-వృద్ధుల ఉసురు తగిలి పోతావ్ జగన్
-మండుటెండలో వారి ప్రాణాలతో చెలగాటమా?
-పెన్షన్ల పంపిణీలో రాజకీయం సిగ్గుచేటు
-వారి ఆవేదన వింటుంటే బాధ అనిపించింది
-దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
ముండ్లమూరు మండలం పోలవరం, వేంపాడు, రావిపాడు, మారెళ్ల గ్రామాలలో మంగళవా రం ఉదయం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్‌చార్జ్ పమిడి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు పెడుతున్న జగన్ ముసలోళ్ల ఉసురుతో కొట్టుకు పోతాడని, అధికార దాహంతో వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని ధ్వజమెత్తారు. నిన్నటి వరకు సచివాలయాల ద్వారా ఇచ్చిన పెన్షన్లు నిలిపివేసి బ్యాంకుల్లో వేస్తున్నామని చెప్పి మండుతున్న ఎండల్లో ముసలి వాళ్లను తిప్పుతూ వారి ఉసురు కొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా ప్రచారంలో ముసలి వాళ్ల ఆవేదన వింటుంటే చాలా బాధ అనిపించింది. పింఛన్ల పంపిణీని కూడా రాజకీయాలకు వాడుకోవటం సిగ్గుచేటని విమర్శించా రు. పింఛన్ల కోసం వెళ్లి ఏ ఒక్క ప్రాణం పోయినా అందుకు జగన్ బాధ్యత వహించాలని కోరా రు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 30 మందికి పైగా వృద్ధులు ఎండల వేడికి పెన్షన్ల కోసం వెళ్లి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సచివా లయ సిబ్బంది వచ్చి రూ.4000 పింఛన్ ఇస్తారని తెలిపారు. మాట ఇస్తున్నాను..గొట్టిపాటి బిడ్డగా దర్శి అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాను…మీ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటాను. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కూరపాటి శ్రీను, టీడీపీి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.