– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
– తెదేపా శ్రేణులతో కలిసి లోకేష్ పుట్టిన రోజు వేడుక
నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు తి తంగిరాల సౌమ్య కార్యాలయం నందు మంగళవారం నాడు యువగళం అధినేత,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పట్టణ తెదేపా కౌన్సిలర్లు,యువత,తెదేపా శ్రేణులతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని అనంతరం నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
ప్రభుత్వ దుర్మార్గాలపై గళమెత్తి యువగళం గా తన దారిని ప్రజాగళం గా మార్చుకున్న యువనేత నారా లోకేష్. టిడిపి నాయకత్వ శిక్షణ శిబిరాల ద్వారా 25 వేల మంది యువనాయకుల్ని తయారు చేసిన కార్యక్రమ రూపకర్త నారా లోకేష్.30 ఏళ్ల వయస్సులోనే ముఖ్యమైన 3 శాఖల మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ,స్కోచ్ అవార్డులు దక్కాయి. ఎన్నో మాటలు ఇంకెన్నో అవమానాలు అన్ని దాటి తన సమర్థతతోనే సమాధానం చెప్పి అధికార పార్టీ నేతల నోళ్లు మూయించిన నేత మన నారా లోకేష్. కార్యకర్తల్లో ధైర్యం నింపిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.