లోక్ సభకు పవన్?

– కాకినాడ లేదా బందరు నుంచి పోటీ?
– బందరులోనే గెలుపు ఖాయమంటున్న జనసైనికులు
– అసెంబ్లీకీ పోటీ?
– పిఠాపురంలో పోటీపై మొగ్గు?
-పవన్ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్న నాగబాబు
– అసెంబ్లీని ఎంచుకొంటే డిప్యూటీ సీఎం
-ద్విముఖ వ్యూహాలతో పవన్ అడుగులు
( మార్తి నుబ్రహ్మణ్యం)

జనసేన దళపతి పవన్ కల్యాణ్ లోక్సభకు బరిలో దిగుతున్నారా? చేస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?… మళ్లీ అసెంబ్లీ స్థానానికీ పోటీ చేస్తారా? అసెంబ్లీ అయితే ఎక్కడ నుంచి చేస్తారు?.. ఇవీ జనసైనికులను ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నలు.

వచ్చే ఎన్నికల్లో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పోటీపై ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగా ఆయన, ఈసారి ఎక్కడా బయటపడటకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దానితో పవన్ పోటీపై న హజంగానే జనసైనికులలో ఉత్కంఠ నెలకొంది. అయితే విశ్వననీయ వర్గాల నమాచారం ప్రకారం పవన్ అటు లోక్సభ, ఇటు శానననభ స్థానాలకు పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఆ ప్రకారంగా కాకినాడ, బందరు స్థానాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల నమాచారం. రెండు నియోజకవర్గాల్లో కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ, బందరు లోక్సభ స్థానం పవన్కు నురక్షితమని పార్టీ నేతలు  చెబుతున్నారు. అవనిగడ్డ, బందరు, పెడన నియోజకవర్గాల్లో కాపుల సంఖ్యాబలం ఎక్కువ అని గుర్తు చేస్తున్నారు. పైగా పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డలో టీడీపీకి బలం ఎక్కువ. పెనమలూరు, గన్నవరంలో కమ్మ సామాజికవర్గ నంఖ్యాబలం ఎక్కువ.

గౌడ వర్గం టీడీపీకి దన్నుగా ఉంటుంది. కమ్మ-కావుతోపాటు బీసీ ఓటు బ్యాంకుతో పవన్ అవలీలలగా విజయం సాధిస్తారని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవన్ ను ఓడించి మోనం చేశారని జనసైనికులు గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్కు బందరు ఎంపీ సీటు సురక్షితమని జనసైనికులు విశ్లేషిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ బాలశౌరి పార్టీలో చేరినందున, ఆయనకే ఆ సీటు ఇస్తారన్న ప్రచారం లేకపోలేదు. ఒకవేళ పవన్ బందరు ఎంపీకి పోటీ చేస్తే బాలశౌరి, లేదా ఆయన కుటుంబానికి అవనిగడ్డ అసెంబ్లీ ఇవ్వడం నముచితమని సూచిస్తున్నారు.

ఇటీవల పవన్ సోదరుడు నాగబాబు మాట్లాడుతూ, పవన్ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారని వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. ఆవిధంగా ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ మిత్రపక్షం కోటాలో కేంద్రమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. మరోవైపు కాపుల నంఖ్యాబలం ఎక్కువగా ఉన్న పిఠాపురం అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేసేందుకు, పవన్ సిద్ధమవుతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

కాకినాడలో కూడా కాపుల సంఖ్యాబలం ఎక్కువే అయినప్పటికీ, బందరుతో పోలిస్తే అంత సురక్షిత స్థానం కాదంటున్నారు. పిఠాపురం, కాకినాడ రూరల్, జగ్గంపేటలో కాపుల సంఖ్యాబలం ఎక్కువ. మిగిలిన నియోజకర్గాల్లో బీసీ ల ప్రభావం ఎక్కువ అని గుర్తు చేస్తున్నారు. కాగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి.. పవన్ వ్యూహాత్మకంగా ఎంపీ-ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Leave a Reply