కేటీఆర్‌,హరీష్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ అడగాలి

-అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకువచ్చారా?
-పదేండ్ల తర్వాత ఉద్యమకారులు గుర్తుకువచ్చారా?
-పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెడ్తరు
-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేడు -నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమీక్షల పేరుతో రోజుకో కొత్త మాట చెబుతున్నరు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన వారికే గుర్తింపు ఇస్తామంటూ హరీశ్ రావు అంటున్నడు. పదేళ్లు అధికారంలో ఉండి.. అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకువచ్చారా.. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని మాటలు చెబుతున్నరు. పదేండ్ల తర్వాత ఉద్యమకారులు గుర్తుకువచ్చారా..?

అసలు ఉద్యమకారులకు సీట్లు, పార్టీలో కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తామనే మీ మాటలకు కట్టుబడి ఉండే చిత్తశుద్ధి ఉందా..? పార్లమెంటు ఎన్నికల్లో మీ నీతి, నిజాయితీ నిరూపించుకోవాలి. జై తెలంగాణ అంటూ ఉద్యమించి బలిదానమైన కుటుంబాలకు అన్యాయం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యమకారులు గుర్తుకువస్తారు. మలిదశ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, కార్యకర్తలకు అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలి.

హరీశ్, కేటీఆర్ ఇద్దరు.. కొత్త అమరవీరుల స్థూపం దగ్గర చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, అసలుసిసలైన కార్యకర్తలకే ఎన్నికల్లో సీట్లు ఇస్తామని ప్రమాణం చేయాలి.

మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్ ఎంపీ టికెట్లు బీఆర్ఎస్ అమ్ముకుందనే ఆరోపణలు వినపడుతున్నాయి. రింగురోడ్డు సమీపంలోని వందలకోట్ల విలువైన భూములు అమ్మి సంపాదించుకున్న వారికి, మల్లన్నసాగర్, పోచమ్మసాగర్ పేరిట రైతుల భూములను ముంచి నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేసినోళ్లకు మెదక్ సీటు అమ్ముకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. హరీశ్, కేటీఆర్ లకు సీట్లు అమ్ముకోవడం తప్ప ఉద్యమకారులు, కార్యకర్తలను గౌరవించింది లేదు.

బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ ప్రచారం చేస్తున్నడు. నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో స్వయంగా ప్రధాని మోదీ కేసీఆర్ బండారాన్ని బట్టబయలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తన కొడుకును సీఎంగా చేస్తానని, అందుకు ప్రధాని ఆశీస్సులు ఉండాలని కోరాడని, అందుకు తిరస్కరించినట్లు సాక్షాత్తు మోదీ స్పష్టంగా చెప్పారు.

ప్రపంచంలోని హిందూ బంధువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలోని రామమందిరం నిర్మాణం కోసం బీజేపీ కొట్లాడింది. రామమందిరానికి వ్యతిరేకంగా అడ్వొకేట్లను పెట్టి అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్.బీజేపీకి మరే పార్టీతో చేతులు కలపాల్సిన అవసరం లేదు. అలాంటి కుత్సిత మనస్తత్వం బీఆర్ ఎస్ ది మాత్రమే.

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తరలివెళ్తే.. కాంగ్రెస్ మాత్రం తిరస్కరించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెడ్తరు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. కేటీఆర్, హరీశ్ రావు అహంకారంతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది.

భారతీయ జనతా పార్టీ దేశంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం స్థానాల్లో, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎంఐఎం తో పొత్తుపెట్టుకుని, మైనారిటీ హక్కులంటూ ఊరేగింది బీఆర్ఎస్. నేడు ఎంఐఎం బీఆర్ఎస్ ను విడిచి కాంగ్రెస్ వైపు వెళ్తుంటే బీజేపీపై విమర్శలు చేస్తున్నరు.

ఇప్పటికైనా కేటీఆర్, హరీశ్ రావు బుద్ధి తెచ్చుకొని కార్యకర్తలను, ఉద్యమకారులను గౌరవించాలి. కలెక్టర్లు, ఎమ్మెల్సీలు, వ్యాపారవేత్తలకు పార్టీ సీట్లు అమ్ముకోవడం మానుకోవాలి. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్, కవిత ఐదుగురు పోటీ చేస్తే ప్రజలు ఓడించి బుద్ధి చెబుతరు.

Leave a Reply