Suryaa.co.in

Telangana

అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్

– రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు

తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని.. రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలిపారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటున్నాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి అడేలా చూడాలని.. అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వెల్లడించారు. నిరంతరం బయట ఉంటూ విధులు నిర్వహించే వాళ్లు ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రావొద్దని చెప్పారు. కలుషిత నీరు, నిల్వ చేసిన ఆహారం తీసుకోవద్దని సూచించారు.

LEAVE A RESPONSE