Suryaa.co.in

Andhra Pradesh

స్వరూపకు పోలీసు భద్రత కట్

విశాఖపట్నం : విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది.వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించింది.

గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్‌మెన్‌, ఎస్కార్ట్‌ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహించేవారు. స్వామీజీ బయటకు వస్తే ఎస్కార్ట్‌ వాహనం ద్వారా ట్రాఫిక్‌ నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదాపీఠం ప్రవేశద్వారం వద్దే మూడు షిఫ్ట్‌లు కలిపి 15 మంది ఉండేవారు. ప్రస్తుతం స్వరూపానందేంద్రకు కేవలం ఒక వ్యక్తిగత భద్రతా సిబ్బంది మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది.

LEAVE A RESPONSE