– 31న విడుదల
ప్రముఖ ఈవీ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్లను విడుదల చేయనుంది. మూడో జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ స్కూటర్లను జనవరి 31వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆవిష్కరించనున్నట్లు కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు. రెండో తరంతో పోలిస్తే మూడోతరం స్కూటర్లు డిజైన్, ఫీచర్లతో పాటు మెరుగైన పనితీరును కనబరుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తదుపరి తరం స్కూటర్‌కు సంబంధించి గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.