Suryaa.co.in

Telangana

కేటీఆర్‌పై సమరానికి ఎన్నారై రె‘ఢీ’

– సిరిసిల్లలో పోటీకి ఎన్ ఆర్ ఐ సై
* ఎన్ ఆర్ ఐ లకు కేటీఆర్ చేసిందేమిలేదు
* గల్ఫ్ కార్మిల పట్ల కేసీఆర్ సర్కారు సవతి ప్రేమ
– కాంగ్రెస్ ఎన్ ఆర్ ఐ సెల్ దుబాయి కన్వీనర్ గా ఎస్ వి రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను బరిలో దించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రీనింగ్ కమిటీ కూడా పరిశీలిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, లాంటి బలమైన నేతలపై కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలో దించాలనే అంశంపై కూడా హస్తం నేతలు చర్చలు జరుపుతున్నారు.

ఈ తరుణంలో సిరిసిల్ల నుంచి కేటీఆర్ పై తాను పోటీ చేస్తానని ముందుకు వస్తున్నారు ప్రవాస భారతీయుడు ఎస్ వి రెడ్డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ ఆర్ ఐ సెల్ దుబాయి కన్వీనర్ గా ఉన్న ఎస్ వి రెడ్డి కేటీఆర్ పై పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కేటీఆర్ పై తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుసాధించగలనని ఎస్ వి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సేవాదళ్ లో 1998 లోనే పని చేసిన ఎస్ వి రెడ్డి కాంగ్రెస్ పార్టీతో 23 ఏళ్ళ అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును తూచా తప్పకుండ పాటించి పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేశానని ఎస్ వి రెడ్డి చెప్తున్నారు.

ప్రవాస భారతీయులకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదని ఎస్ వి రెడ్డి ఆరోపించారు. ప్రపంచంలో అతి ఎత్తినా బుర్జు ఖలీఫాపై బతుకమ్మ సంబురాలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసింది కానీ వలస కార్మికుల బాగోగుల గురించి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చెయ్యలేదని ఎస్ వి రెడ్డి అన్నారు. బతుకమ్మ సంబురాలు దుబాయికి వచ్చి పనులు చేసుకుంటున్న కార్మికుల పొట్ట నింపలేదని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ ఆర్ ఐ ల సంక్షేమ కోసం సరైన పాలసీ లేదని తెలిపారు. దుబాయి వంటి దేశాలకు ఇంకా తెలంగాణ నుంచి వలసలు వెళ్తున్నారంటే ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కొరోనా సమయంలో సైతం వలస కూలీలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలదని, ఇక్కడ ఉండి ఇబ్బంది పడ్డ తెలంగాణ వలస కార్మికులకు తాను దగ్గరుండి సహాయం చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభాస భారతీయుల కోసం ఎన్నో చేస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ సర్కారు దుబాయికి వలస వెళ్తున్న తెలంగాణ బిడ్డల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని ఎస్ వి రెడ్డి విమర్శించారు.

ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అందుకే తాను కేటీఆర్ మీద పోటీ చెయ్యాలనుకుంటున్నానని ఎస్ వి రెడ్డి వెల్లడించారు. గల్ఫ్ కు వలస వచ్చే కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని అప్పుడే సిరిసిల్ల ప్రజల ఓట్లు అడగాలని ఎస్ వి రెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల, జగిత్యాల వంటి ప్రాంతాల నుంచి అత్యధిక శాతం వలస కార్మికులు దుబాయి లాంటి ప్రాంతాలకు వెళ్లారని , వారి సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చెయ్యలేదని అన్నారు.

LEAVE A RESPONSE