలిసేలాచేస్తాం. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాత్రేమిటో తేల్చేవరకు వదిలేదిలేదు. చంద్రబాబునాయుడు కన్నీరుపెట్టడం రాష్ట్రానికే అరిష్టం. కార్యకర్తలెవరూ మనోస్థైర్యంకోల్పోవాల్సిన పనిలేదు. ఇప్పుడు చేసేవారికి, చేస్తున్నవారికి అట్టుకి అట్టున్నర ఇచ్చే తీరుతాం.

Leave a Reply