Suryaa.co.in

Telangana

పీజేఆర్ ఇల్లు.. ఒక జనతా గ్యారేజ్

– పీజేఆర్ పోరాటం వల్లనే నగరానికి కృష్ణా జలాలు
– డిసెంబర్ 9 లోపు విజన్ డాక్యుమెంట్ ను విడుదల
– న్యూయర్,టోక్యో,సింగపూర్ లతో మనం పోటీ పడాలి
– తెలంగాణ పైన ఎందుకు ఈ వివక్ష?
– పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: జంట నగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్ శకం నడిచింది. హైదరాబాద్ కు వలస వచ్చిన వారిపై దౌర్జన్యాలు జరిగితే పీజేఆర్ అండగా నిలిచారు. సీఎల్పీ నేత గా పీజేఆర్ పోరాటం అందరికీ తెలుసు. పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజ్ లా ఉండేది. పీజేఆర్ పోరాటం వల్లనే నగరానికి కృష్ణా జలాలు వచ్చా యి.

నగర ప్రజలు మంచి నీటి అవసరాలు తీరాయంటే అది పీజేఆర్ చలువనే.హైటెక్ సిటీ మహారాష్ట్ర కు తరలి పోకుండా పీజేఆర్ పోరాటం చేశారు. తెలంగాణ లో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది.హైదరాబాద్ కు ఢిల్లీ,చెన్నై,బెంగళూరు,ముంబై పోటీ కాదు. న్యూయర్,టోక్యో,సింగపూర్ లతో మనం పోటీ పడాలి. నగరాభివృద్ధి కి కొందరు అవాంతరాలు,అడ్డంకులు సృష్టిస్తున్నారు.

తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్,సేమీ అర్బన్ రీజియన్,రూరల్ తెలంగాణ గా విభజించి ముందుకు అడుగులు వేస్తున్నా.ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివసించ లేని పరిస్థితిలో ఉంది. చెన్నై లో వరద కష్టాలు,బెంగుళూరు లో ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి. ముంబై,చెన్నై,బెంగళూరు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి.

రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని క్షమించ వద్దు. గచ్చిబౌలిలో భూముల్లో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి లక్షలాది మంది ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. గచ్చిబౌలి భూములపైన న్యాయపోరాటం చేసి సాధించుకుని లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం.ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేం ఆగం.

హైదరాబాద్ లో కాలుష్యం యమపాశంగా మారుతోంది. రాబోయే 100 యేళ్లకు సరిపోయేలా నగరాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రోడ్ల వెడల్పు, అండర్ పాస్ లు, ప్లై ఓవర్లు నిర్మించబోతున్నాం. డీజిల్ బస్సు ల వల్ల హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతుందని వాటిని జిల్లాలకు తరలించాం.

నగరంలోకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సు లసు తీసుకు వస్తున్నాం. ఆటో ల కొనుగోలు పైన నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్, సీఎన్ జీ ఆటోలకు అనుమతి ఇస్తున్నాం. ఈవీ వెహికల్స్ కు పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపు ఇస్తున్నాం. నగరంలో నాలాల కబ్జాల కారణంగా వర్షపు నీరు రోడ్ల పైకి వస్తోంది.
హైడ్రా తో ఆక్రమణలు తొలగిస్తున్నాం. ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం తొలగించింది. హీరో నాగార్జున స్వయంగా ఎన్ కన్వెన్షన్ కు చెందిన రెండెకరాలు అప్పగించి నగరాభివృద్ధి కి సహకరించారు. 40 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకుల ఆక్రమణలో ఉన్న బతుకమ్మ కుంట ను అభివృద్ధి చేస్తున్నాం.

డిసెంబర్ 9 లోపు విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తాం. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ని నిర్మిస్తున్నాం.ప్రపంచం అంతా భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తోంది. 2029 లో శేరిలింగంపల్లి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉంది. మన్మోహన్ సింగ్, జైపాల్ రెడ్డి వల్ల హైదరాబాద్ కు మెట్రో వచ్చింది. పీవీ నరసింహారావు వల్ల ఐటీ వచ్చింది.

ప్రధాని మోదీ వల్ల హైదరాబాద్ నగరానికి ఇప్పటివరకు ఏం వచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి. బెంగళూరు, చెన్నై, ఏపీ కి మెట్రో రైల్ ఇచ్చారు.. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. గుజరాత్ కు సబర్మతి, ఢిల్లీ కి యమునా, ఉత్తర ప్రదేశ్ కు గంగా ఇచ్చారు..మరి మన మూసీ రివర్ ఫ్రంట్ కు ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు? తెలంగాణ పైన ఎందుకు ఈ వివక్ష?

అభివృద్ధి లో భేషజాలు లేవు.మీ వెంట వస్తామని స్వయంగా కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి నేను అడిగాను. నగరానికి వస్తున్న అమిత్ షా ను కలిసి మా మెట్రో కు, త్రిబుల్ ఆర్ కు, మూసీ కి అనుమతులు ఇవ్వాలని కోరతాం. మెట్రోలో తెలంగాణ తొమ్మిదో స్థానానికి దిగజారింది.. ఇది కిషన్ రెడ్డి కి కనిపించడం లేదా?

ఎవరు కుట్ర లు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలి. పీజేఆర్ విగ్రహం ఏర్పాటు కోసం సరైన స్థలాన్ని గుర్తించాలి. పేదలకు అండగా నిలిచిన పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం మాకు సంతోషం.

LEAVE A RESPONSE