Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆగ్రహం

– భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భాజపా విజయసంకల్ప పాదయాత్ర 6వ రోజు అరండల్ పేటలో ప్రారంభమై, బ్రాడీపేట 3వ మండలంలోకి ప్రవేశించింది. ముఖ్య అతిథిలుగా పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు పూర్తి స్థాయిలో ఆసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందిస్తున్న సహకారానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించే విజయసంకల్ప పాదయాత్రకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లిన ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రాభివృద్ధి కాకుండా స్వంత లాభాపేక్ష కోరుకునే వైకాపా పీడను విడిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఈప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా భాజపాను ఆధరించాలని కోరారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర ప్రజలు ఎంతో అగ్రహంగా ఉన్నారు.

గుంటూరుకు గుండెకాయ లాంటి అరండల్ పేట, బ్రాడీపేట అభివృద్ధికి అధికార వైకాపా ముందుకు రాకపోవటం సిగ్గుచేటన్నారు. గుంటూరులో ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధి లేక విలవిలలాడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా బ్రాడీపేట ప్రాంతాన్ని ఆంధ్రా ఎడ్యుకేషన్ హబ్ గా కీర్తిస్తారని, కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం అభివృద్ధి లేక మరుగునపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైన నిర్మాణ పనులు చేసే ముందు రోడ్డుకు ఇరువైపుల ఎక్కడ నిర్మాణాలు జరగవని, కానీ బ్రాడీపేట 4వలైనులో రోడ్డుకు రెండు వైపుల రోడ్డును చిద్రం చేసి కేవలం ఒక వాహనం వెళ్లే స్థితికి తీసుకువచ్చారని ఆగ్రహించారు. 4వ లైనులో ప్రయాణం సాగించాలంటే ప్రజలకు నరకంగా మారిందన్నారు.

తొలుత మురుగు కాల్వలని, తర్వాత రహదారి మరమ్మతులని వైకాపా నాయకులు దబ్బు దండుకొనేందుకు ఒకే పనిని పలుమార్లు చేసి ప్రజా ధనాన్ని వృదా చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ గుంటూరు నగరాభివృద్ధికి వందల కోట్లు సాయం చేస్తే కనీసం నగరంలో రహదారుల మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో వైకాపా ఉండటం సిగ్గుచేటన్నారు. ఇదే ప్రభుత్వ మరో సారి అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలకు చిప్ప పట్టుకోని పొరుగురాష్ట్రాలకు వలస పోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందన్నారు.

గత ఐదు రోజులుగా భాజపా ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తూ పేరుకుపోయిన చెత్తను తొలగించాలని నిరసన వ్యక్తం చేయగా నగర పాలక సంస్థ పాలకవర్గంలో వణుకు పుట్టి, భాజపా చేస్తున్న ఆరోపణలకు భయపడి హుటహుటీన చెత్తను తొలగిస్తున్నారని ఆగ్రహించారు. పారిశుధ్యం గురించి భాజపానో, మరో పార్టీనో సమస్యల ప్రస్థావవ తీసుకురాకముందే నగరాన్ని సుందరీకరణంగా ఉంచాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులపై ఉందన్నారు. భాజపా నిరంతరం ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల కోసం పనిచేస్తుందని తెలిపారు.

ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, పాలపాటి రవికుమార్, ప్రధాన కార్యదర్సులు కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా 3వ మండల నాయకులు అన్నా బాల రంగయ్య స్టాలిన్, అనుపమ, పెద్దింటి కృష్ణ చైతన్య, పాండురంగ విఠల్, జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రి సుగుణ, బజరంగ్ రామకృష్ణ, రమాదేవి, గూడూరు రాంబాబు, జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాస్, మహిళామోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి యాదవ్, మండల నాయకులు రత్నాకరం, కిరణ్ కుమార్, చింతపల్లి వెంకట్, ఆవుల రాము, కత్తి మేరీ సరోజిని, అప్పిశెట్టి రంగారావు, ఏడుకొండలు గౌడ్, శ్రీకల్యాణి, గోర్ల నాగమల్లేశ్వరి, జితేంద్రగుప్త, కారంశెట్టి సత్యం, యమ్మాజీ హనుమంతరావు, దేసు సత్యనారాయణ, తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

LEAVE A RESPONSE