Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ తీర్పులోనే హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్లో చూపినన్ని తప్పులు ఎత్తిచూపింది

• నేడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఐడీకి.. వైసీపీ ప్రభుత్వానికి..పదే పదే మీడియా ముందు చంద్రబాబు తప్పుచేశాడనే చౌకబారు ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు అనే చెప్పాలి.
• చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం సిగ్గున్నా సీఐడీ…రాష్ట్రప్రభుత్వం అవమానంతో తలదించుకోవాలి.
• కళ్లకు ఏది కనిపిస్తే అది.. ఊహకు ఏమి తోస్తే దాన్ని కేసులో పేర్కొంటారా?
• ఈ ప్రభుత్వం.. సీఐడీ స్కిల్ కేసులో తొలినుంచీ చెబుతున్న తప్పు జరిగిందని చెబుతున్న అన్ని అంశాలను న్యాయస్థానం ఆధారాలు లేనివిగా కొట్టిపారేసింది.
• ఇంతమంది సాక్షుల్ని విచారించినా.. ఇన్నివేల డాక్యుమెంట్స్ సేకరించినా.. ప్రాథమికంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు రూపాయి నష్టం జరిగిందని చెప్పే ఒక్కఆధారం కూడా చూపలేకపోయారు… నిర్ధారించలేకపోయారని న్యాయస్థానం తేల్చింది
– పీ.ఏ.సీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబునాయుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ అనేక వ్యాఖ్యలు చేసిందని, వైసీపీ ప్రభుత్వం, సీఐడీ విభాగాలు పూర్తిగా దురుద్దేశంతో, రాజకీయ కక్షసాధింపులతోనే టీడీపీ అధినేతపై తప్పుడు కేసు పెట్టాయనే వాదనకు న్యాయస్థానం వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయని టీడీపీశాసనసభ్యులు, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు. తన నివాసం నుంచి జూమ్ ద్వారా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ ఎవరో ఒకవ్యక్తికి ఇచ్చాము… దానిలో ఏవో తప్పులు కనిపించాయని జగన్ రెడ్డి సర్కార్ , సీఐడీ ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చాయి. అటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ అనేదే ‘Is Not Agreed Upon’, ‘Cannot be Relied Upon’ అనే భావం వచ్చేలా న్యాయస్థానం స్పష్టంగా అభిప్రాయపడింది. అలానే ఈ కేసులో ఎక్కడా డబ్బు ఇచ్చినట్టు.. మనీ ట్రయల్ జరిగినట్టు కూడా ఆధారాలు లేవని చెప్పింది. ఈ ప్రభుత్వం తప్పని చెప్పిన ‘ఇన్ కైండ్ గ్రాంట్’ ప్రస్తావన కూడా ఎక్కడా న్యాయ స్థానం చేయలేదు. ఒక విధానాన్ని ఏరకంగా తప్పుగా చూపి.. అనేక తప్పులు చేసే ప్రయత్నం చేశారో, అవి ఏవీ కూడా న్యాయస్థానాన్ని నమ్మించలేకపోయా యి.

మేం తొలినుంచీ ఏదైతే చెప్పామో.. ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదు.. రూపాయి పక్కకు పోలేదు.. ఎలాంటి ఆధారాల్లేవు.. అక్రమంగా తప్పుడు కేసు పెట్టారు..అని చెప్పామో, అవే వాదనల్ని కోర్టుతీర్పు దాదాపుగా అంగీకరించింది. ఇప్పుడు కేవలం బెయిల్ పిటిషన్ పై మాత్రమే హైకోర్టు తీర్పుఇచ్చింది.. ఫైనల్ జడ్జిమెంట్ కాదు. కానీ ఇప్పటికే న్యాయస్థానం చేసిన కామెంట్స్ చూస్తే.. ఈ కేసు లోఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా తేల్చింది.

ఎక్కడో ఎవరో ట్యాక్స్ చెల్లింపులు చేయకపోతే.. దానికి రాష్ట్రప్రభుత్వానికి ఏం సంబంధమని కోర్టు ప్రశ్నించింది కదా!
తొలుత ఈ కేసులో రూ.3వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు..తరువాత రూ.300 కోట్లు అన్నారు… అనంతరం రూ.27 కోట్లన్నారు.. చివరకు రూ.14, 15 కోట్లు ఎక్కడో పక్కకు పోయాయన్నారు. ప్రభుత్వాన్ని దాటి.. కార్పొరేషన్ ను దాటి.. టెక్నలాజికల్ పార్టనర్ని దాటి.. వెండర్ని దాటి.. ఎక్కడో ఎవరో ఒకరు ట్యాక్స్ చెల్లింపులు చేయలేదు. దాన్ని ఎవరూ కాదనలేదుగా! ఆనాడే టీడీపీ ప్రభుత్వం దానిపై విచారించి, ఎక్కడో ట్యాక్స్ చెల్లింపులు జరక్కపోతే.. దానికి రాష్ట్రప్రభుత్వా నికి సంబంధం లేదని చెప్పింది కదా ! కనీసం ఈ విషయాన్ని ఏ అధికారి ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లింది కూడా లేదు. కానీ కేసు మొదటినుంచీ చివరివరకు ముఖ్యమంత్రి కార్యాలయమే నడిపినట్టు మాట్లాడారు.

ఎన్నిచోట్ల ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు చెప్పినా, చివరకు న్యాయస్థానాల ముందు ఆధారాలు ఉంచాలి కదా!
ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ నిర్ధారించింది.. పూణేలో ఆడిట్ చేసిన వారు నిర్ధారిం చారు..తప్పు జరిగిపోయిందని ఈడీ చెప్పింది అన్నారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి పదేపదే ఒక అసత్యాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం సీఐడీ చీఫ్ సంజయ్.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేశారు. అసలు ఈ కేసులో ఇన్ కంటాక్స్ నోటీసులే ఇవ్వలేదని మేం మొదట్నుంచీ చెబుతున్నాం.

ఇప్పుడు న్యాయస్థా నం ఏం చెప్పింది.. “మీరు ఏవైతే మాటలు చెప్పారో.. వాటికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి చూపలేకపోయారు” అని సీఐడీ అధికారుల్ని.. ప్రభుత్వ పెద్దల్ని, సుధాకర్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టినట్టు తీర్పు చెప్పలేదా? విజయవాడలో ఒక ప్రెస్ మీట్.. హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్.. ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ ఎన్నిచోట్ల ఎన్నిపెట్టి బురదజల్లినా.. న్యాయస్థానాల ముందు ఆధారాలు ఉంచాలి కదా! అసలు ఆధారాలు ఉంటే కదా చూపడానికి?

టీడీపీకి వచ్చిన సభ్యత్వాల రుసుము.. టీడీపీ అకౌంట్స్ లోకి డబ్బులు వచ్చాయనడంపై..
రూ.3వేలకోట్లు.. రూ.300 కోట్లు అని చివరకు తెలుగుదేశం కార్యకర్తలు ఆ పార్టీకి ఇచ్చిన విరాళాలసొమ్ము.. సభ్యత్వాలు పొందడానికి చెల్లించిన రుసుముని అవినీ తి సొమ్ముగా చూపే ప్రయత్నం చేసి భంగపడ్డారు. దానిపై కోర్టు ఈరోజు ఏమన్నది.. “తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి ఈ డబ్బులు వచ్చాయి అని సూత్రప్రాయంగా.. ప్రాథమికంగా కూడా ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ చూపలేకపోయారు” అంది. అంతటితో ఆగకుండా ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు, “సబ్ స్టాన్షియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి, తరువాత మాత్రమే రిమాండ్ కు పంపాలి” అన్నది. అంటే చంద్రబాబుని రిమాండ్ కు పంపడం కూడా తప్పే అనే భావన నేడు న్యాయస్థానమిచ్చిన జడ్జిమెంట్లో వ్యక్తమవుతోంది. కేసు విచారణలో కూడా గ్యాప్ ఉందని న్యాయస్థానం వ్యాఖ్యల్లో స్పష్టమైంది.

క్యాష్ విత్ డ్రా చేశారు.. చంద్రబాబుకి ముట్టింది అనే ఆరోపణలపై..
పదేపదే క్యాష్ విత్ డ్రా చేశారు… చంద్రబాబుకి ముట్టింది అన్నారు. దానికి సంబంధించిన ఒక్కఆధారాన్ని కూడా సీఐడీ న్యాయస్థానం ముందు ఉంచలేదు. అసలు క్యాష్ విత్ డ్రా చేశారనే దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాన్ని కోర్టు ముందు ఉంచలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. పిటిషన్ వేసినప్పటి నుంచీ చంద్రబాబుని జైల్లో ఉంచే వరకు ఆయనకు ఈ విధంగా లబ్ది కలిగిందని నిరూపించే సరైన సాక్ష్యాలు..ఆధారాలు చూపలేకపోయారని కూడా న్యాయస్థానం చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందే ఇతర నిందితులు బెయిల్ కు దరఖాస్తు చేసినప్పుడు.. వారికి బెయిల్ మంజూరైనప్పుడు, ఏ రకంగానూ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నష్టం జరిగిందనే దానికి సంబంధించిన ఆధారాలు చూపలేకపోయారని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఐఏఎస్ అధికారి సునీత నోట్ ఫైల్లో రాసిన రాతలపై..
ఐఏఎస్ అధికారి సునీత కామెంట్స్ పై.. ఇంతకు ముందే వాస్తవంలో ఏం జరిగిం దో చెప్పాం. అసలు ఆమె ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైల్ చదవకుండానే కామెంట్స్ రాసిందని చెప్పాం. తరువాత ఆమె కిందిస్థాయి అధికారి ఎవరో వాస్త వాలు చెబితే.. అప్పుడు ‘సీన్ ది ఓల్డ్ రికార్డ్స్’ అని రాసింది. తరువాత స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలకు అందిస్తున్న సాఫ్ట్ వేర్.ఇతర మెటీరియల్ కొత్త దో పాతదో సరిచూసుకోండని ఫైల్ లో తన అభిప్రాయంగా రాసింది.

ఎప్పుడైతే గుజరాత్ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకోసం తమరాష్ట్రంలో ఏక మొత్తంగా ఒకేసారి డబ్బులు విడుదలచేసిందని చెప్పారో, అప్పుడే ఆనాడున్న ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ ఆమెను..స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సెక్రట రీని.. టెక్నాలజీ పార్టనర్స్ తో మీటింగ్ పెట్టి, ఒకటిన్నర పేజీ నోట్ రాశాడు. అది చూశాక అధికారి సునీత ఒప్పుకుంది. అదే విషయం నేడు కోర్టు కూడా చెప్పింది. గుజరాత్ వెళ్లివచ్చాక ఆమె ఎక్కడా ఏమీ రాసినట్టు లేదే అని చెప్పింది.

గతంలో నేను మీడియాతో మాట్లాడిన అంశాల్ని కూడా తప్పుపడుతూ.. అధికారుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నానని న్యాయస్థానంలో చెప్పారు నేడు న్యాయస్థానం కూడా అదే విషయాలు చెప్పింది
గతంలో నేను మీడియాతో ఇదే అంశాలపై మాట్లాడితే… ఆనాడు సీఐడీ చీఫ్ సంజయ్.. సజ్జల రామకృష్ణారెడ్డి.. నా వ్యాఖ్యల్ని తప్పుపట్టి… మీడియాలో నా పేరుతో వచ్చిన వార్తల్ని పొందుపరుస్తూ, పయ్యావుల కేశవ్ ఈ రకమైన సమాచారమిస్తూ అధికారుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. మరి ఈనాడు నేను చెప్పినదానితో కోర్టు ఏకీభవించింది. మరిప్పుడు సీఐడీ చీఫ్ …ప్రభుత్వ సలహాదారు ఇంకా తమచర్యల్ని సమర్థించుకుంటారా? ఎక్కడో ఎవరో కొద్దిపాటి జీఎస్టీ చెల్లింపులు చేయలేదని దాన్ని పట్టుకొని ఇంత దూరం లాక్కొచ్చారు. జీఎస్టీ చెల్లింపుల్లో తప్పు జరిగిందని నేటికీ నిర్ధారింపపడలే దు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు రొటీన్ గా పెట్టే సంతకాలపై ఎంత రాద్ధాంతం చేశారు?

చివరకు కోర్టు చంద్రబాబు సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే ప్రభుత్వ న్యాయవాది వాదనను కూడా కొట్టిపారేసింది. రిమాండ్ కు అడిగే ముందే సరైన ఆధారాలు సేకరించాల్సిందన్న న్యాయస్థానం వ్యాఖ్యలపై బుద్ధిఉన్నవారు ఎవరైనా తప్పు చేశామని ఒప్పుకుంటారు. కేవలం బెయిల్ ఆర్డర్ లోనే హైకోర్టు ఇన్ని రిమార్క్స్ ఎత్తిచూపిందంటే, ముందు అధికారుల్ని శిక్షించండి అనే స్థాయిలో ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుందనే నమ్మకం మాకుంది. ఇకనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పద్ధతి మార్చుకుంటే మంచిది.

విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా.. పయ్యావుల స్పందన
ఫైనల్ తీర్పు వచ్చినంత స్పష్టంగా నేడు న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 30 రోజులు జైల్లో పెట్టాక కూడా మీరు ఆధారాలు చూపలేకపోయారు అన్నది. ఇన్ కంటాక్స్ నోటీసులు అన్నారు.. దానికి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. క్యాస్ విత్ డ్రా చేశారు.. చంద్రబాబుకు డబ్బుముట్టిందనే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని చెప్పింది. ఇంత స్పష్టంగా కోర్టు చెప్పాక మరలా ఇంకెప్పుడు ఆధారాలు చూపిస్తారు?

మేం ముందు అరెస్ట్ చేస్తాం..తరువాత ఆధారాలు సేకరిస్తామనే కొత్త ఒరవడి ప్రారంభి చారు. ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్ లో ఏ రాజకీయనాయకుడు..ఏ వ్యక్తిని అయినా ఎలాగైనా అరెస్ట్ చేయవచ్చు. ఈ ప్రభుత్వం ఈ కేసులో అవలంభించిన విధానం చూశాక ..న్యాయస్థానం తీర్పు చూశాక సిగ్గున్నవారు అయితే కచ్చితం గా తలదించుకోవాలి. సిగ్గులేనివారే మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు.

చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆధారాలు మా వద్ద ఉన్నాయి..కోర్టులకు ఇవ్వడం మర్చిపోయామని సజ్జల చెబుతాడా?
సజ్జల చెప్పినట్టు మేం దీపావళి సంబరాలు చేసుకోవడం లేదు. నరకాసుర వధ ప్రారంభం కాబోతుందని సంబరాలు చేసుకోబోతున్నాం. ఆధారాలు మా వద్ద ఉన్నాయి.. అవి కోర్టు ముందు పెట్టడం మరిచిపోయామని సజ్జల చెబుతాడా? సునీత రాసిన నోట్…దానికి సంబంధించిన ఫైల్ దొరకలేదని సజ్జల చెప్పడం పచ్చి అబద్ధం. ఫైల్ ప్రభుత్వం వద్దే ఉంది.. కేవలం చేసిన తప్పుని కప్పిపుచ్చుకో వడానికే ఇప్పటికీ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతమంది సాక్షుల్ని విచారించినా.. ఇన్నివేల డాక్యుమెంట్స్ మీరు సేకరించినా.. ప్రాథమికంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నష్టం జరిగిందని చెప్పే ఒక్కఆధారం కూడా చూపలేకపోయారు… నిర్ధారించలేకపోయా రు అని కోర్టు చాలా స్పష్టంగా తీర్పులో అభిప్రాయపడింది.” అని పయ్యావుల పేర్కొన్నారు.

LEAVE A RESPONSE