Suryaa.co.in

Telangana

రేవంత్.. మరి ఇప్పుడు ‘మేఘా’ ఈస్టిండియా కంపెనీ కాదా?

– అప్పుడు వద్దన్న మేఘా ఇప్పుడెలా ముద్దయింది?
– వెయ్యి కోట్లకు అనంతగిరి అడవులను మేఘాకు కట్టబెడుతున్నారు
– అనంతగిరి అడవులను అప్పగించకుండా అడ్డుకుంటాం
– రేవంత్ ప్రజలకు ఇచ్చేది తక్కువ ఎగ్గొట్టేది ఎక్కువ
– పోలీస్ పాలన ,మాఫియా పాలన తెచ్చేందుకే రేవంత్ తరచూ కమాండ్ కంట్రోల్ కి వెళ్తున్నారు
– శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ,మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ ,చిరుమర్థ్ లింగయ్య ,డాక్టర్ మెతుకు ఆనంద్

హైదరాబాద్‌: మేఘా కంపెనీ ని ఈస్ట్ ఇండియా కంపెనీ తో పోల్చిన రేవంత్ రెడ్డి అదే సంస్థతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతగిరి అడవులను మేఘా సంస్థకు రేవంత్ వెయ్యికోట్లకు దారాదత్తం చేశారు. మెఘా అనేది ఇంజినీరింగ్ సంస్థ .వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు కు మేఘాతో ఎలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు ? అనంతగిరి అడవులను అప్పగించే ప్రయత్నం పై త్వరలోనే ప్రజా మద్దతుతో ఉద్యమం ప్రారంభిస్తాం.

అసహనం వల్లే సీఎం కే టీ ఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అట్టెన్షన్ డెఫిషియన్సీ సిన్డ్రోమ్ తో భాదపడుతున్నారు. సింగపూర్ ను రాష్ట్రం అంటున్నాడు. అమెజాన్ వెబ్ సీరీస్ అంటున్నాడు. టీబీ వ్యాధిని లెప్రసి గా చెబుతున్నాడు. ఇలాంటి అవగాహన లేని సీఎం దేశం లో మరొకరు లేరు. అనుభవరాహిత్యం లో రేవంత్ కు రేవంతే సాటి.

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల పై గొప్పలు చెప్పుకుంటున్నారు. దావోస్ టూర్ నెట్ వర్కింగ్ కు మాత్రమే ఉపయోగ పడుతుందని చంద్రబాబు సరిగ్గా చెప్పారు. దేశం లో తన పాటి సీఎం మఱొక్క లేనట్టుగా రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదం. గతం లో కుదిరిన 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 10 వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్రానికి రాలేదు. దావోస్ లో కుదిరే పెట్టుబడుల్లో చాలా వరకు రావని గత అనుభవాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. పథకాల పై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక రేవంత్ పెట్టుబడుల పై మాట్లాడుతున్నారు. సుస్థిర పాలన కేసీఆర్ ఆనాడు అందించారు కనుకే, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి వాస్తవరూపం దాల్చాయి. కేటీఆర్ పనితనం వల్లే ఐటీ రంగం రాష్ట్రం లో పురోగమించింది.
ప్రజలను రేవంత్ ఊహల పల్లకిలో ఊరేగిస్తున్నాడు. రేవంత్ అన్నింటిపై పలాయన వాద వైఖరి అవలంభిస్తున్నాడు. రేవంత్ వి ఉత్తరకుమార ప్రగాల్భాలు. కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తే రేవంత్ రాష్ట్రం లో అస్థిరత తెచ్చారు. ప్రజలే స్వచ్చంధంగా ప్రభుత్వం పై తిరగబడుతున్నారు.

కేసీఆర్ కట్టిన అంత పెద్ద సచివాలయం ఉండగా పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి సీఎం రేవంత్ ఎందుకు సమీక్షలు చేస్తున్నారు? పోలీస్ పాలన ,మాఫియా పాలన తెచ్చేందుకే రేవంత్ తరచూ కమాండ్ కంట్రోల్ కి వెళ్తున్నారు. రేవంత్ తస్మాత్ జాగ్రత్త ,బీ ఆర్ ఎస్ నేతల పై తప్పుడు కేసులు సహించం. ఇప్పటికైనా సీఎం హామీల అమలు పై దృష్టి సారించాలి.

వికారాబాద్ రోడ్లను బాగు చేయని సీఎం లక్ష కోట్లు పెట్టుబడులు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ కు టీబీ ఏమిటో లెప్రసి ఏమిటో కూడా తెలియడం లేదు. ముందు రోడ్లు బాగు చేయండి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లో మోసాలు జరుగుతున్నాయి. బేస్మెంట్ వరకు కట్టుకుంటే డబ్బులు ఇస్తామంటున్నారు. ఎస్సీ ,ఎస్టీల దగ్గర డబ్బులు ఎక్కడివి ? అన్ని పథకాల్లో మోసమే జరుగుతోంది.

తూతూ మంత్రంగా మండలానికో గ్రామం లో పథకాలు ప్రారంభించారు. మునిపల్ వార్డుల్లో ఎక్కడా పథకాలు ప్రారంభం కాలేదు. ఉపాధి హామీ కార్డుతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు లింక్ పెట్టడం ఏమిటి ? జాబ్ కార్డుతో సంబంధం లేకుండా భూమి లేని కూలీలు అందరికీ పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలి. రేవంత్ ప్రజలకు ఇచ్చేది తక్కువ ఎగ్గొట్టేది ఎక్కువ అని పథకాలను చూస్తే అర్థమవుతుంది.

పథకాలకు అర్హులు కావాలంటే ప్రజలు భూములు అమ్ముకునే పరిస్థితిని రేవంత్ రెడ్డి తెచ్చారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. రిజర్వేషన్లు పెంచక ఎన్నికలు నిర్వహిస్తే బీసీ లు కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు రానివ్వొద్దు.కుంభ

మేళా లో జరిగిన తొక్కిసలాట లో భక్తులు మరణించడం దిగ్భ్రాంతి ని కలిగించింది . మృతుల కుటుంబాలకు బీ ఆర్ ఎస్ పార్టీ తరపున సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలను కేంద్రం ,యూపీ ప్రభుత్వం ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి.

LEAVE A RESPONSE