ప్రకృతి వరప్రదాయిని దివ్యౌషధం తేనె

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద మరియు ప్రకృతి వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది ఒకటిది. తేనెలో యాంటిసెప్టిక్, యాంటీబయాటిక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె సేవించడం ద్వారా కంటి చూపు పెరుగుతుంది.. కఫం, ఉబ్బసం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న తేనెను వేడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు.

కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మద్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే. ప్లేటో, అరిస్టాటిల్, డిమొక్రటిస్… లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.

వేడి పాలలో తేనె కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు నాడీ కణాల సమస్యలుంటే.. అవి దూరమై.. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. మంచిగా నిద్రపోవడానికి వెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి. జీర్ణక్రియను మెరుగుపడటానికి వేడిపాలలో క్రమం తప్పకుండా తేనె కలిపి తాగాలి. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. ఎముకలు బలంగా తయారుకావడానికి వేడిపాలలో హనీ కలిపి తాగితే ప్రయోజనం. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు దూరమవుతాయి. పాలలో తేనెను కలిపి క్రమం తప్పకుండా తాగడం వల్ల శారీరక.. మానసిక మానసిక సమస్యలు దూరమై రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తేనెని సాధారణంగా మన డైట్‌లో చేర్చుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె & గోరువెచ్చని నీరు
మన జీవన విధానంలో వేడి నీరు కొన్ని అద్భుతాలనే చేస్తాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు . కాబట్టి, ఇంతటి ఎఫెక్టివ్ వేడినీటిని వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు.

ప్రెగ్నెంట్ కావాలంటే వారానికి ఎన్నిసార్లు శృంగారం చేయాలంటే..
ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక రోజుకు 7-8 గ్లాసుల నీరు, ప్రతి ప్రాణికి అవసరం అవుతుంది. అందువల్ల చాలా మంది కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్‌కు బదులు వేడినీటిని, గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం. అయితే చాలా మందికి గోరువెచ్చని నీరు తాగడం ఇష్టముండదు , కాబట్టి, అందులో కొద్దిగా తేనె జోడించి తాగితే మరింత అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.

నిమ్మ, తేనె మిక్స్ టీ
మీరు రెగ్యులర్‌గా లెమన్ టీ తాగుతారా? అయితే మీరు కచ్చితంగా లక్కీనే. ఎందుకంటే లెమన్‌ టీలో మీరు ఊహించని విధంగా మిరాకిల్ బెనిఫిట్స్ ఉన్నాయి.! ఇది శరీరంను శుభ్రం చేస్తుంది. బాడీని రిఫ్రెష్ చేసి, ఎనర్జీని అందిస్తుంది. లెమన్ టీ అంటే బ్లాక్ టీ వంటిది లేదా గ్రీన్ టీ లిక్కర్, వీటికి నిమ్మరసం కలపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. హాట్ టీకి నిమ్మరసం , కొద్దిగా పంచదార మిక్స్ చేయడమే లెమన్ టీ. మసాలా లెమన్ టీ అంటే హాట్ టీలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, పంచదారను మిక్స్ చేసి ఉంటారు. ఇది కొద్దిగా వగరుగా, స్పైసీ టేస్టీతో ఉంటుంది. నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల ఇది కలర్ ,ఫ్లేవర్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా పెంచుతుంది. అయితే టీలో సరైన మోతాదులో నిమ్మరసంను జోడించాలి.

తేనె, పాలు
పాలు, తేనెలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అవి విడివిడిగానే ఎంతో మేలు చేస్తే, కలిపి ఇంకెంత మేలు చేస్తాయో. వీటిని తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని తేనెను ఏ విధంగా సేవించినా.. ప్రయోజనాలే. ఎన్నో ఔషధాలు ఉన్న తేనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు. తేనెలో ఫ్రూట్ గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, సోడియం, క్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. హనీలో యాంటిసెప్టిక్, యాంటీ బయాటిక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె తాగితే కంటి చూపు పెరుగుతుంది.. కఫం, ఉబ్బసం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.

తేనె, నిమ్మరసం..
మనం చాలామందిని పొద్దున్నే తేనె, నిమ్మరసం కలిపి తాగటాన్ని చూస్తుంటాం. నిజానికి, రోజును ఈ హాయినిచ్చే డ్రింక్‌తో మొదలుపెట్టడం మంచిదే. ఈ రసం చర్మంలో విషపదార్థాలన్నీ తొలగించి, శరీరాన్ని క్రమబద్ధీకరిస్తుంది. చాలామంది ఈ తేనె, నిమ్మరసం కేవలం బరువు తగ్గటానికే ఉపయోగపడుతుంది అనుకుంటారు. అంటే మీకు పూర్తి అవగాహన లేదని అర్థం. ఈ తేనె, నిమ్మరసం ఉపయోగాలను మీరు ఊహించలేరు కూడా. పసుపుతో ఇలా చేస్తే విటమిన్ డి లోపం తగ్గుతుందట..

తేనె & జీలకర్ర నీళ్ళు..
కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు మన వంటగది చక్కటి పరిష్కారం. కొన్ని రకాల ఇంటి చిట్కాలు.. మన ఇమ్యునిటీని పెంచడమే కాదు.. కొన్ని ప్రాణాంతక వ్యాధులు రాకుండా అరికడతాయి. అలాగే.. జీలకర్రలోని అమోఘమైన ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలుసు. మీకు తెలుసా.. జీలకర్రను నీరు, తేనెతో కలిపి తీసుకోవడం అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనెపట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే కాడు తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. స్పెయిన్‌లోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె వేటకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఇవి 8 వేల సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్ధారించారు కూడా.నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది. రెండు వందల సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడయినప్పటికీ భార్య, సహాయకురాలి సాయంతో రాణిఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది?

తేనెపట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలను, వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్ వివరంగా తెలియజేసారు. సహజంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో సాధారణంగా కనిపించే అడవి తేనెటీగల రకాల్లో ఎపిస్ దోర్సలా, అపిస్ సెరెనా ఇండికా, ఎపిస్ ఫ్లోరియా, డ్యామెస్ బీ లేదా స్ప్రింగ్‌లెస్ బీ అనేవి ముఖ్యమైనవి. వీటికి తోడు ఐరోపానుంచి దిగుమతి చేసుకున్న ఎపిస్ మెల్లిఫేరా విదేశీ జాతి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే తేనెటీగ రకాలు ఇవి. వీటిలో మొదటి రకం తేనెను సేకరించే వారు చాలా ఎత్తయిన చెట్లకు నిచ్చెనలు కడతారు.

పక్కచెట్టునుంచి ఇంకో చెట్టుకు పొడవాటి తాడు వేసి దాటుతూ పోతూ రాత్రిపూట తేనెపట్టులను కొడుతూ ఉంటారు. గతంలో ఇలాంటి పెద్ద తేనెటీగల తేనెపట్టునుంచి 70 కిలోల దాకా తేనె లభించిన సందర్భాలు కూడా ఉన్నాయని దాదాపుగా 45 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉండిన శ్రీపతి భట్ అంటారు. అప్పట్లో సగటున ఒక్కో తేనెపట్టునుంచి 15నుంచి 20 కిలోల దాకా తేనె లభించేది. అది ఇప్పుడు 5నుంచి 10 కిలోలకు తగ్గిపోయిందంటారాయన. మిగతా రకాల తేనెలదీ అదే పరిస్థితి. పాతికేళ్ల క్రితం తేనెకు గిరాకీదారులే ఉండేవారు కాదు. చాలా దూరంనుంచి ఒకరిద్దరు దళారీలు వచ్చే వారు. ఒక్క ఉత్తర కన్నడ జిల్లాలోనే ఏడాదికి 400 టన్నుల తేనె లభిస్తూ ఉండేదని చాలా ఏళ్లుగా అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేసే నాసిర్ ఖాన్ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటారు.

ఉసిరి మరియు తేనె యొక్క సాధారణ పేస్ట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, ఇది కోవిడ్‌తో పోరాడటానికి చాలా అవసరం. ఉసిరి మరియు తేనె సహజ రోగనిరోధక శక్తిని నిర్మించడంలో సహాయపడతాయి. మన శక్తి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడం లో మనం తినే ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది.తేనె సంపూర్ణ పోషక పదార్ధమని, తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్నాక దానిని సేకరించిన తీరు, నిలువచేసేందుకు వాడిన విధానాలబట్టి పలు రకాలుగా విభజించారు.అడవి తేనె: ఇది అత్యంత సహజమైనది. అడవిలో లభించే అన్నిరకాల పూలనుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గనుక చాలా మంచిది.

ఒకే పూవు తేనె: ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచిలో ఉంటుంది. తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూలమొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు.మిశ్రమ తేనె: మార్కెట్ లో అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచులు, రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రం తేనెలో. రంగు, రుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు.పుట్ట తేనె: ఇది తేనె పట్టులను అలానే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనె అందించేది . దీనిని తాజా తేనెగా భావించాలి.

నిలువతేనె: తేనెను నిలువ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు. దానిలోని సూచ్మజీవులను తొలగించి, దానిలోని ఎంజైమ్‌ ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువకాలము నిలువ ఉంచేలా చేస్తారు. ఈ ప్రక్రియలో తేనెను వేడిచేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి. దానిని అధిగ మించేందుకు నేడు ఆల్ట్రాసొనిక్ తేనెను తయారుచేస్తున్నారు. దీనివల్ల తేనె పులియకుండా ఉంటుంది.ఎండు తేనె: ఇది మరో ప్రత్యేకమైనది. తేనెను ఘన రూపంలో తయారుచేస్తారు. ఇది చిన్నచిన్న ముక్కలుగా వస్తుంది. చేతికి అంటుకోదు.తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్… లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి.

ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెల్లో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు… ఇలా భిన్నవర్ణాలతోపాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి… అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుంచి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసననీ రుచినీ కలిగి ఉంటుంది.
చాలామంది వంటలో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు. బేకింగ్ ఉత్పత్తులో తేనె వాడటంవల్ల రుచిగా ఉండటంతోపాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయి.

ప్రకృతి వైద్యంలో తేనె :
కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది ‘యాంటీ మైక్రోబియల్’ ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది.చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.ఎలర్జీని నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదెలా అంటే స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగరేణువులవల్లే వస్తాయి. తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న వెుక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట.

ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి.మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండిపదార్థాలను తినడం వీలయినంతగా తగ్గించాలి. అయితే వీళ్లు అందుకు బదులుగా తేనెను తిన్నా బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు. తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది.

పూర్వం మశూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెనే మందుగా వాడేవారు.అమృతప్రాయమైన మధువులో రవ్వంత విషమూ ఉంటుంది. మకరందంలో సహజంగా ఉంటే బ్యాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్‌ను విడుదల చేస్తాయి. ఈ విషం క్యాన్సర్, మల్టిపుల్‌స్ల్కిరోసిస్‌కు మంచి మందు. ఇదే విషం ఏడాదిలోపు పసిపిల్లలకు హానికరం.అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది…తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలులో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు.

సౌందర్య సంరక్షణకు తేనె
‘జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది. కాబట్టి పొరబాటున కూడా రాయవద్దు…’ అనేది మన పెద్దవాళ్ల హెచ్చరిక ఎంతమాత్రం నిజం కాదు, తేనెవల్ల పొడిబారిన జుట్టు మృదువుగా అవుతుంది’!చర్మంలోని తేమగుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంది.పొడి జుట్టుకి తేనె, మందారం కలిపి మాస్క్ వేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.తేనె లిప్‌బామ్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. పగిలిన పెదాల్ని సంరక్షిస్తుంది.పాలు, తేనెల మిశ్రమాన్ని లేదా సెనగపిండిలో తెల్లసొన, తేనె కలిపి చర్మానికీ ముఖానికీ పట్టిస్తే అవి కాంతిమంతంగా మెరుస్తాయి.మొటిమలు ఉన్న చోట తేనె రాసి ఒక అరగంట తర్వాత వెచ్చని నీటితో, తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే మొటిమలు తగ్గుతాయి.కృష్ణ వృత్తాలకి తేనెతో మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తే కృష్ణ వృత్తాలు తగ్గుతాయి.

తేనె గురించి ఇంకొంచెం
సుమారు 20 వేల ఏళ్ల నుంచి మనిషి తేనెను సేకరిస్తున్నాడు.ప్రపంచవ్యాప్తంగా అందరికన్నా న్యూజిలాండ్ వాసులు తేనె ప్రియులు. వీరిలో 88 శాతం మంది హనీని ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరూ ఏటా 1.95 కిలోల తేనెని తీసుకొంటారు.రంగు, రుచి ఆధారంగా అమెరికాలో 300లకు పైగా తేనెరకాలు తయారవుతున్నాయి.గ్రీసులో కొత్తపెళ్ళికూతురు అత్తవారింట అడుగుపెట్టేటప్పుడు- చేతుల్ని తేనెలో ముంచి గోడలమీద ముద్రలు వేస్తుందట. వైవాహిక జీవితం తీయగా హాయిగా సాగిపోయేందుకే ఈ తేనెముద్రలు.తేనె పంచదారకన్నా రెండురెట్లు తీపిగా ఘాటుగా ఉంటుంది.

అందుకే తేనెలో ఎలాంటి బాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు ఉండవు.రోమన్లు బంగారానికి బదులుగా తేనెను ఆదాయపన్నుగా చెల్లించేవారట.ఒక పౌండు తేనెకోసం తేనెటీగలు సుమారు 55 వేల మైళ్ల దూరం ప్రయాణించి 20 లక్షల పూలను సందర్శిస్తాయని తెలుసా.విడిగా అమ్మే తేనెలో కొంత చక్కెర పాకాన్ని కలుపుతుంటారు. అచ్చంగా పట్టు నుంచి తీసినదేదో తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు.తేనే నిజమైనది అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఒక స్పూన్ తేనెను తీసుకొని నీటిలో వెయ్యాలి. అది త్వరగా కరిగిపోతే మంచి తేనే కాదు. ఒరిజినల్ తేనే నీటిలో ఆలస్యంగా కరుగుతుంది.

( డా యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు)

 

Leave a Reply