హలో పులివెందుల.. బై బై వైసీపీ అంటున్న ప్రజలు

– పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అంత బోగస్
– పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి

ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో వైసీపీ నుంచి 15 కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం పులివెందుల నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసిన కూడా కనీస సౌకర్యాలు లేవు. పులివెందుల నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం అని మాయ మాటలు చెప్పి కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు తప్ప అభివృద్ధి చేయడం లేదు.

అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు పులివెందుల నియోజకవర్గనికి విడుదల చేశాం అంటారు గాని అభివృద్ధి మాత్రం జరగలేదు పాడా నిధులు దారి మళ్లినాయి ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన కూడా ఆయా గ్రామాల ప్రజలే చెప్పుతున్నారు సమస్యలు కనీస సౌకర్యాలు లేవని. ఇవ్వన్నీ చూసే, పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా వస్తున్నారు.

మమ్మల్ని మోసం చేసిన వైసీపీ పార్టీలో ఒక్క క్షణం ఉన్న కూడా వృథానే. మా ఓట్లతో గెలిచి మమ్మల్ని పట్టించుకోలేదు కనీస గౌరవం కూడా వైసీపీ లో లేదు అని పులివెందుల నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. రాబోయే రోజుల్లో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంది.

Leave a Reply