నేను ప్రభుత్వం లోకి వస్తే కరెంట్ బిల్లు పెంచనని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకొచ్చిన తర్వాత ఇప్పటికీ 8 సార్లు కరెంట్ బిల్లు పెంచారు.
వివరాలలోకి వెళితే.. యూనిట్ 3,4 రూపాయలు దొరుకుతున్న విండ్ పవర్ అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆరోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఇది సరైన నిర్ణయం కాదని, ఈ రకంగా చేస్తే ఇండస్ట్రీ దెబ్బతింటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పవలసిన రీతిలో చెప్పింది. నేను యూనిట్1.50,2.00 కొంటానని బీరాలు పలికారు.
కరెంటు ఉత్పత్తి కొంత ప్రకృతి సహకరించక సకాలంలో వర్షాలు పడక, హైడ్రో పవర్ ప్రొడక్షన్ జీరో పర్సెంట్ కొచ్చి కొంత, మన రాష్ట్రంలో ఉన్న 3 థర్మల్ పవర్ స్టేషన్స్ బొగ్గు కొరతతోకొంత, వాటి మిషనరీని సరి అయిన మెయింటినెన్స్ చేయక కొంత, ఇవ్వవలసిన నాణ్యమైన బొగ్గును సరిపడా ఇవ్వక కొంత, ఈ కారణాలు దృష్ట్యా ప్రొడక్షన్ రాక ఆ భారం అంతా ప్రస్తుతం కరెంటు యూనిట్ 12,15 రూపాయలకు కొని ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నెత్తిన రుద్దుతున్నాడు . FPPCA (FUEL & POWER PURCHASE COST ADJUSTENT) పేరుతో ట్రూ అప్ చార్జీల క్రింద ప్రజల నెత్తిన ప్రభుత్వం రుద్దుతుంది.
మనకున్న థర్మల్ ప్రాజెక్టు విదేశీ బొగ్గును 30% స్వదేశీ బొగ్గును 70% రేషియోలో వేసేటట్టుగా ప్లాంట్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉదాసీనత వల్ల, అసమర్థత వల్ల, విదేశీ బొగ్గు కొనలేక స్వదేశీ బొగ్గుని వాడటం వల్ల ప్రొడక్షన్ తక్కువ వస్తుంది.
వాటి వివరాలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జెన్కో 800*3=2400 యూనిట్ లకు డిజైన్ చేస్తే ప్రస్తుతం కరెంటు ఉత్పత్తి అయ్యేది 1,350 యూనిట్లు మాత్రమే. వైయస్సార్ కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో 600*1=600,210*5=1050 మొత్తం కలిపి1,650 యూనిట్లు తయారు కావాల్సి ఉంటే అక్కడ ప్రస్తుతం తయారయ్యేది 1050 యూనిట్లు మాత్రమే.
దీనికి కారణం యూనిట్లు సరైన మెయింటినెన్స్ లేక, బొగ్గు ఫీడింగ్ 30 : 70 రేషియోలో ఇవ్వక ఈ ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. ఇదంతా సరైన ప్రణాళిక లేక, నాణ్యమైన బొగ్గుకు అడ్వాన్స్ కట్టి తేలేక, విదేశీ బొగ్గు కొనలేక ఈ విధమైన పరిస్థితి దాపురించింది.
ఈ థర్మల్ ప్లాంట్లు అన్నీ కూడా ఒకవైపు ఉద్యోగస్తులను, టెక్నికల్ ఉద్యోగస్తులకు, ఇతరులకు పెట్టవలసిన ఖర్చు పెడుతూ ఇవ్వవలసిన జీతాలు ఇస్తూ, వారి చేత పూర్తి పని చేయించుకోలేక, మరొకవైపు ప్రభుత్వం సరైన పెట్టుబడి పెట్టక వారి సేవలను ఉపయోగించుకోలేక ఉత్పత్తి తగ్గి పోతుంది. దీని భారం అంతా తిరిగి ప్రజల మీదనే పడుతుంది.
ప్రభుత్వం చేయవలసిన బాధ్యత సక్రమంగా చేయక,ఆ భారాన్నంతా,ఆ ఖర్చు అంతా ప్రభుత్వం నోరులేని ప్రజలమీద వేస్తుంది. ప్రభుత్వం చేయవలసిన పని సరిగా చేయక, పెట్టవలసిన పెట్టుబడి పెట్టక, నిర్వహణ లోపాల వల్ల ప్రజల నెత్తిన భారం మోపడం ఎంత వరకు కరెక్టు.
ఇంకొక వైపు కరెంటు ఉత్పత్తి తగ్గడం వల్ల.. ఇండస్ట్రీల అన్నిటికీ అనఫీషియల్ కరెంటు కోత విధించి ఉన్నారు.ఆ ఏరియా లైన్మెన్లు చేత రోజు మార్చి రోజు ప్రొడక్షన్ చేసుకోమని చెప్పి పంపుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి తగ్గి రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పడిపోతుంది. వీటన్నింటికీ సమాధానం రాబోయే ఎన్నికలే మీ చేతుల్లో ఉండే ఓటే ఆయుధం గుర్తుంచుకోండి.