-ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి
-గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపండి
-ఛార్జ్ షీట్ల విషయంలో అలసత్వం వహించద్దు
-హోం మంత్రి అనిత
విశాఖ : గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోపాలపట్నం పీఎస్ ను మంత్రి తనిఖీ చేసిన సమయంలో విశాఖ నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రతబాగ్చివిడియో కాన్ఫరెన్స్ లో (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) నిర్వహిస్తుండగా, హోం మంత్రి అనిత పాల్గొని, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిపీని ఆదేశించారు. పోలీసులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రికార్డులను పరిశీలించి, రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్‌షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని, ట్రాఫిక్, పార్కింగ్‌పై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రజల కష్టం వినాలన్నారు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ కాఫీలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించవద్దన్నారు.
వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి. సింహాచలం ఆలయంలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మహిళా కానిస్టేబుల్స్‌తో మాట్లాడి, వారి యోగక్షేమాలను హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు.