Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల రక్తం పీల్చి… సంక్షోభ రాష్ట్రంగా మార్చి..

– జగన్ పాలన పట్ల ప్రజల ఆవేదన
– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
– పారిపోయేందుకు జగనే సిద్ధంగా ఉన్నాడు : ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ

రాజమహేంద్రవరం : పన్నుల బాదుడుతో రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తూ, మాయమాటలు చెప్తున్న సీఎం జగన్‌ వల్ల ఏపీ సంక్షోభ రాష్ట్రంగా మారిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ మండిపడ్డారు.

స్థానిక 10వ డివిజన్‌లో టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ ఆధ్వర్యంలో చొప్పేళ్ల వీరభద్రరావు, ఎలక్ట్రికల్ సత్యనారాయణ పర్యవేక్షణలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్‌లోని ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోతో పాటు జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లు రద్దు చేసి, పండుగ కానుకలు, చంద్రన్న బీమావంటి పెళ్లి కానుకలు, పీజు రీయంబర్స్‌మెంట్‌, రైతులకు సబ్సిడీ రుణాలు, దళిత, బీసీ, ఎస్సీల సంక్షేమ పథకాలు వందకు పైగా పథకాలు రద్దు చేశారన్నారు. జగన్‌ను రాష్ట్ర ప్రజలు రెండు నెలల్లో ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా తిరుగుబాటు తప్పదని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని, అందుకు హ్యాపీగా దిగిపోతా అంటూ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.

2019 నుంచి జగన్‌ రూపంలో రాష్ట్రానికి శని దాపురించిందని, రాష్ట్రం అన్ని రకాలుగా నాశనమైపోయిందన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే చంద్రన్న మళ్లీ సీఎం కావాలన్నారు. చంద్రబాబు పాలనకు, ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని ప్రజలను కోరారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపిస్తామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అత్యుత్సాహం కారణంగా చేడుతున్న అనాలోచిత పనుల వల్ల ప్రజలంతా చాలా ఇబ్బందిపడుతున్నారని, ఆ సమస్యలకు చెక్‌ పెడతామన్నారు.

రాష్ట్రంలో అన్ని రంగాల్లో పాలన గాడి తప్పిందని పాలనను గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుకే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారీటీతో టీడీపీని గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. దాచుకోవడం.. దోచుకోవడం మినహా రాష్ట్రానికి జగన్‌ మోహన్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. సీఎం పదవికి జగన్‌ అనర్హుడని, గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ఇచ్చిన హమీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, టీడీపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. పన్నులు, చార్జీలు పెంచనని హామీలు గుప్పించిన జగన్‌ అధికారంలోకి రాగానే ప్రజలపై ఎడా పెడా బస్సు, కరెంట్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా అమలయ్యాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటుహక్కు వినియోగించుకుని వైసీపీ తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

పరిపాలనాధక్షుడు, విజన్‌ కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును గెలిపించి రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గుడి పాలన పోవాలంటే అందరూ కలిసికట్టు పోరాటానికి సిద్ధమవ్వాలని, టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన వైసీపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్‌ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE