Suryaa.co.in

Political News

కేశినేని నాని రాజకీయ చరిత్ర ముగిసింది..

2019 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి కేశినేని నాని స్వల్ప మెజారిటీ – 8726 మెజారిటీతో గెలిచారు. ఆయన లోక్సభ పరిధిలోని ఏడుగురు శాసనసభ అభ్యర్థులలో కేవలం ఒక్క గద్దె రామ్మోహన్ రావు గారు మాత్రమే విజయం సాధించి,మిగిలిన ఆరుగురు అభ్యర్థులు ఓడిపోయారు.

ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని సహకారంతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజలలో ఉండే గద్దె రామ్మోహన్ రావు తన సొంత ఆర్థిక వనరులతో,పార్టీ బలం మరియు ప్రజల బలంతో గెలిచారు. గద్దె గెలుపులో కేశినేని నాని పాత్ర ఏమీ లేదు.
కానీ…..ఓడిపోయిన ఆరుగురు శాసనసభ అభ్యర్థుల ఓటమిలో కేశినేని నానిది ప్రధాన పాత్ర. ఎంపీ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థులకు ఆయన అందించిన ఆర్థిక సహాయం దాదాపు ఏమీ లేదు.

ఒకరకంగా విజయవాడ లోక్సభ పరిధిలో ఆరుగురు శాసనసభ అభ్యర్థులు ఓడిపోవడానికి కేశినేని నాని సహాయ నిరాకరణ ఒక ప్రధాన కారణం.

2019 ఎన్నికల అనంతరం ఓడిపోయిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. కనీసం ఎన్నికల తర్వాత కూడా లోక్ సభ సభ్యుడిగా పార్టీ అసెంబ్లీ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకోవడంలో, కేసినేని నాని వైఫల్యంతో పాటు,అహంకార ధోరణి కూడా కనిపిస్తుంది.. ఫలితంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో మొదటి రెండేళ్లలో పార్టీ పరంగా చాలా నష్టం జరిగింది.

ఓడిపోయిన శాసనసభ అభ్యర్థులు నాని పట్ల అసంతృప్తితో ఉండటం సహజం,దానికి తోడు నాని అహంకార పూరిత వ్యాఖ్యలు వాళ్లను మరింత బాధించాయి. వాటన్నిటి ఫలితం…విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ విజయం.

మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా , కేశినేని నాని అసెంబ్లీ ఇన్చార్జిలతో ఘర్షణ వైఖరిని మార్చుకోలేదు.వాళ్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా అనేక డివిజన్లో అభ్యర్థులను నిలబెట్టారు. దాంతో వాళ్లు కూడా నానికి సహకరించకపోవడం…ముమ్మాటికి నాని స్వయంకృతాపరాధం. విజయవాడ మేయర్ ఎన్నికలలో వారం రోజులపాటు, కేశినేని శ్వేత కోసం ప్రచారం చేసిన నేనే ప్రత్యక్ష సాక్షిని.

కారణాలు ఏమైనా…కేశినేని నాని అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగానే విమర్శించడం పార్టీలో చాలామందికి తెలుసు.
బహుశా…
నాని ఆర్థిక పరిస్థితి…
పార్టీ నాయకత్వం పట్ల నిర్లక్ష్య పూరిత వైఖరి…
అమరావతి ఉద్యమంలో పాల్గొనకపోవడం…
పార్టీ మహానాడు సమావేశాల్లో కనిపించకపోవడం….
కొద్ది నెలల క్రితం విజయవాడ లోక్ సభ పరిధిలో అద్భుతంగా జరిగిన నారా లోకేష్ గారి యువ గళం పాదయాత్రలో పాల్గొనకపోవడం….
అప్పుడప్పుడు వైసీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం…మొదలైన అంశాలన్నీ….కేశినేని నానికి ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకోవాల్సిన పరిస్థితికి తెలుగుదేశం పార్టీని నెట్టాయి.

ఈ దశలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అద్భుతమైన పరిణతిని ప్రదర్శించి…పార్టీ నిర్ణయాన్ని ముగ్గురు సీనియర్ నాయకుల ద్వారా నానికి తెలియజేశారు.
తిరువూరు సభను కేశినేని చిన్ని నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు సభవిజయవంతంగా జరిగిన తర్వాత….తమ్ముడి మీద ద్వేషం నానిని తాడేపల్లికి నడిపించింది.
కేశినేని నాని రాజకీయ చరిత్ర ముగిసింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక వ్యక్తి మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుని వెళ్తున్నాడు.
విజయవాడ లోక్ సభ పరిధిలో ఏడుగురు శాసనసభ ఇన్చార్జిలతో అద్భుతమైన సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని,నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నాడు. వైద్య శిబిరాలు నిర్వహించి అనారోగ్యంతో ఉన్న వేలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు.

నిరుద్యోగులకు స్వయం ఉపాధికి అండగా నిలుస్తున్నాడు.తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తున్నాడు. మరోపక్క….కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఒంటి చేత్తో… నారా లోకేష్ గారి యువ గళం పాదయాత్రను విజయవంతంగా నిర్వహించడం ద్వారా….తన నాయకత్వ లక్షణాలను… తనకున్న ప్రజాబలాన్ని నిరూపించుకున్నాడు.

ఆ నాయకుడే….కేశినేని చిన్ని.

సొంత అన్న ఎన్ని విమర్శలు చేసినా….
ఎంత మానసిక క్షోభకు గురి చేసినా…పోలీసు కేసులు పెట్టి వేధించి నా…..
ఎక్కడా నోరు జారలేదు.
అన్నను అగౌరవంగా మాట్లాడలేదు
ఎక్కడా పార్టీ క్రమశిక్షణ అతిక్రమించలేదు.
ఒక ఋషిలా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
అనారోగ్యంతో కొడుకు హాస్పటల్లో ఉన్నప్పటికీ….బాధను మౌనంగా దిగమింగి…
తిరువూరు సభ నిర్వహణలో మునిగి పోయాడు.

ఆఖరిగా….విజయవాడ లోక్ సభ ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే….
ఆర్థిక ఉగ్రవాదుల ఆధిపత్యం నుంచి, అమరావతి ద్రోహుల నుంచి విజయవాడ ను కాపాడుకోవాలి.

అందుకోసం చంద్రబాబు భక్తుడు. లోకేష్ సైనికుడు కేశినేని చిన్ని గారికి….అండగా నిలుద్దాం.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE