Suryaa.co.in

Telangana

బిజెపి పాలనలో ప్రజలకు మేలు జరగదు

– పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తున్న పాలకులు
– దోపిడీ హింస దౌర్జన్యాలు
– ఇవి పోవాలంటే సమాజంలో విప్లవం రావాల్సిన అవసరం ఉంది
– భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్

హైదరాబాద్: స్వాతంత్ర ఉద్యమ కాలంలో పోరాడి సాధించుకున్న హక్కులను నేటి పాలకులు హరిస్తున్నారని భగత్ సింగ్ మేనల్లుడు, ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూర్వ విప్లవ విద్యార్థులు 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం పై సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఈ దేశంలోని బి జె పి పాలనలో ప్రజలకు మేలు జరగదని. దోపిడీ హింస దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్నారు. ఇవి పోవాలంటే సమాజంలో విప్లవం రావాల్సిన అవసరం ఉందని, ఇవన్నీ దూరం కావాలంటే ఐక్య ఉద్యమాలు కూడా అవసరమన్నారు. 1920లో దేశంలో ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఉండేదో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని, నాడు భగత్ సింగ్ విప్లవోద్యమాలను నిర్మించి దేశాన్ని సమర్ధం చేశారన్నారు.

అలాగే రాడికల్ స్టూడెంట్స్ కూడా ఉద్యమాలు నిర్మించి ప్రజలను జాగ్రత్తగా చేశారన్నారు. . స్వతంత్ర ఉద్యమ కాలంలో పోరాడి సాధించుకున్న హక్కులను కూడా నేటి పాలకులు అరిస్తున్నారని, ప్రజల మౌలిక హక్కులకు కూడా కాలరాస్తున్నారన్నారు. . బ్రిడ్స్ పాలకులను ఎదిరించడానికి భారతదేశంలో గద్దర్ పార్టీ పుడితే నేడి సమాజాన్ని మార్పు కోసం రాడికల్ విద్యార్థులు పోరాడారాణి జగ్న్మోహన్ సింగ్ అన్నారు.

పాలకులు ఇప్పుడు నేరుగానే ప్రజలపై యుద్ధం చేస్తున్నారని అంటున్నారన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ కాలంలో మనుషులు మిగలడమే ఒక సవాలుగా మారిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో 70, 80ల కాలం నాటి విద్యార్థి పోరాటాలు సమాజానికి మార్గదర్శకం కావాలని అన్నారు.

విద్యార్థులందరికీ చైతన్య దీపికగా ఉన్నటువంటి వరవరరావు ఈరోజు జైలు నిబంధనలో ఉన్నారని ఆర్ ఎస్ యు ప్రారంభంలో ఒకరైన శివారెడ్డి అన్నారు. భారత విప్లవోద్యమంలో వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో నిర్మించిన పోరాటమే విప్లవానికి బాటగా నిలుస్తుంది అన్నారు. విప్లవోద్యమ విజయానికి విప్లవ విద్యార్థి ఉద్యమం అవసరమన్నారు. దానికోసమే రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడిందన్నారు.

ప్రపంచీకరణ తర్వాత జాతీయ రాజ్యాలు నశించిపోయాయని డాక్టర్ గోపీనాథ్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలన్నీ ప్రపంచ కాబూలీవాలాలనీ వ్యాఖ్యానించారు. 780ల కాలంలో విద్యార్థులు ఉద్యమాల్లోకి వచ్చేవాళ్ళు నేడు ఆ పరిస్థితి లేదు అన్నారు. హాస్యం ఒకటే అయినప్పుడు పార్టీలన్నీ ఏకం కావాలని అన్నారు. సమాజ మార్పు కోసం కోరే వాళ్లంతా ఏకతాటి పైకి రావాలని అన్నారు. 70 ఏళ్ల కాలంలో విశ్వవిద్యాలయాలన్నీ విప్లవ కేంద్రాలుగా ఉన్నాయని ఒకప్పటి పిడిఎస్ యు నాయకుడు ప్రదీప్ అన్నారు. ఇప్పుడు విద్యార్థులు ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. అన్ని విలువలపై ముప్పేట దాడి జరుగుతున్న సందర్భంలో అందరూ ఐక్యంగా ఉద్యమాలు నిర్మించి ఫాసిజాన్ని ఓడించాలన్నారు.

70, 80 కాలం నాటి విద్యార్థి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వాటిని ముందుకు తీసుకుపోవాలని సూరపనేని జనార్ధన్ సోదరుడు మోహన్ రావు అన్నారు.

ఆర్ఎస్ యు విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే నేను మాక్సిజాన్ని చదువుకున్నానని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే అన్నారు. 80వ దశకంలో తరగతి గదిలో విద్యార్థులకు ప్రొఫెసర్లకు మధ్య చర్చ జరిగేదని ఇప్పుడు అలాంటి వాతావరణం లేదని అన్నారు. నాటి విద్యార్థులు విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు నిరంతరం కృషి చేసేవారు అన్నారు. నేడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదన్నారు. విలువలు మృగ్యమైన ప్రస్తుత సమాజంలో మానవీయ విలువలను నిలబెట్టడమే ఎలా అనేది మన ముందున్న ప్రశ్న అని అన్నారు.

LEAVE A RESPONSE