Suryaa.co.in

Editorial

‘నానీ’లంతా వైసీపీలోనే!

-కొడాలి, పేర్ని, ఆళ్ల, కేశినేని కేరాఫ్.. వైసీపీ
(మార్తి సుబ్రహ్మణ్యం)

కృష్ణా, గోదావరి జిల్లాల్లో చాలామందికి సొంత పేరున్నా… కొందరికి నాని, చంటి, బుజ్జి అనే ముద్దు పేర్లుంటాయి. ఇప అలాంటి నానీలంతా ఇప్పుడు వైసీపీలో గూటిలోనే చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని, చాలాకాలం నుంచీ వైసీపీలోనే ఉన్నారు. బందరుకు చెందిన మరో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్ పేర్ని నాని కూడా, ఆ పార్టీలోనే చాలాకాలం నుంచీ కొనసాగుతున్నారు. ఇక టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైసీపీలో చేరిన, గుడివాడ ఎమ్మెల్యే-మాజీ మంత్రి కొడాలి నాని ఉరఫ్ కొడాని నాని చేసే ప్రకటనలు, ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. వీరిలో పేర్ని నాని, ఆళ్ల నాని కాపు వర్గానికి చెందిన నేతలు కాగా.. కొడాలి నాని కమ్మ వర్గానికి చెందిన నేత.

అయితే తాజాగా ఈ నానీలకు విజయవాడకు చెందిన ఇంకో నాని జతయ్యారు. ఆయనే విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని. టీడీపీ అధినేత ఆయనకు టికెట్ లేదని చెప్పడంతో, తాడేపల్లికి వెళ్లి వైసీపీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధమయ్యారు. గమ్మతేమిటంటే వీరిలో ఒకరు లారీల ఓనరయితే.. ఇంకొకరు బస్సుల ఓనరు! కొడాలి నానికి లారీలుంటే, కేశినేని నానికి ఒకప్పుడు బస్సులుండేవి. గత ఎన్నికల ముందే ఆయన బస్సుల బిజినెస్ సర్దేసుకున్నారు.ఇది కూడా చదవండి: కేశినేనిది స్వయంకృతమే

ఇప్పుడు ఈ నానీలంతా వైసీపీలోనే ఉండటం యాధృచ్చికం. అన్నట్లు.. తాజాగా వైసీపీ తీర్ధం తీసుకునేందుకు రెడీ అయిన కేశినేని.. గతంలో జగన్‌పై చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికతపై జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్ల నుంచి.. పీవీపీ ఎంపి నానిపై చే సిన ట్వీట్ల వరకూ హాట్ టాపిక్‌గా మారాయి.

LEAVE A RESPONSE