భువనమ్మకోసం బారులు తీరిన మహిళా లోకం

నిజం గెలవాలి పర్యటనకు మంగళగిరి నియోజకవర్గం వచ్చిన భువనమ్మను చేసి సంఘీభావం తెలిపేందుకు నియోజకవర్గ మహిళలు రోడ్లపై బారులు తీరారు. భువనమ్మ పరామర్శించే ప్రతి కార్యకర్త కుటుంబం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్దఎత్తున భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

మంగళగిరి పట్టణంలో మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. పెనుమాక గ్రామంలో భువనమ్మకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. పెనుమాక సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి భువనమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తనకు పెద్దఎత్తున సంఘీభావం తెలిపిన పెనుమాక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. భువనమ్మ పర్యటన ప్రారంభం నుండి ముగింపు వరకు యువత పెద్దఎత్తున కేరింతలు కొడుతూ భువనమ్మకు తోడుగా ముందు వరుసలో నడిచారు.

భువనమ్మ పర్యటించిన 7 గ్రామాలతో పాటు పెదవడ్లపూడి, దుగ్గిరాల, రేవేంద్రపాడు, మంగళగిరి పట్టణం, పెనుమాక గ్రామాల ప్రజలు భువనమ్మకు ఘనస్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన భువనమ్మ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగుతూ మంగళగిరి నియోజకవర్గ పర్యటన పూర్తిచేశారు.

Leave a Reply