Suryaa.co.in

Andhra Pradesh

బ్యాంకులకు కన్నం వేస్తున్న జగన్ రెడ్డి …కన్నెర్ర చేసిన ఆర్బీఐ

• ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఉగ్రవాదం చూశాక బ్యాంకులకు రుణాల మంజూరు విషయంగా ఘాటైన లేఖ రాసిన ఆర్బీఐ
• అడ్డదారిలో కోట్లు మింగడానికి ఆర్బీఐ నిబంధనలకు తూట్లు పొడవడంపై బుగ్గన, సజ్జల సమాధానం చెప్పాలి
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

గత కొద్దినెలలుగా దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విదితమే. ముఖ్యంగా శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, దాని పర్యవసానాలు చూశాక మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు చాలక కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడిగా తీసుకొస్తున్న అప్పులు, చెల్లిస్తున్న అధిక వడ్డీలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

FRBM నిబంధనలు తుంగలో తొక్కి అప్పులు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ దేశంలోనే విపరీతంగా అప్పులు చేసిన రాష్ట్రంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దారుణమైన కీర్తి సంపాదించింది. ప్రభుత్వ పరంగా చేసే అప్పులే కాకుండా వివిధ సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి మరీ అడ్డదారుల్లో అప్పులు చేస్తున్నారు. సూట్ కేసు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో ఏ1, ఏ2లకు మంచి ప్రావీణ్యం ఉంది.

బ్యాంకుల నుంచి నిధులు కొల్లగట్టడమే ప్రధాన ధ్యేయంగా సూట్ కేసు కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. APSDC (ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 25,000 కోట్లు సమీకరించారు. సంక్షేమం పేరుతో తెచ్చిన ఆ సొమ్మును దారి మళ్లించి అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇదే అంశాన్ని ప్రధాన దినపత్రికల్లో మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎఫ్ ఆర్ బీఎఎమ్ పరిధిని తప్పించుకోని అదనపు అప్పులు చేయడం కోసమే ఏర్పాటవుతున్న ఈ కంపెనీల వ్యవహారంపై గతంలోనే ప్రధాన దినపత్రికలు పతాక శీర్షికల్లో ప్రస్తావించాయి.

ఆనాడు ఈ సూట్ కేసు కంపెనీల ఏర్పాటు సందర్భంగా మేము ఆందోళన వ్యక్తం చేసిన అంశాలపైనే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు గట్టిగా ప్రస్తావిస్తూ, గతంలో కంపెనీలకు అప్పులిచ్చే విషయంగా బ్యాంకులకు తాము జారీ చేసిన మార్గదర్శకాలు ఉల్లంఘనకు గురవుతున్నటువంటి సందర్భంలో, బ్యాంకులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ లేఖ రాయడం జరిగింది. ఏపీలో జరుగుతున్న ఆర్థిక ఉగ్రవాదాన్ని, రాష్ట్ర ప్రభుత్వం డొల్ల కంపెనీల ఏర్పాటుతో బ్యాంకులను చేస్తున్న లూటీని చూశాక ఇష్టానుసారంగా నిబంధనలు తుంగలో తొక్కి లోన్లు ఇవ్వడం సరికాదని, ఆర్బీఐ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, జూన్ 14, 2022న అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. దానినే ఈరోజు ప్రధాన పత్రికలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి.

ఆర్బీఐ వారు జారీ చేసిన ఆ సర్క్కులర్ లో చాలా స్పష్టంగా అని “We have come across instances where banks have not been strictly complying with our extant instructions on assessment of commercial viability, ascertainment of revenue streams for debt servicing obligations and monitoring of end use of funds in respect of their financing of projects of government owned entities” బ్యాంకులు వివిధ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడుతున్న కంపెనీలకు రుణాలు ఇచ్చే విషయంలో ఆర్బీఐ నిబంధనలను పాటించడం లేదని , ఇచ్చే ఆరుణాల యొక్క అంతిమ వినియోగాన్ని కూడా సరిగా గుర్తించడం లేదని అంటూ “ Banks/ FIs have also been found to have violated our instructions which inter alia require that in case of projects undertaken by government owned entities, term loans should be sanctioned only for corporate bodies; due diligence should be carried out on viability and bankability of the projects to ensure that revenue stream from the project is sufficient to take care of the debt servicing obligations; and that the repayment/ servicing of debt is not from budgetary resources” బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, రుణాల మంజూరు సమయంలో ప్రాజెక్టు లోటుపాట్లను పరిగణలోకి తీసుకోకుండా, అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యం ఆ కంపెనీకి ఉందా లేదా అన్న అంచనా కూడా వేయకుండా రుణాలు మంజూరు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది.

” Attention of the banks is especially drawn towards the specific instructions contained in the paragraphs referred to in the Annex. It is reiterated that banks are required to follow these instructions in letter and spirit” గతంలో అనేక సందర్భాల్లో తాము జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా బ్యాంకులు పాటించి తీరాల్సిందేనని పేర్కొంటూ కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలను తిరిగి గుర్తు చేయడం జరిగింది. “Banks are advised to carry out a review and place before their Boards, a comprehensive report on the status of compliance with the instructions within three months from the date of this circular “మూడు నెలల కాలంలో తాము నేడు జారీ చేసిన ఈ ఆదేశాలను నిర్వర్తిస్తూ తాము పేర్కొన్న అన్ని అంశాలపైనా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల దగ్గర తీసుకంటున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బడ్జెట్ అవసరాల కోసం ఉపయోగించేందుకు వీల్లేదని జూలై 1, 2015లో ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్ పేరాగ్రాఫ్ 2.3.7.3లో స్పష్టంగా ఉంది. “ it should be ensured by banks and financial institutions that these loans/investments are not used for financing the budget of the State Governments” అదే విషయాన్ని జూన్ 14, 2022లో జారీ చేసిన సర్క్యులర్ లో ఆర్బీఐ మరోసారి ప్రస్తావించింది. అలాగే జులై 1, 2015న జారీ చేసిన సర్క్యూలర్ లోని పేరాగ్రఫ్ 2.3.7.3లో మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది. “State Government guarantees may not be taken as a substitute for satisfactory credit appraisal” అప్పులు ఇచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీనే క్రైటీరియాగా తీసుకొని ఇష్టానుసారంగా సూట్ కేసు కంపెనీలకు అప్పులు ఇవ్వడానికి వీల్లేదని 2015, జులై 15న ఇచ్చిన సర్క్కులర్ లో చెప్పిన అంశాన్ని మరోసారి ఆర్బీఐ గుర్తుచేసింది. మేమిచ్చిన మార్గదర్శకాలు ధిక్కరిస్తే ఊరుకోమని కూడా చెప్పింది.

ఆర్బీఐ పై విధంగా బ్యాంకులు …కంపెనీలకు లోన్లు ఇచ్చిన సమయంలో పాటించాల్సిన నిబంధనలు అంత స్పష్టంగా పేర్కొంటే మన రాష్ట్రం వాటిని తుంగలో తొక్కుతూ అనేక జీవోలను విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేయడానికి కావాల్సిన రాష్ట్ర బడ్జెట్ అవసరాల కోసం APSDC ఏర్పాటు చేస్తున్నామని 27.08.2020న ఇచ్చిన జీవో నెంబర్ 80లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. “ Finance Department – Establishment of the Andhra Pradesh State Development Corporation Limited (APSDC) as a 100 % State owned Public Limited Company with the mandate of planning, funding and financing social and economic development projects and activities in the State of Andhra Pradesh”

కంపెనీల పేరుతో తీసుకుంటున్న రుణాలను రాష్ట్ర బడ్జెట్ అవసరాలకు వాడకూడదని ఆర్బీఐ స్పష్టంగా చెబుతుంటే.. రాష్ట్ర బడ్జెట్ అవసరాలకే మేము కంపెనీలు పెడుతున్నామని వైసీపీ ప్రభుత్వం జీవో80 ఇచ్చిందంటే ఏమనాలి? ఇది ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించడం కాదా.? ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలను మాత్రమే ఆధారంగా చేసుకుని మీరు అప్పులు ఇవ్వొద్దని ఆర్బీఐ బ్యాంకులకు చెప్పినప్పటికీ మేము గ్యారంటీ ఉంటాం, రూ.25,000 కోట్లు అప్పు ఇమ్మని 03.11.2020 జీవో నెంబర్ 22 జారీ చేసి ఆర్బీఐ గైడ్ లైన్స్ నూ వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది.

ఆ జీవోలో “ Issue of Government Guarantee to the Andhra Pradesh State Development Corporation Limited for Rs.25,000 crore” మోసకారి సంక్షేమ పథకాల పేరుతో కొన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టి అమ్మఒడి సహా ఇతర పథకాల మాటున నిధులు ఎలా స్వాహా చేయడానికి ఏ విధంగా పథక రచన చేశారో 8.01.2021న జీవో నెంబర్ 3 చూస్తే స్పష్టంగా ఉంది..ఆ జీవోలో “Implementation and funding of Jagananna Amma Vodi Programme for the financial year 2020-21 by Andhra Pradesh State Development Corporation” జగనన్న అమ్మఒడి పథకాన్ని అడ్డుపెట్టుకుని APSDC ద్వారా బ్యాంకుల నుంచి నిధులు సమీకరించి స్వాహా చేయడం కోసం జారీ చేసిన జీవో ఆర్బీఐ మార్గ దర్శకాలను తూట్లు పొడవం కాదా? ఇన్ని రకాలుగా సాక్షాత్తు ప్రభుత్వ జీవోల ద్వారానే జగన్ రెడ్డ సర్కార్ ఆర్బీఐ మార్గదర్శకాలను కాలరాసింది కాబట్టే నేడు ఆర్బీఐ వారు మరలా ఒకసారి దేశంలోని బ్యాంకులకు ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాల మంజూరు సమయంలో పాటించాల్సి నియమాలను గుర్తుచేస్తూ ఘాటైన లేఖ రాసింది.

రూ. 25,000 కోట్ల రుణానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో రుణం తిరిగి చెల్లించడానికి నేడు చూపుతున్న ఎక్సైజ్ ఆదాయానికి భవిష్యత్ లో ఏ రకంగా గండిపడినా తిరిగి చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ భవిష్యత్ లో మద్యపాన నిషేదం విధించినా, ఎక్సైజ్ ఆదాయం తగ్గినా మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్నే గ్యారంటీర్ గా మేము భావిస్తాం అని గవర్నర్ పేరుతో చేసిన అగ్రిమెంట్ లో స్పష్టంగా ఉంది.

అంతేకాకుండా ఈ రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్నే principal debtగా తాము భావిస్తున్నామని స్పష్టంగా పేర్కొనబడింది. అంతేకాకుండా 2021, డిసెంబర్ 1 APSDC ఏర్పాటు ఆమోదం కోసం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో దేశంలోని అనేక రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, రెగ్యులేటరీ అథారిటీస్ కు సంబంధించిన నిబంధనలకు లోబడే APSDC రుణాలు పొందాలని పేర్కొని నేడు ఆచరణలో ఆ బిల్లులోని అంశాలకు కూడా తిలోదకాలు ఇచ్చారు.

సంక్షేమ పథకాల అమలుకు ఏరోజూ తెలుగుదేశం వ్యతిరేకం కాదు. నేడు జగన్ రెడ్డి చేస్తున్న మోసకారి సంక్షేమం కంటే రెండింతల సంక్షేమం టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే అమలు చేసి చూపించారు. 420 జగన్మోహన్ రెడ్డిలా మేము నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారంగా అప్పులు చేసి సంక్షేమంపేరుతో అవినీతికి పాల్పడలేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కూడా జగన్ రెడ్డి 420 పనులు మానకపోగా రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదనే సూట్ కేసు కంపెనీలు పెట్టి బ్యాంకులకు కన్నం వేస్తున్నాడు. ఆర్బీఐ నిబంధనలను ధిక్కరించి వేల కోట్లు దోచుకుంటున్నాడు .

దేశంలో ఒక్క ఏపీ ప్రభుత్వం తప్పించి మరే రాష్ట్రమూ ఇంత దారుణంగా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడం లేదు. కాబట్టే రిజర్వ్ బ్యాంకు ఘాటైన లేఖ రాయడం జరిగింది. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేసి తద్వారా పేదరికం నిర్మూలించాలని చంద్రబాబు గారు చెబుతారు. అదే ఆయన ఆచరణలో కూడా చేసి చూపించారు. 2014-15లో కేవలం రూ.5,20,030 కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి(GSDP) 2018-19 నాటికి రూ.9,33,402 కోట్లకు చేర్చిన ఘనత చంద్రబాబు గారిదే. నాడు చంద్రబాబు గారు ఆ రకంగా సంపద పెంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేడు జగన్ రెడ్డి చేస్తోంది ఏంటి?

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టి నేడు నమ్మి ఓట్లేసిన ప్రజలను దగా చేస్తూ మోసకారి సంక్షేమం అమలు చేస్తున్నాడు. ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గిపోవడం ఒక్క జగన్ రెడ్డి పాలనలో చూస్తున్నాం. అందుకే గడప గడప కార్యక్రమం పేరుతో వెళుతున్న వైసీపీ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు.

సత్యసాయి జిల్లాలో లలితా బాయి తనకు పించను ఆపేయడంపై ఎమ్మెల్యేను నిలదీస్తే సమస్య పరిష్కరించాల్సింది పోయి కక్షపూరితంగా ఆమెపై కేసు పెట్టి వేధించారు. ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి బ్యాంకులకు ఎలా కన్నం వేస్తున్నాడో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. FRBM లిమిట్స్ నుంచి తప్పించుకునేందుకే కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తెస్తున్నారని తెలుగుదేశం పార్టీ మొదట్నుంచీ చెబుతూనే ఉంది. కార్పొరేషన్ పేరుతో తెచ్చే నిధులు సంబంధిత కార్పొరేషన్ అవసరాలకే వినియోగించాలి. కానీ కేవలం డబ్బులు తినేయడం కోసమే కంపెనీలు పెట్టడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. సంక్షేమం కోసం అప్పులు తీసుకుంటున్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాటలు బూటకం. సంక్షేమం పేరు చెప్పి భారీ అవినీతికి పాల్పడుతున్నారు.

టీడీపీ పాలనలో రాష్ట్ర GSDPని ప్రతి సంవత్సరం 15 నుంచి 16 శాతం పెంచుకుంటూ వస్తే మీరేం చేశారు? వైసీపీ హయాంలో పెరుగుదల 1.4 శాతం మాత్రమే ఉండడం మీ చేతకానితనం కాదా.? 2018-19లో రూ.9.33 లక్షల కోట్ల దగ్గర రాష్ట్ర స్థూల ఉత్పత్తిని అప్పగిస్తే 2019-20లో కేవలం 4.2 శాతం, 2020-21లో మరీ దారుణంగా 1.4 శాతం పెరుగుదలతో స్థూల ఉత్పత్తిని పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా నాశనం చేసి, రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెరుగుదలను దెబ్బతీసి, GSDPని పెంచకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారు. ప్రజలపై వేల కోట్ల పన్నుల భారం మోపుతూ ఆ డబ్బంతా సొంత ఖజానాకు తరలిస్తున్న అరాచక విధానంపై సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్టారెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలి.

ఈ మూడేళ్లలో దాదాపు రూ. 10 లక్షల కోట్లు జగన్ రెడ్డి ఖజానాకు చేరాయి. ఆర్బీఐ రాసిన ఘాటైన లేఖను చూసి రాష్ట్రంలోని పరిస్థితులను ప్రజలు అర్ధం చేసుకోవాలి. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మేము ఆధారాలతో సహా నిరూపిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెగ గింజుకుంటున్నాడు. తప్పుడు లెక్కలతో మీడియా ముందు అంకెల గారడీ చేశాడు. మరి ఇప్పుడు లేఖలో ఆర్బీఐ ప్రస్తావించిన అంశాలపై ఏం సమాధానం చెప్తారు? గతంలో ఆర్బీఐ జారీ చేసిన అనేక నిబంధనలకు తూట్లు పొడవడంపై బుగ్గన, సజ్జల నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE