– ప్రతి రోజూ ప్రజలను కలుస్త అంటివి
– ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి
– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన. పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రభుత్వ నిర్ణయాలు.
ప్రజా పాలన అంటివి. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి. ప్రతి రోజూ ప్రజలను కలుస్త అంటివి. ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా, దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నవు. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావు. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నవు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?