– నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయం
– అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే.
– డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్
హైదరాబాద్ : అంబేద్కర్ పట్ల ఉన్న భక్తి, గౌరవంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆశయాలను, ఆలోచనలను ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అమలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది.బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయుడు.
అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీతో పాటు అప్పటి ప్రధాని నెహ్రూ అడుగడుగునా అనేకసార్లు అవమానపర్చారు.అంబేద్కర్ పట్ల మోదీ అత్యంత గౌరవంతో పాలనను కొనసాగిస్తున్నారు. ఆర్థిక రంగంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్.న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ప్రథమ కేంద్ర మంత్రివర్గంలో తన ప్రతిభను చాటినా, నెహ్రూ ఆయనను రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చారు.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కు వ్యతిరేకంగా అంబేద్కర్ గళమెత్తారు. అది దేశ విభజనకు దారితీస్తుందని హెచ్చరించారు.జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ స్పష్టమైన వ్యతిరేకతను కాంగ్రెస్ పట్టించుకోలేదు. నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయాలను అనుసరించింది. హిందూ సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు హిందూ కోడ్ బిల్ రూపొందించినా, కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకుంది.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ హక్కులు కల్పించినా, బీసీల కోసం జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సూచించినా, నెహ్రూ పట్టించుకోలేదు. అంబేద్కర్ కేబినెట్ నుంచి రాజీనామా చేయడానికి కారణం కాంగ్రెస్ నేతల అవమానమే.1952లో పార్లమెంటు ఎన్నికల్లో అంబేద్కర్ ని ఓడించేందుకు నెహ్రూ కమ్యూనిస్టుల సహాయంతో కుట్ర చేశారు. 1954లో కూడా అంబేద్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని మొసలికన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్‌ను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దే. బీసీల కోసం నియమించిన కాకా కలేల్కర్ కమిషన్ నివేదికను నెహ్రూ పరిశీలించకుండా పక్కనపెట్టారు. ఇందిరాగాంధీ హయాంలో మండల్ కమిషన్ నివేదికను కూడా పట్టించుకోలేదు. వీపీ సింగ్ మండల్ కమిషన్‌ను అమలు చేయగా, రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా రిజర్వేషన్లను అడ్డుకున్నారు. కులాల పేరుతో రిజర్వేషన్లు వద్దని వారించారు.
నెహ్రూ, రాజీవ్, రాహుల్ గాంధీ వరుసగా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు వద్దని అప్పట్లో ప్రధాని నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వకుండా, ఆయనను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు బీసీల పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి అయిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎదిగారు. అంబేద్కర్ మరణానంతరం ఢిల్లీలో అంతిమ సంస్కారాలు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరాకరించి ఘోరంగా అవమానించింది. చివరికి ఆయన పార్థివదేహాన్ని తరలించేందుకు విమాన ఖర్చులు కూడా తమ కుటుంబాన్నే భరించాలని అంబేద్కర్ సతీమణికి తెలిపారు. అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబేద్కర్ జీవితం గడిపిన ప్రదేశాలను “పంచతీర్థంగా” అభివృద్ధి చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ కులగణన పేరుతో కుట్ర చేస్తోంది. రాహుల్ గాంధీ కులగణన దేశానికి రోల్ మోడల్ అవుతుందని చెబుతున్నారు. తెలంగాణలో 51 శాతం బీసీలను 45 శాతంగా చూపించి, 10 శాతం ముస్లింలను బీసీల కోటాలో చేర్చి మోసం చేస్తున్నారు. ఇదేనా దేశానికి రోల్ మోడల్? కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే.
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కింది. ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలి. మోదీ ప్రభుత్వం అంబేద్కర్ గారిని గౌరవిస్తూ, వారి ఆశయాలను నెరవేర్చే దిశగా పనిచేస్తోంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.