తుమ్మకోట పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని తుమ్మకోట గ్రామ సమీపంలోని అడవిలో పెద్ద పులి సంచరించడంతో పశువుల కాపరి గ్రామస్తులకు తెలిపారు. ఆదివారం ఆవులు తోలుకొని అడవిలోకి వెళ్తున్న సమయంలో కం దినాగమ్మకుంట పైభాగంలో నెమలిశెల వద్ద పెద్ద పులి ప్రత్యక్ష మవడమే కాకుండా ఆవుల మందపై దాడి చేసింది. గోవులు పరారవగా ఆవు దూడ పులి నోట చిక్కింది. గమనించిన పశువుల కాపరి బాలునాయక్ గ్రామంలోకి పరారై గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు.
మండలంలో పెద్ద పులి సంచరించడం, ఆవును భక్షించడం ఇదే మొదటిసారి. ఈ ఘటనా స్థలానికి సమీపంలో కృష్ణానది, అడవి ఉంది.తుమ్మకోట వీఆర్వో నరసింహారావు పులి సంచారం విషయాన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయనిర్మల, సెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించి పాదముద్రలు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయనిర్మల తెలిపారు.