Suryaa.co.in

Features

ఎన్జీఓ నేతల్లారా… అమ్ముడుపోకండి!

-పెన్షనర్లు, ఉద్యోగులను పాలకులకు తాకట్టుపెట్టకండి
-ఏపీ ఎన్జీఓ ప్రతిష్ఠను నిలబెట్టండి
-ఉద్యోగ నాయకులకు బహిరంగ లేఖ

బారతదేశంలో కెల్లా ఉన్నత మైన, పేరెన్నికగన్న ఉద్యోగ సంఘం ఏపీ ఎన్జీఓ సంఘం. ఆనాడు సంఘ నిర్మాత కీ.శే ఆమనగంటి శ్రీ రాములు ప్రతి పట్టణం, ప్రతి తాలూకా ప్రతి జిల్లా పర్యటన చేసి ఉద్యోగులను సంఘటితం చేసి,చైతన్య పరిచి ఏపీ ఎన్జీవో సంఘాన్ని నిర్మించిన సంగతి ఇంకా ఈనాటికీ జీవించి వున్న ఆనాటి తరం పెన్షనరు లకు తెలుసు.

సంఘ నాయకత్వం కోసం ఎందరో పోటీ పడేవారు. ప్రతి తాలూకా యూనిట్ కు రెండు మూడు గ్రూపులుగా ఏర్పడి పానెల్లు గా హోరాహోరీ గా పోటీలు పడేవారు. గెలిచిన వారితో పాటు ఎన్నికల్లో ఓడిన వారు కూడా, రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అన్ని సంఘం కార్యక్రమాల్లో ముందుండి ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొనేవారు. అటువంటి చైతన్యవంతమైన నాయకత్వం క్షేత్ర స్దాయిలోనే ఆనాడు ఉండేది. నాయకులు తప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఎదురు తిరిగి ప్రశ్నించేవారు. అటువంటి సంఘానికి న్యాయక త్వం వహించే అదృష్టం మీకు దక్కింది.

ఆనాటి నాయకత్వాన్ని చూసి ఆనాటి ముఖ్యమంత్రులు భయపడే వారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్.టి.ఆర్ , చంద్ర బాబు నాయుడు వరకూ తిరుగులేని నాయకత్వం వహించిన ఆమనగంటి శ్రీ రాములు, ఐబీ. రామకృష్ణా రావు, బి. పూర్ణ చంద్రరావు, పివి రమణయ్య, జి. పూర్ణ చంద్రరావు, తోట సుధాకర్ ప్రసాద్ లాంటి యోధులు న్యాయక త్వం, వహించిన మన ఏపీ.ఎన్జీఓ సంఘ ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. గుండె బరువెక్కి, కళ్ళు చెమ్మగిల్లి తున్నాయి.

కారణం ఏమిటి అని ఆత్మ విమర్శ చేసుకుంటే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగక పోవటం. కావలసిన వారిని తమతమ తాబేదారులను నాయకులుగా ప్రకటించుకోవటం, మరియు ఎన్నికల వ్యవహారం ఎవ్వరికీ తెలియకుండా వ్రాసేసు కోవడం. ప్రకటించేసు కోవడం, ప్రశ్నించే వారిని పదవుల నుండి బహిష్కరించడం. ఈ కారణాలే ఏపీ ఎన్జీఓ సంఘ భవనాన్ని బలహీన పరచింది. ప్రభుత్వం నిరంకుశ, దోరణితో , ప్రవర్తిస్తూ ఎన్నో ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనరులకు వ్యతిరేకంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, నాయకులైన మీరు మాట్లాడం లేదు.

ఇచ్చిన ఐఆర్ ను తగ్గించి ఫిట్‌మెంట్ ఇచ్చినా, హెచ్‌ఆర్ లు తగ్గించినా, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించినా ముఖ్యమంత్రి కు ఎక్కడ నొప్పి కలుగుతుందో అని వీురు ముందుగానే బాధ పడిపోతున్నారు. చారిత్రాత్మక మైన “ఛలో విజయవాడ” నిరశన కార్య క్రమానికి స్వచ్ఛందంగా ఉప్పెనలా, సునామి లా తరలి వచ్చిన లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఆశలను అడియాసలుగా చేసి, బ్లాక్ అగ్రిమెంట్పై సంతకాలు చేసి, ఉద్యమ ద్రోహం చేసి పోలీసు సంరక్షణ లో దాక్కున్న నేటి నాయకులారా ఇప్పటికయినా కళ్లు తెరవండి.

కనీసం పోరాట యోధులు గా పోరాటం చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, మునిసిపల్ సిబ్బంది, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల పోరాట స్పూర్తి ను చూసైనా కళ్లు తెరవండి. తక్షణమే వారికి సంఘీభావాన్ని ప్రకటించండి. తద్వారా మీరు ఉద్యోగుల పక్షమే అని చాటండి. ఎన్నికలు 90 రోజుల్లో జరగబోతున్నాయి. నాయకులారా మరో పివి రమణయ్య లాగా, మరో జి పూర్ణ చంద్రరావు, మరో తోట సుధాకర్ ప్రసాద్ లాగా మీ శక్తి సామర్థ్యాలను నిరూపించండి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ ల ఉద్యమ చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వ్యవహరించండి.

ప్రభుత్వానికి భజన చేసే కాకర్ల వెంకట్రామిరెడ్డి లాగా ఉండకండి, మీకు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశచూపుతారు. లొంగిపోతే తప్పక మీరు చరిత్ర హీనులవుతారు. లక్ష లాది కుటుంబాలు మీ వెంట ఉన్నాయి. ఎవడో మాజీ ఉద్యోగ సంఘ అద్యక్షుడు నేటి వైసీపీ పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారుని సలహాలతో, అతని సహవాసం , డైరక్షన్ తో సంఘాన్ని నడపకండి. సకాలంలో రాని పెన్షన్ ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులైన 10 లక్షల స్వేచ్ఛా జీవులైన ప్రభుత్వ, లోకల్ బాడీ, కార్పొరేషన్ ల పించను దారులు, ఘోష వినిపించటం లేదా ?

రాబోయే ఎన్నికలలో ఉద్యోగ లోకం అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించండి. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించిన, 1వ తేదీకి పెన్షన్ ఇవ్వని, లక్షలాది రూపాయిల బకాయిలు ఇవ్వని ( తమ కష్టార్జితాలను అనుభవించకుండా ఎందరో Pensioners చనిపోతున్నారు) బకాయిల సొమ్ము ఇవ్వకుండా Income Tax కట్ చేసే, GPF సొమ్ము వాడుకునే, APGLI డబ్బు ఇవ్వని, CPS రద్దు చేసి OPS ఇస్తానని మేసం చేసిన , 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉంచి యువతకు అన్యాయం చేసిన, పవిత్ర మైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను సారాయి దుకాణాల వద్ద డ్యూటీలు వేసే, మనస్సు చంపుకుని పనిచేస్తున్న గ్రామ సచివాలయ సిబ్బంది ను, వాలంటీర్లను, గృహ సారధులకు, ప్రభుత్వ ఉద్యోగాలు పేరుతో, ఉన్నత విద్యావంతులైన వీరికి అతి తక్కువ వేతనాలు ఇస్తూ, గోడ్డు చాకిరి చేయించు కుంటూ, YSR Congress పార్టీకి అనుకూలంగా పని చేయకపోతే ఉద్యోగాల నుంచి ఊడ బేరుకుతామని బెదిరిస్తున్నారు.

ఇలా , ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ ల వ్యతిరేకి, అయన జగన్ ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన కుటుంబాల ఓట్లు ద్వారా ముఖ్యమంత్రి పీఠం నుండి దించేందుకు తగిన సంకేతాలు , నివ్వండి. మన అసంతృప్తి ను వ్యక్తం స్వేచ్చ గా గొంతెత్తి నిదర్శనాలు ద్వారా తెలియ చేయండి.తద్వారా మీరు ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల పక్షాన ఉన్నారని నిరూపించండి. శల్య సారధ్యం మాత్రం చేయవద్దని మనవి .

ఉద్యోగ లోకాన్ని అనేక విధాలుగా వేధింపులకు గురిచేసిన జగన్ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని అలానే వారికి ధీటుగా పోటీ చేస్తున్న పార్టీలకు ఓటు వేసి ప్రత్యామ్నాయమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా ఉద్యోగలోకానికి పరోక్షంగా పిలుపునివ్వవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఈ విధంగా విధాన నిర్ణయాన్ని తీసుకొని చరిత్ర పుటల్లో హీరోలు గా ఉండి మన కుటుంబాలకు న్యాయం చేయండి తప్ప మా కుటుంబాల బ్రతుకులను ఫణంగా పెట్టితే మిమల్ని చరిత్ర , మరియు ఉద్యోగులు క్షమించరు.

మా ఆంద్రా పెన్షనర్ పార్టి రాబోయే ఎన్నికల్లో ఉద్యోగుల, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ పక్షాన నిలబడి ఉద్యోగుల వ్యతిరేకంగా ఉన్న ప్యూడల్ బావాలు కలిగిన జగన్ ను గద్దె దించాలని, మా కార్యాచరణను ప్రారంభించాము. మాకు మీ మద్దతు పరోక్షంగా ఇవ్వమని కోరుతూ…

– పాలంకి సుబ్బరాయన్
అధ్యక్షుడు ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ
మాజీ ప్రధాన కార్యదర్శి ఏపీ ఎన్జీవో సంఘం

LEAVE A RESPONSE