సోము వీర్రాజు..నోరు అదుపులో పెట్టుకో

– రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు రాయలసీమలోని కర్నూలు కడప జిల్లా వాళ్లు హత్యలు చేస్తారని అలాంటి వారికి విమానాశ్రయాలు అవసరమా అని రాయలసీమ ప్రాంత ప్రజలను కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గం!రాయలసీమ ప్రాంత ప్రజల సహనాన్ని,మంచితనాన్ని చేతగానితనంగా చూడకండి! రాయలసీమ జిల్లాల ప్రజలు తిరగబడితే బిజెపి నాయకులు జిల్లాలలో తిరగలేరు ఖబడ్దార్!

సోము వీర్రాజు ను “ఎర్రగడ్డ ఆసుపత్రి” లో చేర్చాల్సిన సమయం ఆసన్నమైంది ఇటీవల ఆయన మాట తీరు చూస్తుంటే బిజెపికి ఓట్లు వేసి గెలిపిస్తే చీప్ లిక్కర్ 70 రూపాయలకే ఇస్తాము అని నవ్వుల పాలయ్యారు,మొన్న రాజమహేంద్రవరంలో బీజేపీలోకి యువత రావాలని వారికి “కోళ్ల ఫారాలు” పెట్టిస్తాము

అని ప్రకటించి జాతీయ పార్టీ ప్రతిష్టను దిగజార్చారు ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలను కించపరుస్తూ తన వయస్సుకు తగ్గట్టు కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం చూస్తే “చిన్న మెదడు” చితికి నట్లు అనుమానం కలుగుతుంది!

రాయలసీమ జిల్లాలోని బిజెపి నాయకులకు పౌరుషం ఉంటే మీ తోక పదవులకు రాజీనామా చేయండి లేకపోతే మీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసి సోము వీర్రాజు ను ఇంటికి సాగనంపండి!
సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి ఎక్కువ వార్డ్ మెంబర్ స్థాయికి తక్కువ అన్న చందంగా దిగజారి మాట్లాడటం సిగ్గుచేటు! రాయలసీమ అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,తాళ్ళపాక అన్నమయ్య,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఎందరో మహనీయుల చరిత్ర కలిగిన గడ్డ సోము వీర్రాజు లాంటి నోటి దురద వారికి ఏం తెలుస్తుంది?రాయలసీమలో పక్క పార్టీల వారికి బీజేపీ పార్టీ కండువాలు కప్పి నిస్సిగ్గుగా రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళని అడగండి రాయలసీమ చరిత్ర గురించి చెబుతారు.

తిరుపతి విమానాశ్రయానికి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అంతర్జాతీయ విమానాన్ని కూడా తీసుకురాలేకపోయారు,రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఒక “కుండ మట్టి” ఒక “కుండ నీళ్లు” ఇచ్చి అవమానపరిచిన ప్రధానమంత్రిని చేతనైతే నిలదీయండి!రాయలసీమలోని జిల్లాల ప్రజలు ఎంతోమంది గల్ఫ్ దేశాలకు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు వారు చెన్నైకి వెళ్లి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి మన రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్లి పోతుంది దీనిపై బీజేపీ దృష్టి పెట్టండి!సోము వీర్రాజు దిగజారుడు మాటలను వెంటనే ఉపసంహరించుకొని రాయలసీమ ప్రాంత ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a Reply