– కార్యకర్తే అధినేత… ఇదీ టీడీపీ సిద్దాంతం
– కార్యకర్తల పిల్లలకు విద్య, ఉపాధి కల్పిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం
– టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి రూ. 135 కోట్లు
– పని చేసిన వారికి పదవులు… జెండా మోసిన వారికి జేజేలు
– టీడీపీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా సోషల్ మీడియాలో సూడో మేధావుల పోస్టింగులు
– వైసీపీ చిమ్మే విషానికి విరుగుడు మంత్రం మేమే కనిపెడతామంటోన్న కార్యకర్తలు
గతంలో పార్టీపై నమ్మకంతో, అంకితభావంతో కలిసి కష్టపడ్డ వ్యక్తులు కొందరు – ప్రస్తుత పరిణామాలలో వారి వైఖరి కాస్త అనుమానాస్పదంగా మారుతోంది. ‘మేము పార్టీలో లేము’ అంటూనే, పార్టీ బాగు కోసం, అధికారం నిలబెట్టుకోవడం కోసం అంటూ సలహాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో, రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ దాదాపు ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్నీ తప్పుబడుతున్నారు.
తమను పట్టించుకోవడం లేదనే భావనతో, వైసీపీలో కనిపించే అసభ్యకరమైన భాష స్థాయిలో కాకపోయినా, కాఠిన్యమైన పదజాలం వాడటం మొదలుపెట్టారు. ఇది కలిసి పనిచేసిన వారి మనసులను గాయపరుస్తోంది. ప్రతికూలంగా స్పందిస్తే గత స్నేహం దెబ్బతింటుందనే భావనతో చాలా మంది మౌనం వహిస్తున్నారు.
అయితే, ‘క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతామ’ని బాహాటంగా, రోజువారీ సలహాలను ఫేస్బుక్ వేదికగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది కేవలం సలహాలుగా కాక, మానసికంగా ఇబ్బంది కలిగించే పోస్టు.
టీడీపీతో పార్టీ కార్యకర్తలది పేగు బంధం
అధికారంలో ఉండగా నా వెంట్రుక పీకలేరని మేకపోతు గాంభీర్యం ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి… అధికారం కొల్పోయాక కోడి గుడ్డు మీద ఈకలు పీకే పనిని ఆ పార్టీకి చెందిన పిల్ల సైకోలకు అప్పజెప్పినట్టు కన్పిస్తోంది. ఈ సైకోలు.. ఇంకొందరు సూడో మేధావులతో కలిసి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు.
న్యూట్రల్ ముసుగులో ఉండి అభూత కల్పనలు సృష్టించి… విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల గురించి లేనిపోని కథనాలు పుట్టిస్తున్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టింగులు పెడుతున్నారు. ఇలాంటి సూడో సోషల్ మీడియా మేధావులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే… టీడీపీ కేడర్ బేస్డ్ పార్టీ. ఒక్క తెలుగుదేశానికి తప్ప దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీకి ఇలాంటి పేరు లేదు.
తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎన్నో అటుపోట్లు.. సవాళ్లను ఎదుర్కొంది. ఎలాంటి సంక్షోభ స్థితి నుంచైనా తెలుగుదేశం పార్టీని అవలీలగా గట్టెక్కించింది ఆ పార్టీ కార్యకర్తలే. ఎన్టీఆర్.. చంద్రబాబు ఇద్దరూ కార్యకర్తల అభీష్టాన్ని.. కార్యకర్తల అభిమతాన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీని రన్ చేశారు. ఇప్పుడు లోకేష్ కూడా ఆ దిశగానే కార్యకర్తల సంక్షేమం దిశగా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీ మూలస్థంభాల్లా నిలిచిన కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే కార్యకర్తలను టార్గెట్ చేసుకుని కొందరు సోషల్ మీడియా సైకోలు పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికారంలో ఉన్నా.. లేకున్నా… తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఎప్పుడూ ఆలోచన చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ పని చేస్తూనే ఉంది.. ఉంటోంది.. ఇక పైనా ఉంటుంది. కార్యకర్తల సంక్షేమం కోసమే పార్టీ అధినాయకత్వం ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది.. పార్టీ కోసం పని చేసే పేద కార్యకర్తల పిల్లలకు చక్కటి విద్యను అందిస్తోంది.
కార్యకర్తల సంక్షేమం కోసమే టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించింది. ఈ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల పిల్లలకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం.. వారికి ఉపాధి చూపించండం వంటివి చేస్తోంది. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ తరహాలో కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇక కార్యకర్తల సంక్షేమం కోసం.. వారిని ఆదుకునేందుకు టీడీపీ అధినాయకత్వం బీమా సౌకర్యం కల్పిస్తోంది. ప్రమాదంలో కార్యకర్తలు ఎవరైనా చనిపోతే రూ. 5 లక్షల బీమా అందించనుంది. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ. 135 కోట్లు ఖర్చు పెట్టిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందీ అంటే తెలుగుదేశం పార్టీనేనని ఘంటా పధంగా చెప్పొచ్చు.
ఇది కార్యకర్తల విషయంలో టీడీపీ చేస్తున్న సంక్షేమంలో ఓ కోణం మాత్రమే. ఇక సామాన్య కార్యకర్తకు పెద్ద పీట వేసే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. జెండా పట్టిన కార్యకర్తకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు సంకల్పం తీసుకుంది. పని చేసే కార్యకర్త ఎవరనే అంశాన్ని గమనించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసిన తొలి పార్టీ టీడీపీనే.
ఆ వ్యవస్థ ఆధారంగా పని చేసి వారికి పట్టం కట్టడం.. అందలం ఎక్కించడమనేది చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవుల్లో పార్టీ కార్యకర్తలను అధిష్టింప చేస్తోంది. ఇక పార్టీ పదవుల్లో కూడా పని చేసే వారికే ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిఖార్సైన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో పదవులు దక్కాయి.
ఇప్పటికే మెజార్టీ పోస్టుల భర్తీ కూడా జరిగిపోయింది. పోలింగ్ బూత్ లలో పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారికి పదవులు దక్కాయి. ప్రతిపక్షంలో ఉండగా తెగించి పోరాడిన వారికి ప్రాధాన్యత దక్కింది. ఇక పార్టీ కోసం జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఓ విధంగా ఇది చరిత్ర అనే చెప్పాలి.
పార్టీ కోసం పని చేసి అక్రమ కేసులు పెట్టించుకున్న వారి కేసులు ఎత్తేశారు. ఇక పార్టీ కార్యకర్తలకు రావాల్సిన నీరు-చెట్టు, నరేగా పనులకు సంబంధించిన బిల్లుల కోసం ప్రతిపక్షంలో ఉండగా న్యాయ పోరాటం చేయడంతోపాటు, అధికారంలోకి వచ్చాక వాటిని విడుదల చేశారు.
సోషల్ మీడియా పిచ్చి రాతలు రాసే సూడోగాళ్లు తెలియని విషయమేమింటంటే.. తెలుగుదేశంతో ఆ పార్టీ కార్యకర్తలకు ఉండేది పేగు బంధం. టీడీపీకి కార్యకర్తలు అండగా నిలుస్తారు. కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్దాంతం. ఈ బంధం పెరిగేదే తప్ప తరిగేది కాదు.
ఇక మరో ముఖ్య విషయం వైసీపీ తరహాలో కార్యకర్తలను తప్పుడు పనులు చేయాల్సిందిగా తెలుగుదేశం ఎప్పుడూ ప్రొత్సహించదు. కార్యకర్తలను పురుగుల్లా చూసి పార్టీ కార్యాలయంలోకే అడుగు పెట్టనివ్వని వైసీపీ లాంటి పార్టీలు ఓవైపు కన్పిస్తూనే ఉన్నాయి. పార్టీ కార్యాలయాన్ని తమ సొంతిల్లుగా భావించమని కార్యకర్తలకు చెప్పే పార్టీ తెలుగుదేశం. కార్యకర్తల కోసం ఎప్పుడైనా నా తలుపు తట్టవచ్చని చెప్పే నాయకత్వం టీడీపీకే సొంతం. అందుకే టీడీపీ ఇంత బలంగా ఉంది.