ఎన్నికల కురుక్షేత్రంలో సై అంటే సై అన్నట్లు పోరాడాలి

– ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలి
– పలమనేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు నారా భువనేశ్వరి పిలుపు

2024 ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు సై అంటే సై అనే విధంగా పోరాడాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలమనేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు సూచించారు. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, టీడీపీ కార్యకర్తలపై దుర్మార్గాలకు పాల్పడే వారు ఎన్నికలకు సిద్ధం అంటున్నారు..దానికి టీడీపీ కార్యకర్తలు ధీటుగా నిలబడి ఎన్నికల యుద్ధంలో గెలవాలని కాంక్షించారు.

పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాని మండలం, కతార్లపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన భువనమ్మ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలు ప్రాణా త్యాగాలు చేసి మరీ పార్టీకోసం, చంద్రబాబుకోసం నిలబడుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది.

నాకు ఘన స్వాగతం పలికిన మీ ఉత్సాహం, అభిమానం తెలుగుదేశంపార్టీ కార్యకర్తల్లో చంద్రబాబు, పార్టీపై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం.

గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసింది. అయినా వాటన్నిటినీ తట్టుకుని పార్టీకోసం తడబడకుండా నిలబడుతున్న ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ అభిమానం, మీ త్యాగాలను మేం మరచిపోలేం..పార్టీ కార్యకర్తలకు మా కుటుంబం ఎప్పుడూ రుణపడే ఉంటాం.

తెలుగుదేశంపార్టీ నేడు ఇలా నిలబడి ఉందంటే దానికి కారణం తెలుగుదేశంపార్టీ కార్యకర్తలే. రానున్న ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించుకునేందుకు ప్రతి కార్యకర్త సై అంటూ ముందుకు రావాలి..ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి.

Leave a Reply