Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు

-భూ కేటాయింపులు పూర్తి పారదర్శకమని ఏసీబీ కోర్టు- హైకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చాయి
– నిబంధనలకు లోబడే కేబినెట్ రెజ్యులేషన్ ద్వారా ఐఎంజీకి భూ కేటాయింపులు చేశారని హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైకాపా నాయకులకు ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు అవినీతిపరుడిగా భారీ కుంభకోణాలకు పాల్పడ్డాడని నమ్మించే కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రూ.6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని పుస్తకాలు వేసి ప్రచారం చేసిన ప్రబుద్దులు ఐదేళ్లుగా ఆరు పైసలు కూడా నిరూపించలేక చేతులెత్తేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, రింగురోడ్డు స్కాంలు అంటూ దుష్ప్రచారం చేశారు. కోర్టులతో చీవాట్లు తిన్నా.. ప్రజాకోర్టులో ఛీత్కారాలు ఎదుర్కొన్నా.. దుష్ప్రచారం మాత్రం ఆపడం లేదు. చంద్రబాబు నాయుడిపై వైకాపా వారు చేసిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని, అవి కేవలం బురద చల్లే కార్యాక్రమాలేనని ప్రజలు అర్ధం చేసుకున్నారు.

జగన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడని, రాబోయే ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు గద్దె దించబోతున్నారనే చంద్రబాబు నాయుడికి ఏదో ఒక రకంగా అవినీతి మరకలు అట్టించాలని వైకాపా నాయకులు తహతహలాడుతున్నారు. ప్రజలు, కోర్టులు వాస్తవాలను బయటపెడుతున్నా బుద్ది తెచ్చుకోకుండా వారు చంద్రబాబు నాయుడిపై నిరంతరాయంగా అవినీతి ఆరోపణలు చేయడం నీచం.

నేడు తాజాగా ఎప్పుడో 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌళిక సదుపాయాలు మెరుగపరచాలనే సదుద్దేశంతో నిబంధనలకు లోబడి ఐఎంజీతో చేసుకున్న ఒప్పందాన్ని తప్పుపడుతూ ఆరోపణలు చేయడం మొదలెట్టారు. నాడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిపై వేసిన తప్పుడు పిటీషన్లలో కోర్టు మొటిక్కాయలు వేయించుకున్నారు. క్రీడలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వారి సహకారంతో మన దేశంలోని ఐఎంజీ అకాడమీస్ భారత ప్రై.లి వారితో ఒప్పందం చేసుకుని హైదరాబాద్ చుట్టు ప్రక్కల భూములు కేటాయించడం జరిగింది.

కేటాయించిన భూముల్లో స్టేడియంలు, స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లు..ఇలా క్రీడల మౌళిక సదుపాయాలను ఐఎంజీ భారత అకాడమీస్ ప్రై.లి వారు ఏర్పాటు చేసే విధంగా ఒప్పందంలో పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం చేసి ఐఎంజీ భారత్ వారు రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం చేసుకుని భూములు కేటాయించారు. తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి దీని వెనుక ఏదో పెద్ద కుంభకోణం జరిగిపోయిందంటూ పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో హైకోర్టులో పిటీషన్లు చేయించాడు.

రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డిగారు వేసిన పిటీషన్ ను స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అండ్ యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ వారు) సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్ వారు పిటీషన్‌ను డిస్మిస్ చేయడం జరిగింది. పిటీషన్ దాఖలు చేసిన వారు చెబుతున్నట్లు ఇందులో ఎటువంటి కుంభకోణం జరగలేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు సుస్పష్టం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లిగా ఏప్రిల్ 26, 2006 లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి పి. స్వరూప్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పులో అనేక అంశాలను అందులో పొందుపరిచారు.

భూ కేటాయింపుల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని తీర్పు చెబుతుంటే తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి, వైకాపా నాయకులు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఐఎంజీ భారత్‌తో చేసుకున్న ఒప్పందంలో లక్ష కోట్లు కుంభకోణం జరిగిపోయిందంటూ బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ ఎంతో విజయవంతగా నిర్వహించి నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయితో చంద్రబాబు నాయుడు శభాష్ అనిపించుకుంటే నేడు ఆయనపై బురద చల్లుతారా? నాడు చంద్రబాబు నాయుడు జాతీయ క్రీడలను సైతం హైదరాబాద్‌లో ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తే ఆయనను శంకిస్తారా?. దేశానికి పేరుప్రతిష్టలు తీసుకొచ్చిన నేతపై ఇష్టమెచ్చినట్లు మాట్లాడుతారా?

నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, గచ్చిబౌలీ స్టేడియం లాంటి అనేక స్టేడియంలు చంద్రబాబు నాయుడు నిర్మించారు. ఏనాటికైనా భారతదేశంలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించాలని, వాటి కోసం అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పనిచేయడం తప్పా?

రాష్ట్ర ప్రజలు వైకాపా కుట్రలను అర్ధం చేసుకోవాలి.గౌరవ హైకోర్టు న్యాయమూర్తి పి.స్వరూప్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. పేజీ.నం. 15, పేరా 16 లో.. తేది. 09.02.2004న జీవోఎంఎస్ 11 లో ఇలా పేర్కొన్నారు..’Several responsibilities are on the company which including the company to build up the sports academies, life style and entertainment centres of international class, and similar to the once operated by them in United States of America. అని స్పష్టంగా పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఐఎంజీ వారు అమెరికాలో నిర్వహిస్తున్న కార్యకలాపాల మాదిరి రాష్ట్రంలో అటువంటి క్రీడా మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. స్పోర్ట్స్ అకాడమీలు, లైఫ్ స్టైల్‌ఎంటర్ టైన్‌మెంట్ సెంటర్లు నిర్మించాలని చెప్పారు. అంతేకాకుండా, The company has to spent Rs.500 crores in Phase 1, Rs.200 Crores in Phase 2 అని మొత్తంగా రూ.700 కోట్లు కంపెనీ వారు ఖర్చు చేయాలంటూ నిబంధనల్లో పొందుపర్చారని తీర్పులో సైతం జడ్జిగారు పేర్కొన్నారు.

క్రీడలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అమలులో ఉన్న నూతన టెక్నాలజీలతో క్రీడా శిక్షణా సదుపాయాలు ఏర్పాటు చేయాలని, కంపెనీ వారికి ఉన్న అంతర్జాతీయ సంబంధాలను ఉపయోగించి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు నిర్వహించాలని కూడా నిబంధనల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో క్రీడా సదుపాయాలు అభివృద్ది కోసం ప్రతీ ఏడాది రూ.5 కోట్ల నిధులు ఇచ్చేలా కూడా ఏర్పాటు చేశారు. ఐంఎంజీ వారికి ఇలాంటి అనేక షరతులు పెట్టి భూములు కేటాయించడం జరిగింది. ఇలాంటి షరతులు మనకు కళ్లెదురుగా కనబడుతున్నప్పుడు దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఏ విధంగా అనగలమని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.

ప్రభుత్వాలు ఎటువంటి షరతులు పెట్టకుండా సంస్థలకు భూములు ఇచ్చేస్తున్న సంధర్బాలలో ఈ ప్రభుత్వం ఐఎంజీ వారిపై షరతులు పెట్టి భూములు కేటాయించి, క్రీడా మౌళిక సదుపాయాల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేయాలని నిబంధనలు పెడితే దీన్ని ఏ విధంగా తప్పుపట్టగలం అని తీర్పులో చెప్పారు. తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ తీర్పులోని అంశాలపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలడా? ఆనాటి చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్లీన్‌ఛిట్ ఇస్తే…చంద్రబాబు నాయుడుపై బురద చల్లేందుకు వైకాపా నాయకులకు సిగ్గుందా? ప్రభుత్వాలు అభివృద్ది కోసం, ఆర్ధిక కార్యకలాపాల పరిపుష్టికోసం భూ కేటాయింపులు చేస్తే వాటిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా హైకోర్టు తీర్పు చెబుతుంటే వైకాపా వారు నిస్పిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

ఐఎంజీ ప్లోరిడా వారితో ఐఎంజీ భారత వారికి ఎటువంటి సంబంధం లేదంటూ వైకాపా నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఐఎంజీ వారు ఐఎంజీ భారత తమ అనుబంధ సంస్థ అని నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి స్వయంగా వచ్చి చెబుతామని వారిచ్చిన పత్రికా ప్రకటన సైతం ఉంది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏ ప్రాజెక్టునైతే రద్దు చేస్తాం అన్నారో ఆ ప్రాజెక్ట్ మాకు సంబంధించిందని ఐఎంజీ ప్లోరిడా వారు చెప్పారు.

అమెరికాలో ఉన్నటువంటి మా ఐఎంజీ ఫ్లోరిడా సహకారంతో హైదరాబాద్ ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని స్పష్టంగా ఐఎంజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టెడ్ మీక్మా, ఐఎంజీ ఈస్ట్ చైర్మన్ ఆండ్రూ క్రీగర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా వాటన్నింటిని దాచిపెడుతూ.. ఇన్ని పచ్చి అబద్దాలు చెప్పటానికి సిగ్గుండాలి. ఐఎంజీ ప్లోరిడా వారు ఇచ్చిన ఈ స్టెట్మెంట్‌ను తిరస్కరించగలవా సజ్జల రామకృష్ణరెడ్డి?

ఐఎంజీ ఫ్లోరిడా భాగస్వామంతో మన దేశంలో ఏర్పడినటువంటి ఐఎంజీ భారతా కంపెనీతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకున్నారని ఐఎంజీ ఫ్లోరిడా వారు ఇచ్చిన స్టేట్మెంటే సాక్ష్యం. మాకు సంబంధం లేదని ఐఎంజీ ఫ్లోరిడా వారు చెప్పలేదు. తరువాత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వారికి కేటాయించిన భూమిని దుర్మార్గంగా రద్దు చేశాడు. వారు అపాయింట్మెంట్ కోరినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

రాష్ట్రానికి మంచి చేసే కంపెనీలు వీళ్ళకు అవసరం లేదు. ఎంతసేపు వాన్ పిక్, లేపాక్షి, నాలెడ్జ్ హబ్‌లకు వేల ఎకరాలు దోచిపెట్టాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే సీబీఐ, ఈడీ కేసులు పెట్టింది. ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్న భూ కేటాయింపులన్నీ కూడా అవినీతి కుంభకోణాలే. సోలార్ పవర్ పార్క్స్, షిరిడీసాయి ఎలక్రికల్స్, అరబిందోలకు వేల ఎకరాలు కేటాయించి ఇష్టానుసారంగా దోచి పెట్టారు. ఇవి కదా అవినీతి కేటాయింపులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి.

ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలని మన బిడ్డలకి అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌళిక సదుపాయాలు కల్పించాలని, అంతర్జాతీయ స్పోర్ట్ ఈవెంట్స్‌లో పాల్గొని దేశ ప్రతిష్టను పెంపోందించాలని, ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో మెడల్స్ సాధించాలనే ఒక విజన్‌తో చంద్రబాబు భూ కేటాయింపులు చేశారు. ఆ నాటి ప్రభుత్వం గుడ్డిగా భూ కేటాంయింపులు చేయలేదు. ఇతర ప్రభుత్వాలు లాగా అడ్డగోలుగా భూ కేటాయించలేదు, అనేక నింబంధనలు పెట్టి, రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టాలనే అనేక నిబంధనలు ఒప్పందంలో చేర్చారని హైకోర్టే చెప్పింది.

ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. కేబినేట్ నిర్ణయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని పిల్‌ను హైకోర్డు జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు కొట్టేశారు.
మరలా ఇప్పుడు కొత్తగా రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చేసిందని.. అవినీతి రుజువైపోయిందని వైసీపీ వారు తెగ నోటు పారేసుకుంటున్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి భూ కేటాయింపులను రద్దు చేస్తే ఆ అంశంపై ఐఎంజీ భారత వారు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దాదాపు 15 ఏళ్ల తర్వాత గురువారం నాడు గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఐఎంజీ భారత భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. ఒక ప్రాజెక్టుకి భూ కేటాయింపులు చేసిన తర్వాత మరలా ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని మాత్రమే తీర్పు చెప్పారు. దీన్ని వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు చేసిన భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందంటూ తెలంగాణ హైకోర్టు చెప్పినట్లు నిరూపించగలరా? ఒకవేళ అవినీతే జరిగితే ఆ రోజు భూ కేటాయింపులు చేసిన ఐఏఎస్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గౌరవ తెలంగాణ హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. దానికి సమాధానం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలు.

సజ్జల రామకృష్ణరెడ్డికి నేను సవాల్ చేస్తున్నా. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తప్పుబట్టగలవా? ఈ కాపీలోని అంశాలు నిజం కాదని చెప్పే దమ్ము నీకు ఉందా నీకు సజ్జల? ఎప్పటిలాగానే నిరాధారణమైనవటువంటి ఆరోపణలు చేయడం, బురద జల్లడం మీకు మామూలే. ఎన్ని పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. సైకో పావాలి సైకిల్ రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు మాత్రమే గ్యారెంటీని, ష్యూరిటీని ఇవ్వగలరని ప్రజలు నమ్ముతున్నారు.

ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకొని తాడేపల్లి కొంపలో సామాన్లు సర్దుకోండి. మీకు టైం అయిపోయింది. మీకు మిగులుందే కేవలం నెల రోజులు మాత్రమే. మరో నెల రోజుల్లో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయబోతున్నారు. ఇక తట్టాబుట్టా సర్ధుకోండి.

LEAVE A RESPONSE