Suryaa.co.in

Andhra Pradesh

మద్యపాన నిషేధం హామీపై జగన్ అసెంబ్లీ సాక్షిగానే మాట తప్పాడు

– ముఖ్యమంత్రికి ప్రజలప్రాణాలంటే విలువలేదనడానికి అసెంబ్లీలో ఆయన తీరుని బట్టే అర్థమవుతోంది
– మాజీమంత్రి, టీడీపీ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప

రాష్ట్ర అసెంబ్లీలో ఏడు రోజుల నుంచి ప్రభుత్వం చేస్తున తంతుని గమనిస్తూనే ఉన్నాం. జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై చర్చించాలని తాముకోరుతుంటే, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి భజనచేస్తూ, ఆయనఅసమర్థతను చేతగానితనాన్ని కప్పిపుచ్చేలా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి నిలయమైన సభలో ప్రజలప్రాణాలంటే విలువలేకుండా ప్రవర్తించడం విచారకరం.

టీడీపీ సభ్యులు మాట్లాడటమే నేరమన్నట్టుగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. నిత్యం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయిస్తూ, వారి పద్ధతిలో వారు భజనచేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు నచ్చినట్టుగా సభను నడిపించు కోవడానికే టీడీపీ సభ్యులను బయటకు పంపుతున్నాడు. తానుఇచ్చిన మద్యపాననిషేధం హామీపై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే మాట తప్పాడు.

నాటుసారావల్ల చనిపోయినవారి వివరాలను పేర్లు, చిరునామాలతో సహా తాము ఇచ్చినా, మృతులకుటుంబసభ్యులను కలిసి స్వయంగా మాపార్టీతరుపున వారికి ఆర్థికసహాయం అందించినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గం. రాష్ట్రంలో అన్నివర్గాలప్రజలు నానా అవస్థలు పడుతున్నా… వారి సమస్యలపై స్పందించకుండా ముఖ్యమంత్రి ఏకపక్షంగా సభను నడుపుకుంటూ, తమగొంతు నొక్కే ప్రయత్నాలను నిర్విరామంగా చేస్తున్నాడు.

ప్రతిపక్షంతో మాకు పనేలేదు అన్నట్లుగా ప్రభుత్వం సభను నడుపుతోంది : టీడీపీ శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ
ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యంలో ఉందా అన్నఅనుమానం ప్రజలకు కలుగుతోంది. గత పది రోజులనుంచీ సభ నడుస్తున్న తీరు చూస్తుంటే ప్రతిఒక్కరికీ అదే అనుమానం కలుగుతోంది. చట్ట సభలంటే ఇరుపక్షాలు ప్రజాసమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించే వేదికలని చెప్పాలి. అలాంటిసభలను ఈ ప్రభుత్వం తమకు నచ్చినట్టుగా నడుపుకుంటూ, ప్రతిపక్షంమాకు అనవసరం.

మాభజన మేంచేసుకుంటాం… అసలు మాకు ప్రతి పక్షంతో పనేలేదన్నట్లుగా ప్రవర్తిస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై న్యాయవిచారణజరిపించాలని, మృ తులకుటుంబాలకు ప్రభుత్వం న్యాయంచేయాలని తాము డిమాండ్ చేస్తుంటే, అధికారపార్టీ సభ్యులు, మంత్రులు మమ్మల్ని హేళనగా మాట్లాడుతున్నారు. వైసీపీసభ్యులంతా సారా మరణాలఘటన చిన్నవిషయం అన్నట్టుగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సభల్లో ఏ అంశంపై చర్చజరిగినా, దానిసారాంశం ప్రజలకు చేరాలంటే వారు అసలు ప్రాణాలతో ఉండాలికదా!

ప్రజల ప్రాణాలుపోతున్నాయి.. పట్టించుకోండయ్యా అంటుంటే, అధికారమదంతో ఎవరి ప్రాణంపోతే మాకేంటి అన్నట్లుగా పాలకపక్షం దుర్మార్గంగా వ్యవహరించడం బాధాకరం. నాటుసారా మరణాలు, కల్తీమద్యం విక్రయాలపై సభలో మాట్లాడటానికి ప్రభుత్వం ఎందుకిం తలా భయపడుతోందో అర్థంకావడంలేదు. ప్రభుత్వం తప్పులున్నాయి కాబట్టి.. అధికారపార్టీ నాటుసారామరణాలపై చర్చించడానికి వెనుకాడుతోందని ప్రజలంతా అర్థంచేసుకోవాలి.

ప్రజలంతా వాస్తవాలు గమనించి ఈ ముఖ్యమంత్రికి తగినవిధంగా బుద్ధిచెప్పాలని కోరుతు న్నాం. సభలో మేం ఏమిమాట్లాడుతున్నాము.. మా గొంతుఎత్తకుండా ప్రభుత్వం ఎలా అడ్డు కుంటోందనే విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలసమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రే సర్వం అన్నట్టుగా అధికారపార్టీ సభ్యులు, మంత్రులు ఆయన భజనలో ముని గితేలుతున్న వైనాన్నిఏపీప్రజలంతా గమనించాలని కోరుతున్నాం.

టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్, మద్దాలి గిరిధర్ తో జీరో అవర్ లో మాట్లాడించడం ఎలాంటి నిబంధనో సమాధానం చెప్పాలి: టీడీపీ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు
అసెంబ్లీ జరుపుతున్న తీరుపై ముఖ్యమంత్రి ఒక్కసారి ఆత్మవిమర్శచేసుకుంటే మంచిది. టీడీపీసభ్యులను పదేపదే సభనుంచి బయటకు పంపి, ప్రభుత్వం ఏంచేయాలనుకుంటోంది. నాటుసారావల్ల ప్రజలప్రాణాలు పోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా, దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సభలో జరిగేవాటిని ప్రజలకు తెలియకుండా, వారుఅనుకున్నదే బయటకు పోయేలా మీడియావారిని నియంత్రిస్తున్నారు.

ప్రతిపక్షసభ్యులు లేకుండా, మార్షల్స్ సాయంతో సభను నడుపుతున్న స్పీకర్ ను ఇప్పుడేచూస్తున్నాం. స్పీకర్ మాట్లాడితే నిబంధనలు అంటున్నారు… మరి టీడీపీసభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ టీడీపీసభ్యుడైన మద్దాలిగిరిధర్ తో స్పీకర్ జీరో అవర్ లో ఎలామాట్లాడిస్తాడని ప్రశ్నిస్తున్నాం. టీడీపీసభ్యు ల్లో ఆఖరి సభ్యుడుకూడా నాటుసారా మరణాలపై ప్రభుత్వం స్పందించేవరకు సభలో పోరాడ తాడని స్పష్టంచేస్తున్నాం.

LEAVE A RESPONSE