Suryaa.co.in

Andhra Pradesh

చావడానికైనా సిద్ధమే..కానీ తల వంచేందుకు సిద్ధంగా లేను

– జగన్ సర్కారుపై పవన్ మాటల తూటాలు
– జనసంద్రమైన పవన్ సభ
– మత్స్యకార జి,ఓ చించి వేసిన పవన్ కళ్యాణ్

చావడానికైనా సిద్ధమే కానీ తల వంచేందుకు సిద్ధంగా లేనని పవన్ కళ్యాణ్ అన్న మాటలు కు యువత కేరింతలు కొట్టి పవన్ జేజేలంటూ నినాదాలు చేశారు. నరసాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవ్వాల్సిన సభ, కళ్యాణ్ 6 గంటలకు రావడంతో 4గంటలు ఆలస్యం అయింది. అయినప్పటికీ అభిమానులు కార్యకర్తలు పవన్ కోసం ఎదురు చూశారు.

మీ ముందు నేను ఉంటాను. ఈసారి ఓటు వేసి గెలిపించండి. రాష్ట్రాన్ని గోతులు, గొయ్యిల మయం చేసింది. వైసీపీ స్థానిక ఎన్నికల్లో మన వీరమహిళ విజయం సాధిస్తే ఆమెపై దాడులు చేశారు. వైసీపీ నాయకులు. మమ్మల్ని రెచ్చగొట్టాలని, భయపెట్టాలని చూడకండి.పదేపదే మా వాళ్లపై. అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తే ఏ స్థాయికైనా వచ్చి ఎదురునిలబడతాను అన్నారు. 60 నుండి 75 లక్షల జనాభా ఉన్న దాదాపు 38 కులాల ప్రజలు తీరప్రాంతాల్లో, 575 గ్రామాల్లో మత్స్యకారులుగా జీవిస్తున్నారు. వారి అందరి భవిష్యత్తు కోసం మేము వచ్చాం.

శ్రీకాకుళం జిల్లా కపాసకుద్ధి గ్రామంలో గంగమ్మ తల్లి పూజ చేసి పోరాట యాత్ర మొదలుపెట్టడానికి కారణం, గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి, మీకు అండగా నిలబడటానికి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి ఉంటే జీవో 217 తీసుకొచ్చేవారు కాదు. ఈరోజు దానిని చింపేస్తున్నాను. వైసీపీ వాళ్ళు
paban కేసులు పెడితే పెట్టుకోండి చూద్దాం. అంటూ అధికార పార్టీ కి సవాల్ విసిరారు.ఎంతో సాహసం చేసే గుంపు మత్స్యకారుల వర్గం. ఎంతో ధైర్యంగా సముద్రంలో వేటకు వెళతారు. ఆలాంటి సాహస వీరులకు నేను అండగా ఉంటాను.ఒక చిన్న నాటు పడవ వేసుకుని సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టుకునే మత్స్యకారుల పొట్ట కొట్టడానికి ఈ జీవో 217 తీసుకొచ్చారు.

బొమ్మిడి నాయకర్ లాంటి బలమైన వ్యక్తి, మత్స్యకార కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తి, ఓడిపోయినా సరే బలంగా ప్రజల మధ్యన ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే కూడా లేని మన జనసేన కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. అలాంటిది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతే లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు భీమా ఇవ్వలేకపోతుంది.151 ఎమ్మెల్యేలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం చికెన్ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోడానికా?

ఈ మాట మీరు ఎన్నికల ముందే చెప్పాల్సింది కదా.చికెన్, మటన్, చేపల కొట్లు, వ్యాపారాలు ప్రజలు చేసుకుంటారు. వైసీపీ ప్రభుత్వం వారికి అవసరమైన సహాయం చేయాలి. మత్స్యకారులకు జెట్టీలు నిర్మాణం, బోట్లు, వలలు కొనుక్కునేందుకు ఆర్థిక సహాయం చేయాలి.ప్రజలు ఉన్న కష్టాలనే తట్టుకోలేకపోతుంటే, ఇంకా కష్టాలు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించాలా? మీరేమైన రాచరికంలో ఉన్నారు అనుకుంటున్నారా.నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ అని చెప్పి 217 జీవో ప్రవేశపెట్టి ఇప్పుడు తీరప్రాంత జిల్లాలన్నింటిలో ప్రవేశపెడుతున్నారు, మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు.మేము జీవో 217 కు వ్యతిరేకంగా పోరాటం
pavan2 చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు పోరాటంలో భాగస్వామ్యం తీసుకోవాలి.ప్రజల కోసం పోరాటం చేసి జైల్లోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భయం లేదు. ఈరోజు ఇక్కడికి ఇంతమంది మత్స్యకార కుటుంబాలు వచ్చాయి అంటే వారి కష్టాలు తీరాలని, మేము పోరాటం చేస్తాం.

మీరంతా అండగా నిలబడి ఉండండి అని పవన్ కళ్యాణ్ అన్నారు. . తప్పుడు చట్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరూ మాట్లాడరు. మాట్లాడకపోతే సమస్యలు ఎలా తీరుతాయి.జెట్టీలు నిర్మిస్తాం అని చెప్పారు. ఇప్పటికితొలి దశ నిర్మాణాలు కూడా నామమాత్రపు పనులు మాత్రమే చేపట్టారు.దేహీ అనే పరిస్థితి లేకుండా మీ కాళ్ళమీద మీరు నిలబడేలా, మత్స్యకారులకు అండగా నిలబడేలా వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టో సమస్యలను పెట్టి పురస్కరించు కుందాము .మార్చ్ 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున కలుద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవిందరావు, రెడ్డి అప్పలనాయుడు, చేగొండి సూర్యప్రకాష్, మేక ఈశ్వరరావు, గాదె వెంకటరెడ్డి,బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. చాగంటి మురళీకృష్ణ, వాతాడి కనకరాజు, కల్వకొలను తులసి రావు, తిరుమణి సీతామహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE