Suryaa.co.in

Andhra Pradesh

టిడిపి కేంద్ర కార్యాల‌యంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాల‌యం ఎన్టిఆర్ భ‌వ‌న్ లో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రిగాయి. పార్టీ కార్యాల‌యంలో జాతీయ అద్య‌క్షులు చంద్ర‌బాబు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేసి వేడుక‌ల్లో పాల్గొన్నారు. పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు చంద్ర‌బాబు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎపిలో ని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన వంద‌లాది మంది ప్ర‌జ‌లు, అభిమానులు చంద్ర‌బాబును క‌లిసి న్యూఇయ‌ర్ విషెస్ తెలిపారు. అంత‌కు ముందు ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో చంద్రబాబుకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబుకు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన వేడుక‌ల్లో ముస్లిం సోద‌రులు చంద్ర‌బాబును ప్ర‌త్యేకంగా స‌త్క‌రించారు.

LEAVE A RESPONSE