Suryaa.co.in

Latest post

ఆగస్టు 15 నుంచి ఎన్టీఆర్ క్యాంటీన్లు?

అమరావతి: ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి.. ఆరోజు కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది.. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ…

పల్నాడు జిల్లాలో పులి సంచారం

వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం వెలుగుచూసింది. బొటుకులపాయ బేస్ క్యాంపు వద్ద పులి తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అటవీ ప్రాంతంలో నీరులేక జంతువులు సాసర్ పిట్ల వద్దకు వస్తున్నాయని విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. అయితే నాలుగు రోజుల కిందట ఈ పులి సంచరించినట్లు…

రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం

-ప్రతి పైసలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పంపిణీ చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం -రైతు భరోసా పై విధివిధానాలు రూపొందించడానికే ప్రజాభిప్రాయ సేకరణ -పది జిల్లాల రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలను చట్టసభలో పెట్టి చర్చిస్తాం -చట్టసభలు చర్చ జరిగిన తర్వాత రైతు భరోసా పై విధివిధానాల రూపకల్పన -ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడించిన…

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా చినరావూరు పార్క్ సమీపంలో సీఐటీయూ  ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ… కార్మకులందరికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రత…

ఓయూలో జర్నలిస్టులపై జరిగిన పోలీసుల దాడిని ఖండిద్దాం

-అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి -HUJ-TUWJ నేతలు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అమానుషంగా పోలీసులు లాక్కెళ్లడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్…

కేతిరెడ్డి- మీరూ ఓదార్చుకోండి

– కేటీఆర్‌కు మంత్రి సత్య కౌంటర్ – సత్య ఎక్స్‌ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్ అమరావతి: ఏపీ మంత్రి సత్యకుమార్- బీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా కౌంటర్-ఎన్‌కౌంటర్ నడిచింది. చివరాఖరకు సత్య సంధించిన వ్యంగ్యాస్త్రాలు భరించలేక కేటీఆర్, తన ఎక్స్ అకౌంట్‌లో సత్యను బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘నిరంతరం ప్రజల…

ప్రకాశం బ్యారేజ్ ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా తూర్పు డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల 11 నియోజక వర్గాల్లో 35 మండలాల్లో లక్షలాది ఎకరాలను స్టిరీకరించడమే లక్ష్యంగా సాగు నీరు విడుదల కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది తాగునీరు సాగునీరు అన్ని ప్రాంతాలకు అందించేలా నీటి…

మరికాసేపట్లో కృష్ణ డెల్టాకు సాగునీటి విడుదల

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ డెల్టాకు మరికొద్ది సేపట్లో అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాల కృష్ణా నదిలోకి చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిలువలు చేరాయి. దీంతో గోదావరి జలాలను మరి కాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు…

సూర్యలంక బీచ్ కు అనుమతి

-బాపట్ల రూరల్ సీఐ వై శ్రీహరి.. గత కొంతకాలంగా సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించారు.. చీరాల రామాపురం బీచ్ అలాగే సూర్యలంక సముద్ర తీరంలో కొంతమంది యువకులు గల్లంతవడంతో సముద్ర తీరంలో పర్యాటకులను నిషేధించడం జరిగింది. అయితే బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఉత్తర్వులు…

ప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలను వీడని వైసీపీ

• అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్పను పొట్టన పెట్టుకున్న వైసీపీ గూండాలు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరిలో టీడీపీ కార్యకర్త గొల్ల ఆదెప్ప హత్య బాధాకరం. కర్ణాటక వెళ్లి తిరిగివస్తున్న ఆదెప్పను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు అతనిపై కత్తులతో దాడి చేసి నరికి చంపారు….