ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2025 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆనందకర సందర్భానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ని పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, 2025లో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, టీచర్ సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటి సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్-యూనిట్-బూతు ఇంచార్జ్ లు, మరియు వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.