– కరుణాకర్ కుటుంబాన్ని వైసీపీ నేతలు రోడ్డున పడేస్తే లోకేష్ అక్కున చేర్చుకున్నారు
– భూకబ్జాలు చేసే నాయకుడు కాదు. ఐపీఎస్ లను జైలుకు పంపలేదు
– సంవత్సరాల పాటు జైలు జీవితం గడపలేదు
– ఆదర్శంగా బ్రతుకుతూ ప్రజల పక్షాన నిలబడుతూ పోరాడుతున్న వ్యక్తి నారా లోకేష్
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
నెల్లూరు నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ,షేక్ అబ్దుల్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాలేపాటి సుబ్బానాయుడు ,జెన్నీ రమణయ్య,కొండూరు పోలిశెట్టి ,బొమ్మ సురేంద్ర,తాళ్లపాక అనురాధ లతో కలిసి పాల్గొన్న బీద.
అనంతరం మీడియాతో బీద మాట్లాడుతూ… దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని నారా లోకేష్ బాబు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు గారు, లోకేశ్ బాబు హామీ ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి కరుణాకర్ కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేశాం. ఎస్సీ కమీషన్ నుంచి జిల్లా కలెక్టర్ గారికి సూచనలు వచ్చాయి.
మృతుడు కరుణాకర్ తన ఇంటిని విడిపించుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. వైసీపీ నేతల చుట్టూ తిరిగి ప్రాధేయపడ్డారు, అయినా వైసీపీ నేతలు కనికరించలేదు. కరుణాకర్ ఇంటి పత్రాలను వారి కుటుంబ సభ్యులకు అందరి సమక్షంలో అందజేశాం. ఎస్సీ కమిషన్ నుంచి ఇంటి ప్లాటు, పొలం వచ్చినా, ఉద్యోగం వచ్చినా అందుకు కారణం టీడీపీ చేసిన కృషే.
కరుణాకర్ కుటుంబానికి న్యాయం చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుబ్బానాయుడు ఎంతో శ్రమించారు.టీడీపీ నాయకులందరూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు.కాకాణి గోవర్థన్ రెడ్డి ఇష్టారీతిన లోకేశ్ ను దుర్భాషలాడారు. లోకేశ్ నాలుగు లక్షల మంది యువత కు నిరుద్యోగ భృతి కల్పించారు. పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అటువంటి వ్యక్తిపై దుర్భాషలాడడం భావ్యం కాదు.
లోకేశ్ వైసీపీ నాయకుల్లా దొంగ ఇసుకను అమ్ముకునే వ్యక్తి కాదు. గ్రావెల్ మాఫియా నడిపే వ్యక్తి కాదు. సిలికా మాఫియా చేస్తున్న వ్యక్తి కాదు.డీపీకి చెందిన వ్యక్తి చనిపోయారని నారా లోకేష్ రాలేదు, వైసీపీ కార్యకర్త చనిపోతే వచ్చారు. అది ఆయన గొప్పతనం. చంపింది కూడా వైసీపీవారే.
నెల్లూరులో చనిపోయిన ఉదయగిరి నారాయణ కూడా టీడీపీ కాదు. అయినా పరామర్శించారు. అన్యాయం జరిగిన వ్యక్తి ఏ పార్టీ కి చెందినవాడు అని తెలుగుదేశం పార్టీ చూడదు. అందరినీ ఆదుకుంటుంది.ఇలాంటి ఘోరాలు నెల్లూరులో మునుపెన్నడూ లేవు. కాకాణి గోవర్థన్ ది నోరా తాటిమట్టా? కాకాణి గోవర్థన్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలి.
కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో సైతం నారావారి పల్లె లో సామాన్య జీవితం గడిపిన నిరాడంబర వ్యక్తిత్వం నారా ఖర్చూరపునాయుడు ది.రచ్చ బండపై కూర్చొని అతి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి నారా ఖర్జూరపు నాయుడు. వారి గొప్ప తనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నారా ఖర్జూరపు నాయుడు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించమని వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాం.
వైసీపీ నాయకులకన్నా బందిపోటు దొంగలు నయం. చంద్రబాబునాయుడుగారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే వైసీపీ నేతలు వారి వ్యక్తిత్వాల గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. లోకేశ్, చంద్రబాబునాయుడు ల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదు. ఇంకో సారి ఇలా పిచ్చి ప్రేలాపనలు పేలితే ఊరుకునేది లేదు ఖబడ్దార్.