జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధం

-జగన్మోహన్ రెడ్డికి కౌంటన్ మొదలైంది ఇంకా మిగిలేదే 74 రోజులు మాత్రమే
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్

వైయస్సార్సీపి దురాగాతాల కు ప్రజా కోర్టులో శిక్ష పడే సమయం ఆసన్నమైంది. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతుంటే ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పెడన మాజి MLA, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, అరాచక పాలన కు స్వస్తి పలికేందుకు రైతులు యువత ప్రభుత్వ ఉద్యోగులు అంతా సిద్ధమయ్యారు.2024 ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సిపి జెండా కనుమరుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి గా నాశనం చేసిన వైకాపా పార్టీ ప్రజలకు అవసరం లేదు యుద్ధం మొదలైంది అందుకు టిడిపి, జనసేన సిద్దమయింది అని తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ లుఅన్ని పూర్తి చేస్తామని ఆయనఅన్నారు. ఈ వైయస్సార్సీపి ప్రభుత్వం కొత్త పన్నులు వేసి ధరలు పెంచి ప్రజల రక్తాన్ని జలగల పీలుస్తుందని వేదవ్యాస్ పేర్కొన్నారు.

Leave a Reply