Home » యువతను,నిరుద్యోగులను వంచించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోయాడు

యువతను,నిరుద్యోగులను వంచించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోయాడు

– ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు. మూడు జనవరులు పోయినా ఒక్కజాబ్ ఇవ్వలేదూ
– ఏటా మెగాడీఎస్సీ అన్నాడు.. దాని ఊసేఎత్తలేదు.
– తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

జనవరి 1న సంతోషంగా ఉండాల్సిన యువతీయువకులు, జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన మోసంతో బాధపడుతున్నారని, పాదయాత్ర సమయంలో ప్రతిఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదలచేస్తానని చెప్పిన వ్యక్తి, తన పాలనలోమూడు జనవరినెలలు పోయినా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా, 10వేలఉద్యోగాలతో ఫేక్ క్యాలెండర్ ప్రకటించి, నిరుద్యోగు లు, యువత ఆశలను నీరుగార్చాడని తెలుగుయువత రాష్ట్రప్రధాన కార్యదర్శి కిలారు నాగ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

నిరుద్యోగులకు ఏటేటా జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు ఇస్తానని నమ్మించిన జగన్మోహన్ రెడ్డి వారిని నిలువునా వంచించాడు. పాదయాత్రసమయంలో ఏటా జాబ్ క్యాలెండర్ హామీతో పాటు, మెగాడీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పాడు. కానీ ఏ ఒక్కహామీని కూడా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చలేదు. యువతను మోసగిస్తూ, ఫేక్ క్యాలెండర్ విడుదలచేశాడు.

దానిపై రాష్ట్రంలోని యువతీయువకులు ఆగ్రహం వ్యక్తంచేయడంతో బెంబేలె త్తిన ముఖ్యమంత్రి, పోలీసుల సాయంతో వారి ఆగ్రహాన్ని చల్లార్చాడు. యువత ఆగ్రహానికి జడిసి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు కూడా రాలేకపోయాడు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో యువతకు డీఎస్సీద్వారా కేవలం 17వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని ప్రతి పక్షనేతగా ఉన్నప్పుడు జగన్, తాను అధికారంలోకివస్తే, లక్షలఉద్యోగాల భర్తీకి మెగాడీఎస్సీ నిర్వహిస్తానన్నాడు.

మూడేళ్ల పాలన పూర్తయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క డీఎస్సీని, ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ ని విడుదలచేయలేకపోయాడు. రాష్ట్రంలో 14వేలకు పైగా పోలీస్ ఖాళీలు ఉంటే, వాటిభర్తీ గురించి కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదు. హోం మంత్రి సుచరితకూడా పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను

భర్తీచేస్తామనిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14లక్షలమంది యువతీయువకులు పోలీస్ ఉద్యోగాలకోసం శిక్షణపొందుతున్నారు . ఆఖరికి కోవిడ్ సమయంలో కూడా కోచింగ్ సెంటర్లలోనే ఉండి లక్షలురూపాయలు వెచ్చించి ఇప్పటికీ శిక్షణపొందుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని యువతీయువకులను ఉద్యోగాలపేరుతో ఈ ముఖ్యమంత్రి మాయమాటలతో వంచిస్తున్నాడు.

టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయుడి హాయాంలో 5లక్షల ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డే అసెంబ్లీలో చెప్పారు. వాటితో పాటు దాదాపు రూ.13లక్షలకోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యేలాచేసిన చంద్రబాబుగారు, వాటిద్వారా 34లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం తో ఆపెట్టుబడులు, ఉద్యోగాలు అన్నీ పొరుగురాష్ట్రాలకు తరలిపోయాయి. ఉద్యోగాలు అంటే ఈ ముఖ్యమంత్రి తనపార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్, సచివాలయ ఉద్యోగా లు అనుకుంటున్నాడు.

ఆ ఉద్యోగాలతో ఆయన్ని నమ్ముకున్నవారి కడుపులే నిండటంలే దనే వాస్తవాన్ని ఎంతత్వరగా గ్రహిస్తే అంతమంచిది. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు, నోటిఫికేష న్ల పేరుతో యువతను మోసగించడాన్ని వారిప్రతినిధిగా తాముతీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తనహామీలను నిలబెట్టుకుంటాడని ఇప్పటివరకు మూడేళ్లపాటు ఎదురు చూశాం. కానీ ఈముఖ్యమంత్రి చేసిన మోసంతో ఆయన్ని నమ్మే పరిస్థితులులేవు.

యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని మోసగించిన జగన్మోహన్ రెడ్డి, గతంలో చంద్ర బాబునాయుడు గారు నిరుద్యోగయువతకు ఇచ్చిన రూ.2వేల నిరుద్యోగభృతిని కూడా నిలిపి వేశాడు. అంతటితో ఆగకుండా యువతకోసం టీడీపీప్రభుత్వం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లను, స్టడీసర్కిళ్లనుకూడా మూసేయించాడు. చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా వారిజీవితాల్లో జగన్మోహన్ రెడ్డి చీకట్లు నింపాడు.

టీడీపీ హాయాంలో దాదాపు 16లక్షలమంది విద్యార్థులకు ఏటాక్రమంతప్పకుండా ఫీజు రీ యింబర్స్ మెంట్ నిధులు అందితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వారిసంఖ్యను 11లక్షలకే పరిమితంచేశాడు. ఒకఇంట్లో ఇద్దరు చదువుకునే విద్యార్థులు ఉంటే, వారిలో ఒకరికే ఇస్తామంటూ మెలికపెట్టాడు. అమ్మఒడి వస్తే ఫీజు రీయింబర్స్ మెంట్ రాదంటూ సన్నాయినొక్కులునొక్కుతున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమంత్రి అటుయువతను, నిరుద్యోగులను, ఇటు విద్యార్థులను దారుణంగా మోసగించి, తనఅవినీతిని, లూఠీని మాత్రం మూడేళ్లనుంచి యథావిథిగా కొనసాగిస్తున్నాడు.

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు లేకుండా చేయడంతో పాటు, వారికి నాణ్యమైన చదువులను కూడా ముఖ్యమంత్రి దూరం చేస్తున్నాడు. ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యంచేయడానికిప్రయత్నించి, టీడీపీయువనేత లోకేశ్ గారు చేసిన పోరాటంతో వెనక్కుతగ్గాడు. జగన్మోహన్ రెడ్డి తానుఇచ్చిన హామీ ప్రకారం యువతకు 2లక్షల30వేలఉద్యోగాలు ఎప్పుడిస్తాడో సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే ఏటా జనవరిలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ను ఈ జనవరి నెలలో తక్ష ణమే విడుదలచేయాలని కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.

తన మూడేళ్ల పాలనలో ఎలాగైతే యువతను వంచించి, వారిని మోసగించాడో, అదేవిధంగా మిగిలిన రెండే ళ్లు కూడా కాలయాపన చేద్దామనే ఆలోచనలో ఈ ముఖ్యమంత్రి ఉంటే చూస్తూఊరుకోమని హెచ్చరిస్తున్నాం. టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్, తెలుగుయువత రాష్ట్ర అధ్య క్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో యువతీయువకులు, నిరుద్యోగులతో కలిసి భారీస్థా యిలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply