-గాజుల మురళీకృష్ణ కుమార్తె వైద్యానికి 15 లక్షల సాయం
-చెక్ అందజేసిన టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్
ఆపదలో వున్న వారిని ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. NRI TDP USA కూడా టిడిపి కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ అండగా నిలుస్తూ భరోసా ఇస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు గాజుల మురళీకృష్ణ కుమార్తె కిడ్నీ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు సూచించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సూచనల మేరకు చిన్నారి లాస్య వైద్యానికి కోమటి జయరామ్ ఆధ్వర్యంలో NRI TDP USA సభ్యుల సహాయ సహకారాలతో 15 లక్షల రూపాయలు సమీకరించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం 15 లక్షల చెక్కుని పాప తండ్రి మురళీకృష్ణకి టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అందజేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన NRI TDP USA బృందాన్ని ఈ సందర్భంగా లోకేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టిడిపి ఇంఛార్జ్, సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు, నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.